newssting
BITING NEWS :
*దేశంలో కరోనా విజృంభణ... 7,42,661, మరణాలు 20,53, కోలుకున్నవారు 4,57, 016 *నేడు వైఎస్సార్‌ 71వ జయంతి *ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్ *శ్రీకాకుళం జిల్లాలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటన..ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విజయసాయిరెడ్డి *కడప : ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల తో కలసి నివాళులర్పించనున్న సీఎం జగన్*తెలంగాణలో 1879 కరోనా పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 313 మంది మృతి..హైదరాబాద్ లో 1422 కేసులు..యాక్టివ్ కేసులు 11,012, డిశ్చార్జ్ అయిన కేసులు 16,287* రాజ‌ధానిలో త‌ల‌పెట్టిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటును విజ‌య‌వాడ‌కు మార్చిన ఏపీ స‌ర్కార్ *ముంబై ఎయిర్‌పోర్టు అథారిటీ నిధుల గోల్‌మాల్‌పై ఇప్ప‌టికే జీవీకేపై కేసు న‌మోదు చేసిన సీబీఐ.. సీబీఐ కేసు ఆధారంగా కేసు న‌మోదు చేసిన ఈడీ*ఏపీలో గ‌త‌ 24 గంటల్లో 1178 క‌రోనా పాజిటివ్ కేసులు, 13 మంది మృతి.. 21,197కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 252 మంది మృతి*ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టులో పిల్. కరోనా టెస్టులు, చార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్. యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు. ఈనెల 14 లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

రామకుప్పంలో విషాదం... జల్లికట్టులో ఒకరి మృతి

12-01-202012-01-2020 15:58:47 IST
2020-01-12T10:28:47.875Z12-01-2020 2020-01-12T10:28:37.263Z - - 09-07-2020

రామకుప్పంలో విషాదం... జల్లికట్టులో ఒకరి మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సంక్రాంతి వస్తోందంటే చాలు తమిళనాడుకి సమీపంలో ఏపీ సరిహద్దు గ్రామాల్లో జల్లికట్టు కనిపిస్తుంది. ఎన్ని చట్టాలు తెచ్చినా సంప్రదాయకంగా సాగే వివిధ ప్రక్రియలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. చిత్లూరు జిల్లా రామకుప్పం మండలం, భారత  మిట్ట గ్రామంలో జరుగుతున్న జల్లికట్టులో దారుణం జరీగింది.

చిన్న బల్దార్ గ్రామానికి చెందిన అబ్దుల్ బాషా అనే వ్యక్తి మరణించాడు. అతని వయసు 27 ఏళ్ళు. జల్లికట్టులో భాగంగా ఎద్దు పొడవడంతో మెడ, ఛాతి భాగాలలో తీవ్ర గాయాలు కావడంతో అతన్ని చికిత్స కోసం కుప్పం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  చికిత్స పొందుతూ బాషా మృతి చెందాడు. 

జల్లికట్టులో భాగంగా వేగంగా పరుగులు తీస్తున్న ఎద్దును నిలువరించబోయి ఎద్దు కొమ్ములు ఛాతీలో గుచ్చుకోవడం అబ్దుల్ బాషా అక్కడికక్కడే మృతి చెందాడు. జల్లికట్టుకు అనుమతి లేకున్నా తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న నిర్వాహకులను పోలీసులు అడ్డుకోకపోవడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. సంప్రదాయబద్దంగా జరిగే జల్లికట్టు ఆట చివరకు హింసాత్మకంగా మారుతుందో ఈ ఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు.  సంక్రాంతికి ముందు జల్లికట్టుని నిషేధిస్తామని పోలీసులు ప్రకటించినా అది ఆచరణలో సాధ్యం కావడంలేదు.

చిత్తూరు ఎస్పీ, తిరుపతి అర్బన్ ఎస్పీలు జల్లికట్టు పోటీలను ఏమాత్రం అనుమతించబోమని  ప్రకటనలు చేశారు. కానీ జల్లికట్టు ఎక్కడో చోట హింసాత్మకం అవుతూనే వుంది. గతంలో కంటే ఈ ఏడాది మాత్రం వరుసగా దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జనవరి 1న జరిగిన జల్లికట్టులో కూడా ఒక వ్యక్తి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రితో చికిత్స పొందుతున్నాడు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle