newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

మహిళను కాపాడిన.. ఎస్సై అర్జున్‌కు డీజీపీ ప్రశంసలు

03-12-201903-12-2019 13:05:45 IST
Updated On 03-12-2019 13:06:05 ISTUpdated On 03-12-20192019-12-03T07:35:45.921Z03-12-2019 2019-12-03T07:35:43.035Z - 2019-12-03T07:36:05.590Z - 03-12-2019

మహిళను కాపాడిన.. ఎస్సై అర్జున్‌కు డీజీపీ ప్రశంసలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రాధాన్యత పెరుగుతోంది. గతంలో పోలీసులంటే భయం ఉండేది. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదుచేయాలంటే బాధితులు వెనుకాడేవారు. కానీ ఇప్పుడు ప్రజలతో పోలీసులు మమేకం అవుతున్నారు.

ఏపీలో ప్రాణాలకు తెగించి మహిళని రక్షించిన ఆర్ ఎస్సై అర్జునరావుకి ప్రశంసలు లభిస్తున్నాయి. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అర్జునరావుని అభినందించారు. అతని పేరుని  ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్ కు నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించారు. 

వేగంగా ప్రవహిస్తున్న బందరుకాలువలో కొట్టుకుపోతున్న మహిళలను కాపాడేందుకు కాలువలోకి దూకిన అర్జునరావు..వారిని కాపాడారు. కృష్ణలంక సమీపంలోని బందరు కాల్వలో ఓ మహిళ ప్రమాదవశాత్తూ పడిపోయింది. కాల్వలో కొట్టుకుపోతున్న మహిళను చూసి స్థానికులు పెద్దగా కేకలు వేశారు.

ఆ సమయంలో అటుగా వెళ్తున్న ట్రాఫిక్ ఎస్సై అర్జునరావు వెంటనే కాల్వలోకి దూకేశారు. ఈదుకుంటూ ఆమె వద్దకు వెళ్లి కష్టపడి ఒడ్డుకు చేర్చారు. ఆ మహిళను కాపాడడమే కాకుండా ప్రాథమిక చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు ఎస్సై అర్జునరావు.  సకాలంలో స్పందించి సీపీఆర్ చేసి ఆమె ప్రాణాలు కాపాడారు. ఆయన పేరును ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్ కు సిఫార్సు చేశారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle