newssting
BITING NEWS :
*నేడు మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

మూడు రోజులుగా ఆసుపత్రిలో 'అమితాబ్' - అసలేమైంది?

18-10-201918-10-2019 15:09:18 IST
2019-10-18T09:39:18.351Z18-10-2019 2019-10-18T09:34:32.346Z - - 15-11-2019

మూడు రోజులుగా ఆసుపత్రిలో 'అమితాబ్' - అసలేమైంది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇటీవ‌ల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 77సంవత్సరాలను పూర్తి చేసుకున్నాడు. ఆయ‌న పుట్టిన రోజు వేడుక‌ల‌ని కుటుంబ స‌భ్యులు, అభిమానులు ఘ‌నంగా జ‌రిపారు. బాలీవుడ్ బిగ్ బిగా ముద్దుగా ఆయన అభిమానులు పిలుచుకుంటారు. ఏడు ప‌దుల వ‌య‌స్సులోను ఎంతో యాక్టివ్‌గా ఉన్న అమితాబ్  ముంబైలోని నానావ‌తి ఆసుప‌త్రిలో చేరార‌ట‌. గ‌త మూడురోజులుగా ఆయ‌న‌కి ఐసీయూ తరహా సదుపాయాలుండే గదిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

కాలేయ సంబంధిత వ్యాధి కార‌ణంగానే ఆయ‌న ఆసుప‌త్రిలో చేరిన‌ట్టు సమాచారం. అయితే రెగ్యుల‌ర్ చెక‌ప్ కోస‌మే అమితాబ్ ఆసుప‌త్రిలో చేరార‌ని .. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని వైద్యులు తెలిపారు.

ప్ర‌స్తుతం కౌన్‌బ‌నేగా క‌రోడ్ ప‌తి సీజ‌న్ 11 కార్య‌క్ర‌మంతో బిజీగా ఉన్నాడు అమితాబ్. దర్శకుడు సూజిత్ సర్కార్ గులాబో సితాబ్ అనే చిత్రంలో న‌టిస్తున్నారు. బ్ర‌హ్మాస్త్రా అనే చిత్రంలోను కీల‌క పాత్ర పోషిస్తున్నారు అమితాబ్ . ఇటీవ‌ల అమితాబ్ సినిమా రంగానికి చేసిన సేవ‌ల‌కి గాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ను అందుకున్నారు కూడా.

ఇలా ఆసుపత్రిలో చేరడం అమితాబ్ కి కొత్తేమి కాదు. ఎందుకంటే కూలీ నెం1 చిత్రంలో ఆయనకి గాయాలు అయినప్పటి నుంచి అమితాబ్ ఆరోగ్యం దెబ్బ తినడంతో ఎప్పటికప్పుడు ఆసుపత్రి పాలవుతున్నారు అమితాబ్. రీసెంట్ గా చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరాలో గురువు పాత్రలో కూడా మెరిసారు అమితాబ్.

బిగ్ బీని చూసేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రతిరోజు ఆసుపత్రికి తరలివస్తున్నారట. వారితో పాటు అమితాబ్ అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. నానావతి ఆసుపత్రి సిబ్బంది ఈ మేరకు స్పందించారు. అమితాబ్ ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వెల్లడించారు. ఏది ఏమయినా ఆయన ఆరోగ్యం బాగయి త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle