newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

లాక్ డౌన్ తెచ్చిన సమస్య.... భర్తకి తలకొరివి పెట్టిన భార్య

25-03-202025-03-2020 16:43:43 IST
Updated On 25-03-2020 16:43:20 ISTUpdated On 25-03-20202020-03-25T11:13:43.034Z25-03-2020 2020-03-25T11:11:34.699Z - 2020-03-25T11:13:20.178Z - 25-03-2020

లాక్ డౌన్ తెచ్చిన సమస్య.... భర్తకి తలకొరివి పెట్టిన భార్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా  మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు లాక్ డౌన్ అని రాష్ట్ర ప్రజలందరినీ ఇళ్లలోనే  ఉండమన్నారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న ఓరైతు తను పండించిన పంటలను అమ్మ లేక తెచ్చిన అప్పులు తీర్చలేక గుండెపోటుతో  మరణించాడు. కాన అంత్యక్రియలకు మాత్రం ఇబ్బందులు తప్పలేదు. కొడుకు, కూతురు రాలేకపోవడంతో భార్య తలకొరివి పెట్టాల్సి వచ్చింది. వరంగల్ అర్బన్ జిల్లా.ధర్మసాగర్ మండలం నారయణగిరి గ్రామంలో అప్పుల బాధ భరించలేక గుండెపోటుతో కోరెం ప్రభాకర్ రెడ్డి మరణించారు. ఆయనకు ఇద్దరు పిల్లలు కొడుకు విదేశాలలో  సాయికృష్ణారెడ్డి ఆస్ట్రేలియా లో ఎంఎస్ చదువుతున్నాడు. కుమార్తె నితీషా రెడ్డి బెంగళూర్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. కరోనా ప్రభావంతో కన్న తండ్రిని చివరి చూపుకూడా చూసుకోలేని పరిస్థితి వచ్చింది.

దీనితో తండ్రి అత్యక్రియలను అంతర్జాలంలో చూస్తూ కన్నీటి పర్యంతమయ్యారు కన్నబిడ్డలు. కన్నతల్లి మాత్రం చేసేదేమీ లేక తానే భర్తకు అంతిమ సంస్కారాలు చేయాల్పి వచ్చింది. కరోనా వైరస్ వలన చుట్టాలు కూడా రాక 10 మందితో మాత్రమే చితికి నిప్పటించడం జరిగింది. తన భర్తకు రైతుబంధు డబ్బులు వచ్చి ఉంటే వారికి ఈ గతి పట్టేది కాదని ఆవేదన చెందారు. ఇప్పటికైనా వారి భర్తకు రైతు బంధు,రైతు భీమా వచ్చేటట్లు చేసి అప్పుల్లో ఉన్న వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇంటి నుంచి శ్మశానవాటిక వరకు, అనంతరం అంత్యక్రియలను నిర్వహించడంలో సహధర్మచారిణిగా నిలిచింది. కరోనా వైరస్‌ కారణంగా అంత్యక్రియలకు పది మంది కూడా హాజరుకాలేదు.

ప్రేమ జంట ఆత్మహత్య 

చిన్నచిన్న కారణాలతో ప్రేమించుకుని ఒక్కటైన జంటలు బలవన్మరణాలకు పాల్పడుతున్నాయి. పెళ్లయిన వారు కూడా ప్రియురాలి మోజులో పడుతున్నారు. చివరకు పెద్దల ముందు తలవంచుకుంటున్నారు. అవమానభారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొమురంభీమ్ అసిఫాబాద్  జిల్లా కాగజనగర్ మండలంలోని అంకుసాపూర్ అడవి ప్రాంతంలో చెట్టు కు ఉరి వేసుకుని  ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది ప్రియుడు  దహేగం మండలం బిబ్రా గ్రామానికి చెందిన దుర్గం సంతోష్ కాగా  ప్రియురాలి  కగజ్ నగర్ మండలం సార్ సల గ్రామానికి చెందిన డోకె శైలజ.

Image may contain: one or more people, people standing, outdoor and nature

వీరిద్దరూ  గత  కొన్ని సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. ప్రియుడు దుర్గం సంతోష్ కు ఇంత క్రితమే  వివాహం అయి ఇద్దరూ పిల్లలున్నారు. ప్రియురాలు శైలజతో ప్రేమాయణం నడిపిస్తూ  ఆమెతో వివాహేతర సంబంధం పెట్టు కున్నట్లు సంతోష్ ఇంట్లో తెలియడంతో ఇద్దరిని పిలిచి మందలించారు. దీనికి  మనస్తాపం చెందిన ఇద్దరు ఉదయం ప్రియుడు ద్విచక్ర వాహనంపై ప్రేయసి శైలజను తీసుకుని కాగజ్ నగర్ మండలం అంకుశపూర్ అటవీ ప్రాంతంలో చెట్టు కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.. సంఘటన స్థలానికి చేరుకొని  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle