newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

మండే వేసవి వేళ చల్లని వార్త... కేరళను తాకిన రుతుపవనాలు

31-05-202031-05-2020 08:36:43 IST
Updated On 31-05-2020 09:56:01 ISTUpdated On 31-05-20202020-05-31T03:06:43.187Z31-05-2020 2020-05-31T03:05:26.267Z - 2020-05-31T04:26:01.445Z - 31-05-2020

మండే వేసవి వేళ చల్లని వార్త... కేరళను తాకిన రుతుపవనాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల్లో వాతావరణ శాఖ ఓ చల్లటి వార్త చెప్పింది. కేరళకు రుతుపవనాలు చేరుకున్నాయి. రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ పేర్కొంది. జూన్ 1న కేరళకు రుతుపవనాలు వస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా కంటే రెండు రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళకు చేరుకున్నాయి. ఈసారి రుతుపవనాలు సగటున ఉండబోతున్నాయని వాతావరణ శాఖ ఏప్రిల్‌లో తెలిపింది. ఈసారి 96 నుండి 100 శాతం వర్షపాతం నమోదైతే సాధారణ రుతుపవనాలుగా పరిగణించబడుతుంది.

రుతుపవనాల ప్రభావంతో రెండు రోజుల నుండి కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే విధంగా ఉత్తర భారతదేశంలోని ప‌లు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ల‌లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి. అసోం వరదలతో సతమతం అవుతోంది. 

వాతావ‌ర‌ణ విభాగం తెలిపిన వివ‌రాల ప్రకారం రాబోయే 24 గంటల్లో మధ్య-తూర్పు అరేబియా సముద్రంలో అల్ప పీడన ద్రోణి ఏర్పడే అవకాశం ఉంది. వేసవి కారణంగా ఉత్తర భారతదేశంలో  కొన్నాళ్లుగా వేడిగాలులు వీచాయి. అయితే ఇప్పుడు వాతావరణం ఆహ్లాద‌క‌రంగా మారింది. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్త‌రు వర్షాలు కురిశాయి.

తెలంగాణలో అకాల వర్షాలతో పంటలకు నష్టం ఏర్పడింది. మార్కెట్ యార్డులలో సరైన వసతులు లేకపోవడంతో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసిముద్దయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

   27 minutes ago


చేపలు పట్టేటప్పుడు ఓ మహిళపై మొసలి దాడి.. సగం తిన్న మొసలి

చేపలు పట్టేటప్పుడు ఓ మహిళపై మొసలి దాడి.. సగం తిన్న మొసలి

   19 hours ago


థర్డ్ వేవ్ తో పిల్లలకి ప్రమాదం లేదు..

థర్డ్ వేవ్ తో పిల్లలకి ప్రమాదం లేదు..

   13-06-2021


కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చింది: డాక్టర్ రాకేశ్ మిశ్రా

కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చింది: డాక్టర్ రాకేశ్ మిశ్రా

   12-06-2021


పాన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ లేకపోతే జరిమానా

పాన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ లేకపోతే జరిమానా

   12-06-2021


ఈ రెండురోజులు అలర్ట్ గా ఉండాలి..

ఈ రెండురోజులు అలర్ట్ గా ఉండాలి..

   11-06-2021


అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయి

అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయి

   10-06-2021


ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2021 ర్యాలీ: టెన్త్ అర్హతతో

ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2021 ర్యాలీ: టెన్త్ అర్హతతో

   10-06-2021


గోక్షుర ఆయుర్వేద ప్రయోజనాలు.. వాటిలో శృంగార వాంఛ కూడా ఒకటి

గోక్షుర ఆయుర్వేద ప్రయోజనాలు.. వాటిలో శృంగార వాంఛ కూడా ఒకటి

   10-06-2021


రు. 150 కోట్ల మొబైల్ యాప్ మోసం.. 11 మంది అరెస్ట్

రు. 150 కోట్ల మొబైల్ యాప్ మోసం.. 11 మంది అరెస్ట్

   10-06-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle