newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

మెడికల్ షాపులు వద్దు.. ఇంటివైద్యమే ముద్దు..

29-07-202029-07-2020 06:38:55 IST
Updated On 29-07-2020 06:42:22 ISTUpdated On 29-07-20202020-07-29T01:08:55.648Z29-07-2020 2020-07-29T01:08:52.041Z - 2020-07-29T01:12:22.736Z - 29-07-2020

మెడికల్ షాపులు వద్దు.. ఇంటివైద్యమే ముద్దు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రాణాంతక కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు కరోనాను అడ్డుకోవడానికి తగిన మందులు లేకపోవడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇది వరకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే ఆస్పత్రికి, మెడికల్‌షాపుకు వెళ్లి మందులు తెచ్చుకునేవారు. ఇప్పుడు కరోనా ప్రభావంతో ఇంటికే పరిమితమవ్వాల్సిన పరిస్థితి. దీంతో మందుల దుకాణాలకు వెళ్లేవారి సంఖ్య తగ్గుతోంది. ఆరోగ్య సమస్య తలెత్తితే ఇంట్లో తయారు చేసే కషాయంతో వ్యాధి లక్షణాలను తగ్గించుకునే యత్నం చేస్తున్నారు. సోషల్‌ మీడియా, యూట్యూబ్‌లో వెతికి మరీ గృహవైద్యం వైపు మొగ్గుచూపుతున్నారు.  

వైరస్ సోకకుండా జాగ్రత్తలు పాటించడమే ఇప్పుడు యావత్ ప్రపంచానికీ తారకమంత్రంలా మారిపోయింది. వ్యాయామం, యోగా, పౌష్టికాహారం తీసుకుని రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవడమే ఉత్తమ మార్గంగా మారింది. దాంతో దేశంలో, రాష్ట్రాల్లో హెర్బల్‌ కషాయం వైపు సమాజం మొగ్గుచూపుతోంది. ఇమ్యూనిటీని సాధించేందుకు దివ్య ఔషధంగా భావిస్తోంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో కోవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పాజిటివ్‌ వ్యక్తులకు సైతం కషాయం అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. 

కరోనా తీవ్రత తక్కువగా ఉన్న వారి కోసం కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఉన్నాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి ఐసొలేషన్‌ వార్డులు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా చికిత్సను అందజేస్తున్నారు. వైరస్‌ బారిన పడిన వారిలో లక్షణాలు లేకుంటే హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. 

ఐసొలేషన్‌లో అందించే ఆహారం..

ఐసోలేషన్‌ వార్డుల్లోని రోగులకు ఉదయం 6.30 గంటలకు పొంగల్, ఇడ్లీ, వడ, కిచిడీ, ఉప్మా అల్పాహారంగా ఇవ్వడంతో పాటు కషాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. మధ్యాహ్నం 1–2 గంటల మధ్య పప్పు, సాంబారు, పెరుగు, కోడిగుడ్డు, అరటిపండుతో భోజనం. సాయంత్రం 4–5 గంటల మధ్య రాగిజావ, ఖర్జూరం, బాదం పప్పు, రాత్రి 7.30 నుంచి 8.30 గంటల మధ్య పప్పు, సాంబారు, చపాతీ, పూరీ, ఇడ్లీ, దోశ, పెరుగు అన్నం, కోడిగుడ్డు అందజేస్తారు.

నిత్యం పాటించాల్సిన జాగ్రత్తలు

జ్వరం  థర్మామీటర్‌తో రోజుకు మూడు సార్లు చూసుకోవాలి. ఆక్సిజన్‌ పల్స్‌రేట్‌  పల్స్‌ ఆక్సీమీటర్‌ ద్వారా రోజుకు మూడు సార్లు చూసుకోవాలి. ఆహారం వైద్యులు సూచించిన పౌష్టికాహారంతో పాటు, పండ్లు,  

2 వారాలపాటు వాడాల్సిన మందులు

విటమిన్‌– సి 500 ఎంజీ  ఒక ట్యాబ్లెట్‌ రోజుకు రెండుసార్లు  ఉదయం ఒకటి, రాత్రి ఒకటి (తిన్న తర్వాత). విటమిన్‌–డీ  ఒక ట్యాబ్లెట్‌ రోజుకు ఒకసారి  ఉదయం తిన్న తర్వాత. మల్టీ విటమిన్‌– జింక్‌   ఒక ట్యాబ్లెట్‌ రోజుకు రెండుసార్లు  ఉదయం ఒకటి, రాత్రి ఒకటి (భోజనం తర్వాత). పారాసిట్‌మాల్‌ 500 ఎంజీ లేదా 650 ఎంజీ  రోజుకు రెండు సార్లు (ఉదయం ఒకటి, రాత్రి  ఒకటి భోజనం తర్వాత) 

జలుబు ఉంటే 3 నుంచి 5 రోజులపాటు వాడాల్సినవి

సిట్రిజన్‌  ఒక మాత్ర రోజుకు ఒకసారి తిన్న తర్వాత. అజిత్రోమైసిన్‌ 500 ఎంజీ   ఒక మాత్ర రోజుకు ఒకసారి రాత్రి తిన్న తర్వాత  

వైరల్‌ మందులు 5 రోజులపాటు వాడాలి

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ 200 ఎంపీ ఒక మాత్ర రోజుకు రెండు సార్లు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి (తిన్న తర్వాత)  

విరేచనాలు తగ్గేందుకు

స్పోరోలాక్‌  డీఎస్‌ టాబ్లెట్‌ రోజుకు రెండు సార్లు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తిన్న తర్వాత 

గ్యాస్‌ కడుపులో మంట తగ్గేందుకు...

ఫాంటాసిడ్‌ డీఎస్‌ఆర్‌  రోజుకు ఒక మాత్ర ఉదయం తినకముందు.  

రోగనిరోధక శక్తికి చిట్కాలు 

ప్రతి రోజూ ఉదయం 10 గ్రాముల చ్యవన్‌ ప్రాసం తీసుకోవాలి

హెర్బల్‌ టీ, తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంటి వేసిన డికాక్షన్‌ తాగాలి. రుచి కోసం అందులో బెల్లం, నిమ్మరసం వేసుకోవచ్చు.

రోజుకు రెండుసార్లు ఎండు ద్రాక్ష తినాలి.

150 మిల్లీలీటర్ల వేడిపాలలో అర టీస్పూన్‌ పసుపు వేసుకుని రోజుకు ఒకటి, రెండుసార్లు తాగాలి.

గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటివి ఉంటే పసుపును వేడిపాలు లేదా వేడి నీటిలో కలుపుకుని తాగాలి.

రోజూ ఏ సమయంలో అయినా గోరువెచ్చని నీటినే సేవించాలి.

వంటకాల్లో పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి తప్పక వినియోగించాలి.

కృష్ణ తులసి ఆకుల రసంలో తేనె కలిపి తీసుకోవాలి.

పసుపులో అల్లం వేసి ఉడికించి ఫిల్టర్‌ చేసిన నీటిని తాగాలి.

నువ్వుల నూనె, కొబ్బరినూనె, నెయ్యి చుక్కలను ఉదయం, సాయంత్రం ముక్కు రంధ్రాల్లో వేసుకోవాలి.

నువ్వులనూనె, కొబ్బరి నూనె ఒక స్పూన్‌ మేర నోట్లో వేసుకుని పుక్కిలించి ఉమ్మివేయాలి.

తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మాస్క్‌ ధరించకుంటే కనీసం చేతి రుమాలు అయినా అడ్డుపెట్టుకోవాలి.

ప్రతి 12 గంటలకు ఒకసారి చేతులు శుభ్రం చేసుకోవాలి, ఆరబెట్టుకోవాలి.

రోజూ అరగంట పాటు యోగా, ప్రాణాయామం చేయాలి.  

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle