newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

మూడు రూపాయల కక్కుర్తి- 9వేలు జరిమానా

15-04-201915-04-2019 13:03:14 IST
2019-04-15T07:33:14.421Z15-04-2019 2019-04-15T07:33:11.678Z - - 22-09-2019

మూడు రూపాయల కక్కుర్తి- 9వేలు జరిమానా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మనం ఏం షాపింగ్ చేసినా.. క్యారీ బ్యాగ్ ఫ్రీగా ఇస్తాయి కంపెనీలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఆయా కంపెనీలు తమ కంపెనీ అడ్వర్టైజ్‌మెంట్లు ముద్రించిన క్యారీబ్యాగ్‌లు సైతం మనకు రూ.2, రూ.3, రూ.5 కి అమ్మేస్తాయి.  అదేంటని అడిగితే మాత్రం కంపెనీ సిబ్బంది వినియోగదారులనే టార్గెట్ చేస్తారు. ‘సంచి లాభం చిల్లు తీసుకోవడం’ అంటే ఇదే.. మూడు రూపాయల కక్కుర్తి ఆ కంపెనీకి 9 వేలు జరిమానా దాకా వెళ్లింది.

ప్రముఖ చెప్పుల దుకాణం సంస్థ బాటాకు ఈ చేదు అనుభవం ఎదురైంది. క్యారీ బ్యాగ్‌కి అదనంగా డబ్బు వసూలు చేసినందుకు బాటాకు భారీ జరిమానా విధించింది వినియోగదారుల ఫోరం. అయితే వినియోగదారులు ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తే మాత్రం న్యాయం దక్కుతుందని ఓ వినియోగదారుని గాథ నిరూపించింది. 

చండీగఢ్‌కి చెందిన  దినేష్‌ ప్రసాద్‌ స్థానికంగా ఉన్న బాటా దుకాణంలో చెప్పులు కొనుగోలు చేశాడు. బిల్లులో చెప్పుల ధరతో పాటు క్యారీ బ్యాగ్‌కు రూ.3 వసూలు చేశారు. దీంతోపాటు ఆ బ్యాగ్‌పై బాటా ఉత్పత్తులను ముద్రించి ప్రచారం చేస్తున్నారు. ఇదేంటని దినేశ్‌ అడిగితే దుకాణం సిబ్బంది దురుసుగా బదులిచ్చాడు. దీంతో దినేష్‌ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు.

క్యారీ బ్యాగ్‌కు రూ.3 వసూలు చేసినా ఇబ్బంది లేదు కానీ, దానిపై ఆ సంస్థ ఉత్పత్తులను ముద్రించారని, ఇది వినియోగదారులను మోసం చేయడమేనని ఆయన ఫిర్యాదు చేశాడు. ఈ కేసును విచారించిన ఫోరం.. దినేష్‌కు రూ.9 వేల పరిహారంతో పాటు క్యారీ బ్యాగ్‌ చార్జీ కూడా వెనక్కి ఇచ్చేయాలని బాటా దుకాణదారులను ఆదేశించింది. ఇలాంటి తీర్పులు కంపెనీలకు చెంపపెట్టులాంటివి. మీలోనూ దినేష్ లాంటివారికి అనుభవం ఎదురైతే వెంటనే ఫిర్యాదుచేయండి. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle