newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

మాస్క్ వాడకంలో నూటికి 90 శాతం మంది ఫెయిల్.. అందుకే వైరస్ వ్యాప్తి..

09-08-202009-08-2020 13:02:31 IST
2020-08-09T07:32:31.063Z09-08-2020 2020-08-09T07:32:22.879Z - - 30-09-2020

మాస్క్ వాడకంలో నూటికి 90 శాతం మంది ఫెయిల్.. అందుకే వైరస్ వ్యాప్తి..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులో లేని ప్రపంచంలో ఆ మహమ్మారి బారి నుంచి బయటపడాలంటే ప్రాథమిక అంశాలు భౌతిక దూరం పాటించడం, మాస్క్ తప్పనిసరిగా ధరించడమేనని ప్రపంచం కోడై కూస్తోంది. అయితే మాస్క్ వాడటం ప్రభుత్వాలు తప్పనిసరి చేశాక, అపరాథరుసం చెల్లించాలని భయం వల్లకూడా కావచ్చు దాదాపు ప్రతి ఒక్కరూ మాస్క్ వాడటం అలవాటు చేసుకున్నారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి నిర్దిష్టమైన జాగ్రత్తలతో మాస్కు ధరించాలని వైద్యసంస్థలు ఎంతగా మొత్తుకుంటున్నా.. శాస్త్రీయ పద్ధతిలో మాస్క్‌లు వాడుతున్న వారు 10 శాతంలోపేనని వైద్య, ఆరోగ్యశాఖ పరిశీలనలో తేలింది. 

క్షేత్రస్థాయిలో ప్రజలు మాస్కులు ధరిస్తున్న తీరుపై వైద్య, ఆరోగ్యశాఖ ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో గత జూలైలో ఇరవై రోజులపాటు ఇరవై వేల మందిని పరిశీలించింది. ఇందులో 90% మంది నిబంధనలు పాటించట్లేదని తేలింది. చాలామంది ముక్కును వదిలేస్తూ, నోరు కవరయ్యేలా మాస్కు ధరిస్తున్నారు. ఇంకొందరు పేరుకు మాస్క్‌ ధరించినా.. దాన్ని గడ్డం కిందకు లాగేస్తున్నారు. 20వేల మందిలో 90శాతం మంది ఇదే తరహాలో మాస్కు పెట్టుకుంటున్నారు. ఇందులో 65% మంది మాస్కు ముందు భాగాన్ని తరచూ తాకుతున్నారు. 

వైరస్‌ సోకిన వ్యక్తులతో మనం మాట్లాడితే ఆ వైరస్‌ మనం ధరించే మాస్క్‌ ముందుభాగానికి చేరుతుంది. ఈ క్రమంలో మాస్క్ ముందుభాగాన్ని తాకినా, తిరిగి అదే చేతితో ముక్కు, నోటి భాగాన్ని తాకినా వైరస్‌ మనలోనికి చేరుతుంది. ప్రస్తుతం నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో జాగ్రత్తలు పాటించని వాళ్లే 85 శాతం ఉన్నట్లు వైద్యశాఖ పరిశీలన చెబుతోంది. ఇక, బాధితుల్లో అత్యధికమంది రద్దీ ప్రాంతాల్లో తిరిగి వైరస్‌ బారిన పడినవారేనని ఈ విశ్లేషణలో తేలింది.

కరోనా వైరస్‌ నుంచి రక్షించే ప్రధాన ఆయుధం ఫేస్‌ మాస్కు. దీన్ని శాస్త్రీయ పద్ధతిలో ధరించి, జాగ్రత్తలు పాటిస్తే దాదాపు సురక్షితంగా ఉన్నట్టే. బయటకు వెళ్లేటపుడు, ఇతరులతో మాట్లాడేటపుడు ట్రిపుల్‌ లేయర్‌ మాస్కును ముక్కు, నోరు పూర్తిగా కవరయ్యేలా ధరించాలి. ఒకసారి మాస్కు పెట్టుకున్నాక ముందువైపు తాకొద్దు. మాస్కును చెవివైపు నాడెలను పట్టుకుని తొలగించి నేరుగా వేడినీటిలో వేసి ఉతికేయాలి. సబ్బు లేదా ఇతర డిటర్జెంట్‌ పౌడర్‌తో ఉతికి, 4 గంటల పాటు ఆరబెట్టాక వినియోగించాలి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

కానీ నూటికి 90 శాతం మంది ఈ ముఖ్యమైన విషయాన్ని అసలు పాటించడం లేదని అందరి అనుభవంలోకి వస్తూనే ఉంది. అందుకే మాస్కును వాడటం కాదు.. దాన్ని ఎలా వాడుతున్నామన్నదే అతి ముఖ్యమైన విషయం అని ప్రజలు గ్రహించాలి. మాస్కును వాడుతూ కూడా పదే పదే చేతిని ముఖానికి తగిలించుకోవడం ముక్కు వద్ద పట్టుకుని మాస్కును పైకి లాగడం చేస్తే అలాంటి మాస్క్ జనాల్ని కాపాడలేదని గ్రహించాలి.

వ్యాక్సిన్‌ వచ్చినా మాస్కు తప్పదు

కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చేస్తే.. ఇక ఇష్టానుసారం తిరిగేయవచ్చని అనుకుంటున్నారా? అయితే, తప్పులో కాలేసినట్లే. వ్యాక్సిన్‌ వచ్చినా.. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరని అమెరికాలోని బేలార్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ అసొసియేట్‌ డీన్‌, వ్యాక్సిన్‌ తయారీలో ప్రముఖ శాస్త్రవేత్త మరియా ఎలెనా బొట్టజ్జి స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ అనేది ఒక వ్యక్తికి కరోనా బారిన పడే అవకాశాన్ని తగ్గిస్తుందే గానీ.. వైర్‌సను పూర్తిగా నిర్మూలించదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యాక్సినేమీ అందరికీ మాయా పరిష్కారం చూపదని.. అది వచ్చిన తర్వాతా జాగ్రత్తలు పాటించాల్సిందేనని చెప్పారు. ’నేను ఒక వ్యాక్సిన్‌ తీసుకురాబోతున్నాను. దానితో పరిస్థితులు కరోనా రాక ముందు కాలం నాటికి మారిపోతాయని అనుకోవడం లేదు’ అన్నారు. 

WHO changes stance, calls for 3-layer Covid-19 masks in public ...

బూతులు తిట్టే చిలుకలను ఎప్పుడైనా చూశారా ?

బూతులు తిట్టే చిలుకలను ఎప్పుడైనా చూశారా ?

   19 hours ago


వామ్మో ! రెండేళ్ల వయస్సులో అస్థిపంజరంతో స్నేహం !

వామ్మో ! రెండేళ్ల వయస్సులో అస్థిపంజరంతో స్నేహం !

   20 hours ago


తెలంగాణలో వింత.. తెల్లదూడకు జన్మనిచ్చిన గేదె

తెలంగాణలో వింత.. తెల్లదూడకు జన్మనిచ్చిన గేదె

   29-09-2020


పదేళ్ల బాలుడి సహస విన్యాసం.. చేతివేళ్లపై నుండి యాభై కార్లు!

పదేళ్ల బాలుడి సహస విన్యాసం.. చేతివేళ్లపై నుండి యాభై కార్లు!

   28-09-2020


కడుపు నిండా తినేసింది.. కదల లేక..!

కడుపు నిండా తినేసింది.. కదల లేక..!

   28-09-2020


ఐటీ ఉద్యోగాలకు ‘టీసీఎస్’‌ పరీక్ష.. 40 వేల ఉద్యోగాలు

ఐటీ ఉద్యోగాలకు ‘టీసీఎస్’‌ పరీక్ష.. 40 వేల ఉద్యోగాలు

   28-09-2020


గల్లీ క్రికెట్ ఆడుతున్న కుక్కలు

గల్లీ క్రికెట్ ఆడుతున్న కుక్కలు

   26-09-2020


నెగెటివ్‌ మార్కుల రద్దు.. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో 40% వస్తే పాస్‌

నెగెటివ్‌ మార్కుల రద్దు.. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో 40% వస్తే పాస్‌

   26-09-2020


భార్యపాదాలు భర్త తాకితేనే ఇప్పుడు వార్త.. బుల్లర్ చేసిన పని అదే మరి.

భార్యపాదాలు భర్త తాకితేనే ఇప్పుడు వార్త.. బుల్లర్ చేసిన పని అదే మరి.

   26-09-2020


లాక్ డౌన్ లో బాల్కనీలలో ఒకరినొకరు చూసుకున్నారు.. ఇప్పుడు ఎంగేజ్మెంట్

లాక్ డౌన్ లో బాల్కనీలలో ఒకరినొకరు చూసుకున్నారు.. ఇప్పుడు ఎంగేజ్మెంట్

   25-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle