newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

మీడియాకు గండంగా మారిన కరోనా మహమ్మారి!

25-03-202025-03-2020 13:53:59 IST
2020-03-25T08:23:59.495Z25-03-2020 2020-03-25T08:23:57.492Z - - 09-04-2020

మీడియాకు గండంగా మారిన కరోనా మహమ్మారి!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉమ్మడిగా ఎదుర్కొంటున్న ఒకే ఒక్క సమస్య కరోనా. పిట్టల్లా రాలిపోతున్న ప్రాణాలను నిల్పుకొనేందుకు ప్రతి దేశం తన శక్తికి మించి సాహసాలే చేస్తుంది. మంగళవారం రాత్రి ప్రధాని మోడీ మాట్లాడుతూ మరో 21 రోజుల పాటు దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించేశారు. ఎక్కడి వారు అక్కడే ఉండడంతో మహమ్మారి వ్యాప్తిని అరికట్టవచ్చని పీఎం నుండి సీఎంల వరకు దేశమంతా ఒకటే నినాదంతో ముందుకెళ్తున్నారు.

ఈ క్రమంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యేందుకు సిద్ధమయ్యారు. పలు విధులను నిర్వహించే వారంతా వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్లోకి వెళ్లిపోయారు. ఇష్టారీతిన ఇళ్ల నుండి బయటకి వస్తే మహమ్మారి కమ్మేయడం గ్యారంటీ అనే సంకేతాలు ప్రజలలోకి బలంగా వెళ్లాయి. దీంతో ప్రజల నుండి స్వయం అప్రమత్తత మొదలైంది. దీనికి పోలీసులు, అధికారులు, ప్రభుత్వం కూడా కఠినతరంగా నిబంధనలు విధించడంతో అందరూ ఇప్పుడు సామజిక దూరం నినాదంగా అమలు చేస్తున్నారు.

అయితే, దేశవ్యాప్తంగా ఉన్న మీడియాకి ఇప్పుడు గండంగా మారింది. అటు అత్యవసర సర్వీసులతో పాటు మీడియా సంస్థలు కూడా యధావిధిగా పనిచేయాల్సిన పరిస్థితి. అసలే అరకొర ఆదాయాలతో నడిచే మన తెలుగు మీడియా సంస్థలకు ఇది భారంగా మారింది. ఆదాయం తెచ్చే ప్రకటనలు అసలే లేవు. మరోవైపు న్యూస్ పేపర్స్ మీద వైరస్ ఎక్కువ కాలం బ్రతికి ఉంటుందనే అసత్య ప్రచారాలు కూడా తోడై సర్క్యులేషన్ కూడా పడిపోయింది.

పేపర్ల మీద వైరస్ ఎక్కువ కాలం బ్రతికి ఉంటుందనే అసత్య ప్రచారంతో భయాందోళనకు గురయ్యే ప్రజలు తమ ఇళ్లకి న్యూస్ పేపర్లు వద్దని చెప్పేశారు. ఇప్పుడు అది అసత్య ప్రచారం అని ఆ మీడియా సంస్థలే ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక దీనికి తోడు అటు న్యూస్ పేపర్స్, న్యూస్ చానెల్స్ లో పనిచేసే ఉద్యోగులు, జర్నలిస్టులు ఆఫీసులకు వచ్చేందుకు వెనుకాడుతున్నారు. తమవి మాత్రం ప్రాణాలు కాదా అంటూ కొందరు ఉద్యోగాలను వదులుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు.

ముఖ్యంగా తక్కువ జీతాలకు, చిన్న చిన్న సంస్థలలో పనిచేసే వాళ్ళు ఆఫీసులకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తుండడంతో కొన్ని కొన్ని చోట్ల పోలీసులు మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించడం కూడా ఉద్యోగులకు ఇబ్బందులుగా మారుతున్నాయి. దీంతో కొన్ని చిన్న సంస్థలు ఇప్పటికే ప్రింటింగ్ ను నిలిపివేసి ఉద్యోగులకు సెలవులు ప్రకటించేశారు.

నిజానికి తెలుగు మీడియాలో ప్రముఖ సంస్థలతో సహా ఐదారు సంస్థలు ఉగాది నుండి తమ సంస్థలను నిలిపివేయాలని ఆలోచనకు వెళ్లారు. కానీ మంగళవారం ప్రధాని మోడీ ప్రత్రికాధిపతులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కరోనా నివారణలో మీడియా బాధ్యతగా తీసుకోవాలని మోడీ కోరడంతో ప్రింటింగ్ నిలిపివేసే ఆలోచనలో మానుకున్నట్లుగా తెలిసింది.

అయితే, ప్రధాని దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మరో 21 రోజులు ప్రకటించడంతో చాలా సంస్థలకు ఆర్ధిక భారం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవైపు కార్యకలాపాలను కొనసాగించడం.. ఆదాయం లేకపోవడంతో కొన్ని సంస్థలు దివాళా తీయడం ఖాయంగా కనిపిస్తుంది. కరోనా వ్యాప్తి ఎంతవరకు వెళ్తుంది.. తదుపరి పరిస్థితిలు అంచనా వేయలేకపోవడంతో అటు మీడియా సంస్థలు.. జర్నలిస్టులు, ఉద్యోగులు ఏం జరగనుందన్నది ఆలోచనలో ఉండిపోయారు.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle