newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

మందుబాబులకు గుడ్ న్యూస్.. అక్కడ రాత్రి 9గంటల వరకూ బార్లు

27-06-202027-06-2020 19:41:54 IST
Updated On 27-06-2020 19:41:27 ISTUpdated On 27-06-20202020-06-27T14:11:54.855Z27-06-2020 2020-06-27T14:05:47.215Z - 2020-06-27T14:11:27.434Z - 27-06-2020

మందుబాబులకు గుడ్ న్యూస్.. అక్కడ రాత్రి 9గంటల వరకూ బార్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ కారణంగా మందుబాబులు చాలా ఇబ్బంది పడ్డారు. లాక్ డౌన్ సడలింపుల వల్ల కొన్ని రాష్ట్రాల్లో వైన్ షాపులు తెరిచారు. తాజాగా రాజస్థాన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన బార్లను ఈనెల 28 నుంచి తెరుచుకునేందుకు అనుమతులిచ్చింది. దేశవ్యాప్తంగా  జూన్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. ఇక తాజాగా కేంద్రం ఇచ్చిన సడలింపులతో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం రాష్ట్రంలోని బార్లు రాత్రి 9 గంటల వరకు తెరుచుకోవచ్చని తెలిపింది. 

కరోనా ప్రభావం రాజస్థాన్ టూరిజాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది. నిత్యం పెద్ద సంఖ్యలో దేశ, విదేశాల నుంచి వచ్చే టూరిస్టులతో నిండిపోయే అక్కడి హోటళ్లు, బార్లు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. గుంపులుగా ఉంటే కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న నేపథ్యంలో మందుబాబులు బార్ల వైపే చూడడం లేదు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రాజస్థాన్ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.

ప్రజలందరూ బయటికి వచ్చినప్పుడు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంది. అయితే బార్లకు వచ్చేందుకు ఎంతమంది బయటకు వస్తారనేది అనుమానంగా ఉంది. రోజురోజుకీ కరోనా విస్తరిస్తుండడంతో కరోనా భయం వారిని పట్టిపీడిస్తోంది. గతంలో కంటే బార్లకు వచ్చేవారి సంఖ్య భారీగా తగ్గుతోందని తెలుస్తోంది. పర్యాటకులు కూడా భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో వ్యాపారం ఎలా సాగుతుందో చూడాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle