newssting
BITING NEWS :
తీవ్ర వివాదాల మధ్యనే పార్లమెంటులో ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు. ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లులు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇవి చట్టరూపం. ఈ బిల్లులు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయని, రైతులకు ఇవి మరణ శాసనాలని పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేసినా వెనక్కు తగ్గని కేంద్రం * రాజ్యసభలో కొనసాగుతున్న దుమారం. విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం. హరివంశ్‌పై అవిశ్వాస తీర్మానానికి ఆదివారం 12 విపక్ష పార్టీలు నోటీసు. ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను హరివంశ్‌ తూట్లుపొడిచారాని కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ విమర్శ * అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరపన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిలనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ ముందస్తు విడుదల కోసం మరోసారి ప్రయత్నాలు. శశికళ విడుదల కోసం అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ ఢిల్లీకి పయనం. సుప్రీం కోర్టు న్యాయవాదులు, న్యాయనిపుణులతో చర్చలు * ఆరు నెలల తర్వాత సోమవారం ఉదయం సందర్శకుల కోసం తెరుచుకున్న ఆగ్రాలోని అంతర్జాతీయ చారిత్రక పర్యాటక కేంద్రం తాజ్‌మహల్‌. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ బారులు తీరిన సందర్శకులు. సోమవారం 160 మంది పర్యాటకులు ఆన్ లైన్ లో టికెట్లు కొనుగోలు. రెండు షిఫ్తుల్లో రెండు వేలమందికి అనుమతులు * మహారాష్ట్రలోని భీవండి నగరంలో తీవ్ర విషాదం. మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలి పది మంది మృతి, మరో 20 మందికి గాయాలు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మర సహాయక చర్యలు * నేటి నుండి హైకోర్టులో అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి, మాజీ ఎంఎల్‌ఏ శ్రవణ్ కుమార్ తదితరులు వేసిన పిటిషన్‌లపై రోజువారీ విచారణ. నేడు ధర్మాసనం ముందు లిస్ట్ అయిన 93 పిటిషన్‌లు విచారణ. ఆన్‌లైన్ ద్వారా రాజధానికి సంబంధించిన కేసులను విచారించనున్న ధర్మాసనం * నేటి నుండి అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాల పునరుద్ధరణ. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం పరిసర ప్రాంతాల్లో కరోనా కేసుల కారణంగా దర్శనాలు నిలిపివేయగా నేటి నుండి తిరిగి దర్శనాలు ప్రారంభం. సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్‌ వాడుతూ క్యూలైన్‌లో దర్శనం. పిల్లలకు, వృద్ధులకు ఆలయంలోకి నో ఎంట్రీ * భారీ వర్షాలతో పోటెత్తిన కృష్ణా, పెన్నా, తుంగభద్ర నదులకు వరద. పలు గ్రామాలు ముంపునకు గురవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు. పలు గ్రామాల్లో వరదలలో చిక్కుకున్న 48 మంది రైతులు, వ్యవసాయ కూలీలు, రక్షించిన ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు * కేంద్రం జారీ చేసిన కోవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యాశాఖ ఉత్తర్వులు. నేటి నుంచి 50 శాతం మంది టీచర్లు బడులకు హాజరు. సోమవారం నుంచి విద్యార్థులు లేకుండానే కొనసాగనున్న పాఠశాలలు * ఈశాన్య బంగా‌ళా‌ఖాతంలో ఆది‌వారం ఉదయం ఏర్పడిన అల్ప‌పీ‌డనం. సోమ‌వారానికి మ‌రింత బలపడి అను‌బం‌ధంగా 3.1 కి.మీ. నుంచి 7.6 కి.‌మీ. ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం.

మాస్క్ ఇలా రెడీ చేసుకోండి.. స్మృతీ ఇరానీ పాఠాలు

10-04-202010-04-2020 17:16:06 IST
2020-04-10T11:46:06.921Z10-04-2020 2020-04-10T11:46:01.161Z - - 21-09-2020

మాస్క్ ఇలా రెడీ చేసుకోండి.. స్మృతీ ఇరానీ పాఠాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. కరోనా విస్తరిస్తున్న వేళ కేంద్రమంత్రులు కూడా వర్క్ ఫ్రం హోంకి పరిమితం అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులో వుంటున్నారు. కరోనా వ్యాపిస్తున్న తరుణంలో మాస్క్ త‌ప్ప‌నిస‌రి అయిపోయింది. దీంతో మార్కెట్‌లో వాటి డిమాండ్ ఒక్క‌సారిగా పెర‌గ‌డంతో.. దొరికిందే అవకాశంగా కొంద‌రు రెట్టింపు ధ‌ర‌ల‌కు అమ్మ‌ేస్తున్నారు.

ప్ర‌భుత్వం మాస్కులు అధిక ధ‌ర‌ల‌కు అమ్మితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చరించ‌డంతో వాటి రేట్లు కొంత‌ త‌గ్గుముఖం ప‌ట్టాయి. అయితే మాస్కుల కోసం దుకాణాల వెంట తిర‌గాల్సిన ప‌ని లేద‌ంటున్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. హాయిగా మీరు ఇంట్లోనే ఉండి ఎంతో సులువుగా మాస్కు త‌యారు చేసుకోవ‌చ్చ‌ని ఆమె సోషల్ మీడియా ద్వారా సూచిస్తున్నారు. ఈ మేర‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో మాస్క్ ఎలా తయారు చేయాలో చెప్తూ దానికి సంబంధించిన ఫొటోల‌ను పోస్ట్ చేశారు కేంద్రమంత్రి. 

అసలు మాస్క్ తయారుచేసుకోవడం ఎంతో తేలిక, ఉపయుక్తం, శ్రేయస్కరం అంటున్నారామె. ముందుగా క‌త్తెర‌తో వస్త్రాన్ని నిర్దిష్ట ఆకృతిలో క‌త్తిరించారు. అనంత‌రం కుట్టు మిష‌న్ లేక‌పోతే దానికి బ‌దులుగా సూది, దారాన్ని వాడ‌మ‌ని చెప్తూ చేతిపైనే ఎలా కుట్టాలో చూపించారు. ఈ విధంగా సుల‌భంగా మాస్క్ త‌యారు చేసుకోండంటూ.. చివ‌ర‌గా తాను చేసిన ఫేస్ మాస్క్‌ను చూపించారు.  మాస్క్ లేకుండా రోడ్డుమీదకు వస్తే మాత్రం జరిమానాలు విధిస్తున్నారు. ఈనేపథ్యంలో మాస్క్ తయారీ వీడియో ఎంతో బాగుందని నెటిజన్లు కేంద్రమంత్రిని ప్రశంసలతో ముంచేస్తున్నారు. 

 

 

ఈ కుక్కకి డిన్నర్ అంటే ఎంతిష్టమో..!

ఈ కుక్కకి డిన్నర్ అంటే ఎంతిష్టమో..!

   20 minutes ago


పక్షిని తినేసిన సాలీడు.. చూస్తే షాక్ అంతే!

పక్షిని తినేసిన సాలీడు.. చూస్తే షాక్ అంతే!

   30 minutes ago


చిన్నారి సుమేధ మృతిపై మేయర్ బొంతు రామ్మోహన్ అనుమానం..

చిన్నారి సుమేధ మృతిపై మేయర్ బొంతు రామ్మోహన్ అనుమానం..

   2 hours ago


ఉత్పత్తి తక్కువ.. వినియోగం ఎక్కువ ! పెరగనున్న కోడిగుడ్ల రేట్లు

ఉత్పత్తి తక్కువ.. వినియోగం ఎక్కువ ! పెరగనున్న కోడిగుడ్ల రేట్లు

   6 hours ago


స్వయంకృషితో ఆన్ లైన్ క్లాసులు వింటున్న విద్యార్థి..

స్వయంకృషితో ఆన్ లైన్ క్లాసులు వింటున్న విద్యార్థి..

   20-09-2020


ఆంధ్రా, తెలంగాణ ప్రాజెక్టులకు జలకళ.. నీరు దిగువకు విడుదల

ఆంధ్రా, తెలంగాణ ప్రాజెక్టులకు జలకళ.. నీరు దిగువకు విడుదల

   19-09-2020


తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పిడుగుల మోతతో దద్దరిల్లిన భాగ్యనగరం

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పిడుగుల మోతతో దద్దరిల్లిన భాగ్యనగరం

   19-09-2020


ప్రైవేట్ ట్రావెల్స్ ను ఢీ కొట్టిన లారీ.. 29 మందికి తీవ్రగాయాలు

ప్రైవేట్ ట్రావెల్స్ ను ఢీ కొట్టిన లారీ.. 29 మందికి తీవ్రగాయాలు

   19-09-2020


పార్లమెంట్ లోనే పోర్న్ చూస్తూ అడ్డంగా బుక్ అయిన ఎంపీ

పార్లమెంట్ లోనే పోర్న్ చూస్తూ అడ్డంగా బుక్ అయిన ఎంపీ

   19-09-2020


ఎంత అందంగా ఉందో.. అంతే ప్రమాదకారి..!

ఎంత అందంగా ఉందో.. అంతే ప్రమాదకారి..!

   19-09-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle