newssting
BITING NEWS :
*నేడు మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

మంచిర్యాలలో కలకలం.. రిటైర్డ్ డాక్టర్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

20-10-201920-10-2019 12:51:11 IST
Updated On 20-10-2019 12:51:46 ISTUpdated On 20-10-20192019-10-20T07:21:11.661Z20-10-2019 2019-10-20T07:20:33.563Z - 2019-10-20T07:21:46.908Z - 20-10-2019

మంచిర్యాలలో కలకలం.. రిటైర్డ్ డాక్టర్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఎన్ఐఏ సోదాలు ఈమధ్యకాలంలో ఎక్కువయిపోయాయి. భద్రత నేపథ్యంలో కేరళ,  హైదరాబాద్, చెన్నైలలో ఎన్ఐఏ అధికారులు అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తున్నాయి. తాజాగా తెలంగాణలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో  ముంబైకి  చెందిన ఎన్‌ఐఏ పోలీసుల బృందం సోదాలు నిర్వహించింది.  నిషేధిత మావోయిస్టులకు సహకారం అందిస్తున్నాడన్న కోణంలో  సోదాలు నిర్వహించారు.

మావోయిస్టు సానుభూతి పరుడిగా ఉన్న డాక్టర్‌ చంద్రశేఖర్‌పై ఆరోపణలున్నాయి. ఉద్యోగ విరమణ చేశాక కూడా మావోయిస్టులకు వివిధ విధాలుగా  సహకరిస్తున్నాడనే అనుమానంతో సోదాలు నిర్వహించారు. ఎన్‌ఐఏ బృందం సెర్చ్‌ వారెంట్‌ తో రంగంలోకి దిగింది. సెర్చ్ వారెంట్ చూపించి మరీ ఇంట్లో సోదాలు చేశారు.

డాక్టర్‌ ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్‌తో పాటు, కంప్యూటర్‌లోని హార్డ్‌ డిస్క్‌ను, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకొని డాక్టర్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు.  నిర్మల కుమారి అనే మావోయిస్టు అనారోగ్యాల కారణాల వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఆమెను  అరెస్టు  చేసిన సందర్భంలో డాక్టర్‌ చంద్రశేఖర్‌ విషయం  మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలిసింది.   

నిర్మల కుమారి గతంలో చంద్రశేఖర్‌ వద్ద చికిత్స చేయించుకున్నట్లు తెలుసుకొని సోదాలు నిర్వహించారు. డాక్టర్‌ చంద్రశేఖర్‌ దీనిపై స్పందించారు. తనపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఎన్‌ఐఏ బృందం తన ఇంట్లో సోదాలు నిర్వహించిందని అన్నారు. ఎన్ఐఏకి తాను పూర్తిగా సహకరించానని, వారు కూడా తనను ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదన్నారు.

తాను చాలాకాలంగా అన్ని కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్టు డాక్టర్ చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు. ఏ క్షణంలోనైనా తాను కోర్టుకి హాజరుకావడానికి సహకరిస్తానని చంద్రశేఖర్ ఎన్ఐఏ అధికారులకు వివరించారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle