newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

మధ్యప్రదేశ్‌లో దారుణం.. రైతును కొట్టి చంపేశారు

13-02-202013-02-2020 12:47:05 IST
Updated On 13-02-2020 12:47:03 ISTUpdated On 13-02-20202020-02-13T07:17:05.127Z13-02-2020 2020-02-13T07:16:16.466Z - 2020-02-13T07:17:03.413Z - 13-02-2020

మధ్యప్రదేశ్‌లో దారుణం.. రైతును కొట్టి చంపేశారు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకప్పుడు మూకదాడులు హడలెత్తిస్తే.. తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ రైతుని కొట్టి చంపేశారు. చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే వాడన్న అనుమానంతో రైతును వేటాడి, చావబాది చంపేయడం కలలం రేపింది. ఓ రైతుపై కొందరు సామూహిక దాడి చేయడంతో అతను మరణించాడు. మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలోని మనావర్ తాలూకాలో చోటుచేసుకున్న ఈ సంఘటన హృదయ విదారకంగా మారింది.

ఖిరాకియా గ్రామానికి ఓ రైతు తన ఐదుగురు స్నేహితులతో కలిసి వచ్చాడు. గ్రామస్తులు వారిని అనుమానంతో చూశారు. వీరంతా చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే వారని భావించి 200 మంది గ్రామస్తులను సర్పంచ్ రెచ్చగొట్టాడు. దీంతో గ్రామస్తులు వారిపై సామూహికంగా దాడికి పాల్పడ్డారు.

దీంతో గ్రామస్తులు రైతుతో పాటు అతనితో పాటు వచ్చిన వారిపై కూడా దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. గ్రామస్తుల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా గ్రామస్తులు వదల్లేదు. దీంతో గాయాలతో రైతు మరణించాడు. ఈ ఘటనలో పోలీసులు గ్రామ సర్పంచ్ గా వున్న బీజేపీనేతను అరెస్టు చేశారు. 

టమోటాల కోసం హత్య

గత ఏడాది మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. టమోటాలు దొంగతనం చేశాడని తోటి రైతును దారుణంగా చంపేశాడో రైతు. జబల్‌పూర్‌లోని పనగర్ ప్రాంతంలో రైతులు చక్రేష్ పటేల్, రాజేంద్ర పటేల్ అనే ఇద్దరు రైతులు కూడా టమాట సాగు చేశారు. అయితే, రాజేంద్ర పటేల్ పంట సరిగా రాలేదు. చక్రేష్ పొలంలో టమాటాలు విరగకాశాయి. మరోవైపు వారంరోజుల్లో టమాట ధరలు అమాంతం పెరిగాయి.

ఈ క్రమంలో రాజేంద్ర పటేల్ పొరుగున ఉండే చక్రేష్ పటేల్ పొలంలో టమాటాలు దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు. రాత్రి పూట పొలం కాపలాకు వెళ్లిన చక్రేష్ పటేల్‌కు ఈ విషయం తెలియడంతో ఇద్దరు గొడవ పడ్డారు. ఆగ్రహంతో చక్రేష్ పటేల్ గొడ్డలి తీసుకుని రాజేందర్ పటేల్ పై దాడి చేశాడు. దీంతో రాజేందర్ పటేల్ మరణించాడు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle