newssting
BITING NEWS :
*దిశ ఘటన మరువక ముందే మరో విషాదం... ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి*హైదరాబాద్‌ టీ-20లో టీమిండియా ఘన విజయం.. వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టిన భారత జట్టు *హైదరాబాద్‌: ఎన్‌కౌంటర్‌ ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ.. నిందితుల మృతహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలన్న హైకోర్టు... 9న ఉదయం 10.30 గంటలకు విచారణ *కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.*నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డగా మారింది: వైకాపా నేత, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి*చింతపల్లిలో దారుణం.. కుక్కలకు బలయిన శిశువు *కర్నూలు: ఉల్లి కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన*ఇవాళ జార్ఖండ్ లో రెండవ విడత పోలింగ్ *దిశ నిందితులు కరుడుగట్టిన నేరస్తులు : సీపీ సజ్జనార్

రావి ఆకులు గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?

02-12-201902-12-2019 09:32:28 IST
2019-12-02T04:02:28.977Z02-12-2019 2019-12-02T04:02:26.679Z - - 07-12-2019

రావి ఆకులు గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రావి లేని ఊరు, వేప‌లేని వీధి ఉండ‌కూడ‌ద‌ని మ‌న పెద్ద‌లు చెప్పే మాట‌. అంత‌లా ఈ చెట్ల‌కు మ‌న పూర్వీకులు ప్రాధాన్య‌త ఇచ్చారు. భార‌తీయ సంప్ర‌దాయంలో రావి చెట్టుకు విశేష ప్రాధాన్య‌ముంది. హిందువులు, బౌద్ధులు, జైనులు, ఈ వృక్షాన్ని ఎంతో ప‌విత్రంగా పూజిస్తారు. దీనిని సంస్కృతంలో అశ్వ‌ద్ధ వృక్ష‌ము అని అంటారు. దీని శాస్త్రీయ నామం ఫైక‌స్ రెలీజియోసా.

భ‌గ‌వ‌ద్గీత‌లో శ్రీ‌కృష్ణుడు నేను వృక్ష‌ముల్లో అశ్వ‌ద్ధ వృక్ష‌మున‌ని చెప్పారు. బుద్ధుడికి రావి చెట్టు కింద జ్ఞానోద‌యం అయింది. అందుకే  ఈ వృక్షాన్ని బోది వృక్ష‌మ‌ని పిలుస్తారు. ఈ చెట్టు ప‌విత్ర‌తోపాటు త‌న‌లో ఎన్నో ర‌కాల ఆయుర్వేద సుగుణాల‌ను ఇముడ్చుకుంది.

రావి చెట్టులోని ప్ర‌తి భాగం ఎన్నో ఆయుర్వేద గుణాల స‌మాహారం. రావి చెట్టు నుంచి వ‌చ్చే గాలి ఎంతో శ్రేష్ట‌మైన‌ది. దీని ఆకుల నుంచి ప్రాణ‌వాయువు వ‌స్తుంది. ఈ గాలిని పీల్చితే ఎన్నో ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. అందుకే వీధుల్లో.. దేవాల‌యాల ప్రాంగ‌ణాల్లో రావి చెట్టును పెంచుతారు...

రావి చిగుళ్ల‌ను పాల‌లో ఉడికించి వ‌డ‌క‌ట్టి తాగితే మెద‌డు చైత‌న్య‌మై చురుగ్గా ప‌నిచేస్తుంది. రావి చెట్టు పండ్లు తింటే జీర్ణ‌శ‌క్తి పెరిగి మ‌ల‌బ‌ద్ద‌క స‌మ‌స్య దూర‌మ‌వుతుంది. దీని పండ్ల‌ను తింటే గుండె సంబంధ వ్యాధులు న‌య‌మ‌వుతాయి. రావి పుల్ల‌ల‌తో దంతాలు తోముకుంటే దంతాలు గ‌ట్టిప‌డి దంగ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

రావి ప‌ళ్ల‌ను నీడ‌లో ఎండ‌బెట్టి చూర్ణం చేసుకుని దానికి స‌రిస‌మానంగా ప‌టిక బెల్లం క‌లిపి ఉద‌యం, సాయంత్రం తీసుకుంటే శృంగార సామ‌ర్ధ్యం పెర‌గ‌డంతోపాటు వీర్యం వృద్ధి అవుతుంది. సంతానం క‌ల‌గ‌ని స్త్రీలు ఈ మిశ్ర‌మాన్ని బ‌హిష్టి అయిన నాల్గ‌వ రోజు నుంచి 14 రోజుల‌పాటు తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.  

ఆర్థిక ఇబ్బందుల‌తో బాధ‌ప‌డేవారు రావి ఆకుల‌తో ఇంట్లో తోర‌ణం క‌డితే ఆర్థిక స‌మ‌స్య‌లు తొలగి ఇంట్లో ప్ర‌శాంతత ఏర్ప‌డుతుంద‌ని ప‌లువురి న‌మ్మ‌కం. వినాయ‌క చ‌వితి రోజున గ‌ణ‌ప‌తికి చేసే ఏక‌విసంతీప‌త్ర పూజా క్ర‌మంలో అశ్వ‌ద్ధ‌ప‌త్రం 19వ‌ది. రావి ఆకులు చాలా బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం. వీటిలో 14 శాతం వ‌ర‌కు ప్రొటీన్లు ఉన్నాయి. గొర్రెలు, మేక‌లు, ప‌శువుల‌కు రావి ఆకులు మేత‌గా వేస్తే పాల‌శాతం పెరుగుతుంది.

Image result for peepal tree benefits

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle