newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్... చూసి తీరాల్సిందే!

21-07-201921-07-2019 08:50:15 IST
Updated On 29-07-2019 16:52:54 ISTUpdated On 29-07-20192019-07-21T03:20:15.435Z20-07-2019 2019-07-20T12:55:07.317Z - 2019-07-29T11:22:54.305Z - 29-07-2019

రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్... చూసి తీరాల్సిందే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో వాననీటి వృధాను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాననీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, మేఘంనుంచి రాలిపడ్డ ప్రతి నీటిచుక్కను ఒడిసి పట్టాలని పర్యావరణ వేత్తలు, ప్రముఖులు నొక్కిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో నీటి సంరక్షణ విధానాలు, వాననీటి సేకరణ గురించి  తెలుసుకునేందుకు హైదరాబాద్ నగరంలో ఓ థీమ్‌ పార్కు ఏర్పాటుచేసింది వాటర్ బోర్డు. జనానికి అవగాహన కల్పించేందుకు ఈ థీమ్ పార్క్ ఎంతగానో తోడ్పడుతోంది. 

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వాన నీటి సంరక్షణ తాలూకు ప్రాముఖ్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సి వుందంటూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు కూడా దీనిపై ట్విట్టర్‌ వేదికగా ఇటీవల పిలుపునిచ్చారు.

వాన నీటి సంరక్షణపై ఆసక్తి కలిగినవారు తప్పనిసరిగా రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ థీమ్‌ పార్కును సందర్శించాలంటూ దానికి సంబంధించిన పలు చిత్రాలను షేర్‌ చేయడంతో ఈ పార్కుకి ప్రాధాన్యత పెరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్ 51లో జలమండలి ఆధ్వర్యంలో కొండలతో ఉన్న ప్రాంతాన్ని 1.2 ఎకరాల విస్తీర్ణంలో రూ.3 కోట్ల వ్యయంతో ఈ థీమ్‌పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో వర్షపు నీటిని దాచేందుకు వీలుగా 42 రకాల వినూత్న విధానాలను వివరిస్తున్నారు. 

జంటనగరాలకు చెందిన ప్రజలు, ప్రముఖులు, విద్యార్దులు ఈ థీమ్ పార్కుని సందర్శిస్తున్నారు. గతేడాది అక్టోబరులో ఈ పార్క్‌ను ప్రారంభించారు. ఇప్పటివరకు పదివేలమందికి పైగా ఈ పార్కుని సందర్శించినట్టు అధికారులు తెలిపారు. భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో ప్రతి నీటి చుక్క ఎంతో విలువైనది. లేదంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొంటున్నట్టే మున్ముందు బిందెడు నీళ్లు కూడా అధిక రేటుకి కొనుగోలు చేయాల్సి రావచ్చు. అందుకే నీటిని చాలా పొదుపుగా వాడుకోవాల్సి వుంటుంది. 

నగరం, పల్లె, పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, కార్యాలయం, పాఠశాల, అపార్టుమెంటు ఇలా ఎక్కడైనా వర్షం నీటిని భూమిలోకి పంపే ఏర్పాటు చేసుకోవచ్చు. నేలపై కురిసే ప్రతీ వర్షపునీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భంలోకి చేర్చేందుకు వీలుగా విభిన్న రకాల ఇంకుడు గుంతలను ఏర్పాటుచేసుకోవచ్చు. ఈ ఇంకుడు గుంతల వల్ల బోరుబావులు మళ్ళీ రీఛార్జి అవుతాయి. దీంతో మండువేసవిలోనూ బోర్లు ఎండిపోవడం జరగదు. 

ఈ థీమ్ పార్కులో అడవుల ప్రాముఖ్యాన్ని వివరించే ‘మాట్లాడే చెట్టు’.. వర్షపు నీటి సంరక్షణపై వీడియో గేమ్స్‌ ఇలా ఎన్నో ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకూ సందర్శించవచ్చు. ప్రతి పౌరుడు తన ఇంట్లో ఎలా రెయిన్ వాటర్ ఎలా హార్వెస్ట్ చేయాలో తెలుసుకోవచ్చు అన్నారు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్  ఓఎస్డీ సత్యనారాయణ. ఈ పార్క్ ద్వారా పిల్లలకు మంచి అవగాహన కలుగుతుందని, చోటా భీమ్ కార్టూన్ ఫిల్మ్ అందరి మన్ననలు పొందుతోందని ‘న్యూస్ స్టింగ్’ ప్రతినిధికి వివరించారు. వర్షపు నీటిని ఎలా నిల్వచేయవచ్చో వివరంగా తెలియచేశామన్నారు. ఇలాంటి థీమ్ పార్క్ కర్నాటక జయానగర్ లో ఉందని, దానిని చూసి కేటీఆర్ ఆదేశాలతో 100 రోజుల్లో ఈ థీమ్ పార్క్ పూర్తిచేశామన్నారు సత్యనారాయణ.

Image may contain: 1 person

ఈ థీమ్ పార్కుని పలువురు ప్రముఖులు సందర్శించారు. కార్వే ఛైర్మన్ పార్థసారథి ఈ థీమ్ పార్క్ చూసి ఫిదా అయిపోయారు. వాననీటిని ఆదాచేయడం, ఉపయోగించడం అనే అంశాలను బాగా ఆలోచింపచేసేలా ఈ థీమ్ పార్క్ ఉంది. ఇలాంటి థీమ్ పార్క్ లు అవసరం ప్రతినగరంలో ఉంది. నగరాలు మరింతగా అభివృద్ధి చేసుకోవడానికి ఇలాంటి వాటి ద్వారా వీలు కలుగుతుందన్నారు హార్టికల్చర్ అండ్ ఆగ్రో వైస్ ప్రెసిడెంట్ రవి చంద్రశేఖర్.

Image may contain: 4 people, including Bharadwaja Rangavajhala, people standing, outdoor and nature

రామోజీ రావు కోడలు విజయేశ్వరి, రామోజీ ఫిల్మ్ సిటీ  అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ వెంకటరత్నం, డైరెక్టర్ శివరామకృష్ణ ఈ థీమ్ పార్క్‌ని  సందర్శించారు. ఈ పార్కు ఎంతో ఉపయుక్తంగా ఉందని,  విద్యార్ధులకు, సంస్థలకు నీటి నిల్వ పద్ధతులను తెలియచేసేలా ఉందన్నారు. కేవలం తెలంగాణకే కాదు, మిగతా ప్రాంతాల వారికి కూడా ఇది మార్గదర్శకం అవుతుంది. అధికారులకు అభినందనలు. కేవలం థియరీతో సరిపెట్టకుండా.. వాటర్ హార్వెస్టింగ్ పై అవగాహన పెంచేందుకు ఎన్నో మార్గాలు అనుసరించారన్నారు వెంకటరత్నం.

రాబోయేతరం మేల్కొనకపోతే నీరు చాలా ఖరీదైన వస్తువు కానుంది. అందుకే నీటిని పొదుపుగా వాడుకోవడం, వర్షపు నీటిని మళ్ళీ భూమిలోకి పంపి భూగర్భజలాలను పెంచడం తక్షణ కర్తవ్యం. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్ భావితరాలకు ఒక దిక్సూచి. ప్రతి ఇంట ఇంకుడుగుంతలు ఏర్పాటుచేయడం ద్వారా నీటినిధి మన సొంతం అవుతుంది. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్ ఆలోచన నిజంగా అభినందనీయం. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle