newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

మొగుడ్ని అడ్డంగా అమ్మేసింది.. ఎక్కడంటే?

19-10-201919-10-2019 18:53:45 IST
Updated On 19-10-2019 18:53:23 ISTUpdated On 19-10-20192019-10-19T13:23:45.431Z19-10-2019 2019-10-19T13:17:35.151Z - 2019-10-19T13:23:23.083Z - 19-10-2019

మొగుడ్ని అడ్డంగా అమ్మేసింది.. ఎక్కడంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇటీవల హైదరాబాద్ లో అంగట్లో పండ్లను అమ్మినట్లు భార్య, బిడ్డలను అమ్మేశాడు ఓ భర్త. ఈ సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. అది మరిచిపోకముందే.. శుభలగ్నం సినిమా సీన్ రిపీట్ అయింది. డబ్బు మీద మోజుతో భర్త జగపతిబాబుని ఆమని.. మరో హీరోయిన్ రోజాకి అమ్మేయడం అందరికీ గుర్తుండే ఉంటుంది.  రియల్ లైఫ్ లో ఓ భార్య తన భర్తను ఏకంగా ఐదు లక్షలకు అమ్మేసింది.

ఈ సంఘటన మన పొరుగున ఉన్న కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో జరిగింది. భర్త రమ్య అనే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేశాడు. దీంతో ఆ భార్య వారిద్దరి వ్యవహారాన్ని బట్టబయలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఓ రోజు తన భర్త రమ్య ఇంట్లో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

అయితే, అప్పుడు రమ్య కూడా ఆ మహిళకు సమాధానం ఇచ్చింది. అతడు తన వద్ద డబ్బులు అప్పు తీసుకున్నాడని, ఆ డబ్బులు చెల్లించకపోవడం వలనే తన వద్ద ఉంచుకున్నానని చెప్పింది. దీంతో ఆ భార్య కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే, ‘నా మొగుణ్ణి పర్మినెంట్‌గా నువ్వే ఉంచేసుకో. కానీ, నా జీవితం బాగుండాలి కాబట్టి, ఎంత ఇస్తావో చెప్పు’ అంటూ ఓ ప్రపోజల్ తీసుకొచ్చింది.

దానికి రమ్య వెంటనే స్పందించి.. రూ.5లక్షలు ఇస్తానని.. పర్మినెంట్‌గా అతడిని తనకు ఇచ్చేయాలని చెప్పింది. దీంతో ఈ డీల్ కు ఓకె చెప్పింది. వెంటనే ఇద్దరు మహిళలు కొన్ని షరతులకు అంగీకరించారు. అందులో భాగంగా  తాళి బొట్టుకూడా తీసి ఇచ్చేయాలని రమ్య అడగడంతో ఆమె కాదనలేదు. 

ఈ ఒప్పందం ప్రకారం వచ్చే నెల 17వ తేదీన రమ్య రూ.5లక్షలు ఇచ్చి ఆ వ్యక్తిని కొనుగోలు చేయనుంది. జరుగుతున్న తంతు చూస్తున్న ఆ వ్యక్తి మాత్రం ఏం చేయలేక బిక్కమొహం వేసుకున్నాడు. తనను అడ్డంగా అమ్మేసినా.. కిమ్మనకుండా ఉండిపోయిన ఈ మాయదారి మొగుడిని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. 

 

ఖండాంతరాలకు వ్యాపించిన జ్యోతి సాహసం.. ఇవాంకా ప్రశంసలు

ఖండాంతరాలకు వ్యాపించిన జ్యోతి సాహసం.. ఇవాంకా ప్రశంసలు

   13 hours ago


మేఘాలలో తేలిపోయేలా... మేఘాలయా సీఎం సంగ్మా గిటార్ హాబీ

మేఘాలలో తేలిపోయేలా... మేఘాలయా సీఎం సంగ్మా గిటార్ హాబీ

   16 hours ago


ఈ దొంగ మామూలోడు కాదు.. ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్ళబోయాడు

ఈ దొంగ మామూలోడు కాదు.. ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్ళబోయాడు

   18 hours ago


వెండి నాణేల తుపాన్ ... అదనుచూసి ఎత్తుకెళ్లారు

వెండి నాణేల తుపాన్ ... అదనుచూసి ఎత్తుకెళ్లారు

   20 hours ago


కన్నతండ్రికోసం 1200 కి.మీ. సైకిల్ ప్రయాణం.. శ్రవణ 'కుమారి'కి సోషల్ మీడియా జేజేలు

కన్నతండ్రికోసం 1200 కి.మీ. సైకిల్ ప్రయాణం.. శ్రవణ 'కుమారి'కి సోషల్ మీడియా జేజేలు

   23-05-2020


గాంధీ హాస్పిటల్ వైద్యుల ఘనత.. ప్లాస్మా థెరపీ సక్సెస్

గాంధీ హాస్పిటల్ వైద్యుల ఘనత.. ప్లాస్మా థెరపీ సక్సెస్

   22-05-2020


చుట్టుముట్టిన సింహాలు.. అంబులెన్స్‌లోనే ప్రసవం

చుట్టుముట్టిన సింహాలు.. అంబులెన్స్‌లోనే ప్రసవం

   22-05-2020


వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం

   21-05-2020


నారాయణ అధ్యాపకుల ఆమరణ నిరాహారదీక్ష

నారాయణ అధ్యాపకుల ఆమరణ నిరాహారదీక్ష

   21-05-2020


వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి ప్రియురాలు ఆత్మహత్య

వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి ప్రియురాలు ఆత్మహత్య

   21-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle