newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

మానవులపై ప్రయోగానికి కాడిలాకు అనుమతి

04-07-202004-07-2020 19:27:23 IST
2020-07-04T13:57:23.349Z04-07-2020 2020-07-04T13:56:51.479Z - - 11-08-2020

మానవులపై ప్రయోగానికి కాడిలాకు అనుమతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారినుంచి మానవాళిని రక్షించేందుకు అనేక ఫార్మా సంస్థలు వ్యాక్సిన్ల తయారీకి నడుం బిగించాయి. ప్రముఖ ఔషధ తయారీదారి సంస్థ జైడస్ కాడిలా త్వరలోనే మానవులపై కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను పరీక్షించనున్నారు. టీకాను మానవులపై పరీక్ష చేయడానికి ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కరోనా వైరస్ కోసం దేశవ్యాప్తంగా టీకాలు తయారు చేసిన సంస్థల్లో రెండో భారతదేశ సంస్థ జైడస్. ప్రభుత్వ సంస్థ భారత్ బయోటెక్ కూడా కరోనా వైరస్‌తో పోరాడటానికి వ్యాక్సిన్ తయారు చేసిన సంగతి తెలిసిందే.

కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను అహ్మదాబాద్‌లోని వ్యాక్సిన్ టెక్నాలజీ సెంటర్‌లో అభివృద్ధి చేస్తున్నట్లు జైడస్ ప్రకటించింది. మానవ పరీక్షలు నిర్వహించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీఐజీ), సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) నుంచి కూడా అనుమతి పొందింది. దీంతో ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. మార్చిలో కరోనా వైరస్ వ్యాక్సిన్‌ తయారీని ప్రారంభించింది. 

తమ మందు వల్ల వైరస్‌ను చంపగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ టీకాను ఇప్పటికే ఎలుక, పంది, కుందేలుపై పరీక్షించినట్లు సంస్థ ప్రతినిధి పంకజ్ తెలిపారు. టీకా ద్వారా ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్‌ వైరస్‌ను చంపగలిగాయని సంస్థ తెలిపింది. జైడస్ కాడిలాతో పాటు ప్రపంచం మొత్తం విూద 17 కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌ ను తయారు చేసే పనుల్లో నిమగ్నమై ఉన్నాయి.ఈ 17 కంపెనీల్లో కొన్ని ఇప్పటికే మనుషులపై ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాయి. భారత్‌ కు చెందిన భారత్‌ బయోటెక కంపెనీ ఇప్పటికే మనుషులపై ప్రయోగాలు చేస్తోంది. ఈ కంపెనీ తయారు చేసిన కొవాగ్జిన్‌ వాక్సిన్‌ పై మరిన్ని ప్రయోగాలు చేయడానికి డిసీజీఐ అనుమతి ఇచ్చింది.

దీంతో ఆగస్ట్‌ 15 కల్లా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని భారత్‌ బయోటెక్ ప్రకటించింది. భారత్ బయోటెక్ తర్వాత దేశంలో డిసిజీఐ అనుమతి పొందిన రెండో ఫార్మా కంపెనీ జైడస్. కరోనా వ్యాక్సిన్‌ ను తయారు చేయడంలో ఆస్టాజ్రెనికా, వెూడెర్నా కంపెనీలు ముందంజలో ఉన్నాయి. మూడో దశ ప్రయోగాలకు ఈ కంపెనీలు సిద్ధం అవుతున్నాయి. అటు చైనాకు చెందిన పలు కంపెనీలు కూడా కరోనా వ్యాక్సిన్‌ పై ప్రయోగాలు చేస్తున్నాయి. ఇవన్నీ ఒక కొలిక్కి వస్తే కరోనాపై పోరాటంలో విజయం సాధించినవారం అవుతాం. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle