newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లడ్డూ కావాలా నాయనా.. లక్షలు పలుకుతున్న లడ్డూలు..!

13-09-201913-09-2019 17:33:25 IST
2019-09-13T12:03:25.794Z13-09-2019 2019-09-13T12:03:23.234Z - - 15-05-2021

లడ్డూ కావాలా నాయనా.. లక్షలు పలుకుతున్న లడ్డూలు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భాగ్యనగరంలో గణపతి నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. సామూహికంగా జరుపుకునే ఈ వేడుకలకు మహారాష్ట్ర తరువాత అంతటి గుర్తింపు ఉందనే చెప్పాలి. హైదరాబాద్ లోనే. వాడవాడలా కొలువుదీరిన గణనాథులు తొమ్మిది రోజులూ పూజలందుకుని భక్త జనులను ఆనందపరవశులను చేయడం ఒకెత్తైతే...నిమజ్జన వేడుక ఒక్కటీ మరొక ఎత్తు. లక్షలాది మంది జనం పాల్గొనే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్ణంగా, శాంతియుతంగా నిర్వహించే విషయంలో యావత్ ప్రభుత్వ యంత్రాంగం అవిశ్రాంతంగా శ్రమిస్తుంది. 

స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తాయి. ఎక్కడికక్కడ గణనాథులకు స్వాగత ఏర్పాట్లు చేయడంలోనూ, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవడంలోనూ ప్రభుత్వ యంత్రాంగానికి స్వచ్ఛంద సంస్థలు ఇతోధికంగా సహకారం అందిస్తాయి. ఏటా జరిగే ఈ వేడుక ప్రతి ఏటా కొత్తదనాన్ని సంతరించుకుంటుంది. భాగ్యనగరం మొత్తం భక్తి పారవశ్యంలో ముగిని పోతుందంటే అతిశయోక్తి లేదు. ఈ వేడుకలన్నీ ఒకెత్తూ బాలాపూర్ గణేష్ మంటపంలో నిర్వాహకులు లడ్డూ వేలం ప్రసిద్ధి చెందిన తరువాత అన్ని గణేష్ మంటపాలలోనూ బాలాపూర్ లడ్డూ వేలంను అనుకరించడం ఆరంభించారు. 

ఏటికేడు లడ్డూ వేలంపాటలో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. అలాగే వేలంలో లడ్డూ ధర కూడా ఆకాశానికి అంటుతోందంటే అతిశయోక్తి కాదు. బాలాపూర్ లడ్డూనే తీసుకుంటే ఆ లడ్డూ ధర ఈ సారి 17.60లక్షలు పలికింది. గత ఏడాది ధర కంటే ఇది లక్ష రూపాయలు అధికం. అలాగే భాగ్యనగరంలో కీలకమయిన జూబ్లిహిల్స్ ఫిలింనగర్ వినాయక్ నగర్ గణేషుడు తన ప్రత్యేకత చాటుకున్నాడు. ఈ లడ్డూ వేలంలో 17.75లక్షలు పలికింది.ఇక సన్ సిటీ గణేషుడి లడ్డూ వేలంలో 18.51లక్షల రూపాయలు పలికింది. ఇలా ఏటి కేడు గణేషుడి లడ్డూ వేలం పెరుగుతూ వస్తున్నది. 

గణేషుడి లడ్డూను వేలంలో దక్కించుకున్న వారికి శుభాలు కలుగుతాయన్న విశ్వాసం ఏర్పడటంతో సామాన్యులు కూడా లక్షలు పోసి లడ్డూ దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు. రాష్ట్రాల సరిహద్దులు దాటి మరీ భాగ్యనగరానికి వచ్చి లడ్డూ వేలంలో పాల్గొనేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చారంటే ‘వేలం’ ఎంత ప్రసిద్ధి చెందిందో అర్ధం చేసుకోవచ్చు.

ఏపీలో గణేష్ మండపాలలో కూడా లడ్డూ వేలం ప్రక్రియను మొదలు పెట్టినప్పటికీ...హైదరాబాద్ లో వేలం తీరే వేరు. దానికి ఉన్న ప్రాచుర్యమే వేరు. లడ్డూ ప్రసాదం ధర ఏటికేడు పెరగడం వల్ల మరుసటి ఏడు గణేష్ చతుర్ధి వేడుకలు మరింత ఘనంగా జరిపేందుకు అవకాశం ఏర్పడుతున్నదని నిర్వాహకులు చెబుతున్నారు. బాలాపూర్ లడ్డూ వేలానికి వచ్చిన ప్రాచుర్యం కారణంగా అపార్ట్ మెంట్లలో, కార్యాలయాలలో ఏర్పాటు చేసే గణేష్ మంటపాలలో కూడా లడ్డూ వేలం పాటలు ప్రారంభమయ్యాయి. అవి కూడా పోటీపోటీగా సాగి లక్షలకు చేరుకుంటున్నాయి. దీంతో లడ్డూ కావాలంటే లక్షలు పోసి కొనాల్సిందే. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle