newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

రుతుపవనాలతో తడిసి ముద్దవుతున్న తెలుగు రాష్ట్రాలు

20-10-201920-10-2019 10:02:47 IST
2019-10-20T04:32:47.518Z20-10-2019 2019-10-20T04:32:20.884Z - - 25-05-2020

రుతుపవనాలతో తడిసి ముద్దవుతున్న తెలుగు రాష్ట్రాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జూన్, జూలై నెలల్లో వర్షాలు ఆలస్యం అయినా ఆగస్ట్-సెప్టెంబర్ లో భారీవర్షాలు ముంచెత్తుతుంటాయి. ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలను మరోసారి భారీ వర్షాలు ఠారెత్తిస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అనేకచోట్ల భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణలో గత వారంరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనం తడిసిముద్దయ్యారు. 

హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరంగల్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. పరకాలలో కుండపోత వర్షం కురిసింది.

నర్సంపేట, కొత్తగూడలో వర్షం కుమ్మేసింది.  సీజన్‌‌లో వర్షాలు విస్తారంగా కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాధారణం కంటే 35శాతం వర్షపాతం అధికంగా కురిసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అక్టోబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 66.4 మిల్లీమీటర్లు కాగా, 89.4 మిల్లీమీటర్లు నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఆది, సోమవారాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపుల కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

వర్షంతోపాటు  పిడుగులు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.అక్టోబర్ 21, 22 తేదీల్లో కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన ఉంటుందని ఐఎండీ తెలిపింది.

ఖండాంతరాలకు వ్యాపించిన జ్యోతి సాహసం.. ఇవాంకా ప్రశంసలు

ఖండాంతరాలకు వ్యాపించిన జ్యోతి సాహసం.. ఇవాంకా ప్రశంసలు

   11 hours ago


మేఘాలలో తేలిపోయేలా... మేఘాలయా సీఎం సంగ్మా గిటార్ హాబీ

మేఘాలలో తేలిపోయేలా... మేఘాలయా సీఎం సంగ్మా గిటార్ హాబీ

   14 hours ago


ఈ దొంగ మామూలోడు కాదు.. ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్ళబోయాడు

ఈ దొంగ మామూలోడు కాదు.. ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్ళబోయాడు

   16 hours ago


వెండి నాణేల తుపాన్ ... అదనుచూసి ఎత్తుకెళ్లారు

వెండి నాణేల తుపాన్ ... అదనుచూసి ఎత్తుకెళ్లారు

   18 hours ago


కన్నతండ్రికోసం 1200 కి.మీ. సైకిల్ ప్రయాణం.. శ్రవణ 'కుమారి'కి సోషల్ మీడియా జేజేలు

కన్నతండ్రికోసం 1200 కి.మీ. సైకిల్ ప్రయాణం.. శ్రవణ 'కుమారి'కి సోషల్ మీడియా జేజేలు

   23-05-2020


గాంధీ హాస్పిటల్ వైద్యుల ఘనత.. ప్లాస్మా థెరపీ సక్సెస్

గాంధీ హాస్పిటల్ వైద్యుల ఘనత.. ప్లాస్మా థెరపీ సక్సెస్

   22-05-2020


చుట్టుముట్టిన సింహాలు.. అంబులెన్స్‌లోనే ప్రసవం

చుట్టుముట్టిన సింహాలు.. అంబులెన్స్‌లోనే ప్రసవం

   22-05-2020


వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం

   21-05-2020


నారాయణ అధ్యాపకుల ఆమరణ నిరాహారదీక్ష

నారాయణ అధ్యాపకుల ఆమరణ నిరాహారదీక్ష

   21-05-2020


వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి ప్రియురాలు ఆత్మహత్య

వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి ప్రియురాలు ఆత్మహత్య

   21-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle