newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 252కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

మకర సంక్రాంతి విశిష్టత

15-01-202015-01-2020 09:25:47 IST
2020-01-15T03:55:47.089Z15-01-2020 2020-01-15T03:55:44.500Z - - 06-04-2020

మకర సంక్రాంతి విశిష్టత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడంతో సంక్రాంతి వస్తుంది. ఈ పండుగను తెలుగువారు సంక్రాంతి అనీ, తమిళులు పొంగల్ అని జరుపుకుంటారు. పేరు ఏదైనా పండుగ పరమార్థం ఒకటే. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణించడం సంప్రదాయంగా వస్తోంది. ఇది సూర్యుని ఉత్తరదిక్కు ప్రయాణం.

ఈ ప్రయాణాన్నే ఆయనం లేదా ఆయణం అంటారు. ఉత్తరాయణం శుభప్రదమైనది. ఇది పుణ్యకాల ప్రారంభం. వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో పంటలు చేతికొచ్చే కాలం ఇది. సంపదను, ఆనందాన్ని కుటుంబంతో, సమాజంతో పంచుకుని సంతోషించే వేడుకలు ఎంతో సందడి చేస్తాయి.  భోగి పండుగతో సంబరాలు మొదలయితే, సంక్రాంతితో ఊపందుకుంటాయి.

సంక్రాంతి అనగానే మనకు ఇంటిముందు అందమయిన, రంగురంగుల రంగవల్లికలు కనువిందు చేస్తాయి. సంక్రాంతి పుణ్యదినాన ఇచ్చే దానాలు అక్షయంగా లభిస్తాయనే నమ్మకం వుంది. మనం ప్రకృతితో మమేకం అవుతాం. చెట్లు, పుట్టలు, పశుపక్ష్యాదులను మనం సమానంగా చూస్తాం. వ్యవసాయంలో ఆవులు, ఎద్దులు ఎంతో ప్రాధాన్యత వహిస్తాయి. వీటికి పూజలు చేయడం వల్ల ఇంటి నిండి పాడిపంటలు వుంటాయని నమ్ముతాం. 

సంక్రాంతి తర్వాత చెప్పుకోదగినది కనుమ. రైతులు తమ పాడి పశువులను, దొడ్లను శుభ్రంగా కడిగి, పూల తోరణాలు కట్టి మామిడి తోరణాలతో అలంకరించి పశువులకు సైతం కుంకుమ బొట్లు పెట్టి మెడలో పూల దండలు వేసి వాటి ప్రత్యేక మైన దాణాను అందచేస్తారు. గోపూజ నిర్వహిస్తారు. పంట చేల వద్ద పూజలు చేసి నైవేద్యం పెడతారు.

ఇలా చేయడం వల్ల పంటలు బాగా పండుతాయి. సంక్రాంతి పండుగ మూడు రోజులు ఆంధ్రా ప్రాంతంలో చాలా కోలాహలంగా, సంతోషంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగకు ఆంధ్రా ప్రాంతంలో కోడిపందాలు ఎంతో ప్రముఖమయినవి. కోడిపందాలలో కోట్ల రూపాయలు చేతులు మారతాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle