newssting
BITING NEWS :
*నేడు మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

భూకంప విధ్వంసం హై రిస్క్‌లో విజయవాడ..

19-10-201919-10-2019 10:48:09 IST
Updated On 19-10-2019 10:48:04 ISTUpdated On 19-10-20192019-10-19T05:18:09.941Z19-10-2019 2019-10-19T05:16:44.222Z - 2019-10-19T05:18:04.745Z - 19-10-2019

భూకంప విధ్వంసం హై రిస్క్‌లో విజయవాడ..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ ఐఐటీ పరిశోధకుల తాజా అధ్యయనం ప్రకారం విజయవాడ నగరం భూకంప ప్రమాదం అత్యధికంగా ఉన్న నగరాల జాబితాలో చేరిపోయింది. భారతదేశంలోని  50 నగరాల్లో భూకంప విధ్వంస ప్రమాద సూచికపై పైలట్ స్టడీ ప్రకారం విజయవాడ అత్యధికంగా భూకంప ప్రమాదబారిన పడే నగరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణభారత నగరాల్లో చెన్నయ్ రిస్క్ తక్కువ ఉన్న జాబితాలో చేరగా విజయవాడ మాత్రం అత్యధిక రిస్కు ఉన్న జాబితా నగరాల్లో చేరింది. 

హైదరాబాద్ ఐఐటీకి చెందిన ఎర్త్‌క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన ప్రదీప్ కుమార్ రామచంద్ర నేతృత్వంలోని టీమ్ నిర్వహించిన పరిశోధన వివిధ భారతీయ నగరాల్లో భూకంప ప్రమాదం గురించి అధ్యయనం చేసింది. భూకంపం సంభవించే పరిస్థితుల్లో మనుషుల ప్రాణనష్టాన్ని, ఆర్థిక నష్టాలను కనీస స్థాయికి తగ్గించేలా ప్రభుత్వాధికారులు, నిర్మాణ పరిశ్రమకు తగు సమాచారాన్ని ఇవ్వడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుంది.

ఈ పరిశోధనలో భాగంగా అధ్యయనం చేసిన నగరాలు చాలావరకు భారత్‌లో భూకంప కేంద్రం చురుకుగా ఉన్న ప్రాంతాల్లో ఉంటున్నాయి. వీటిని సీస్మిక్ జోన్ 4, 5 ప్రాంతాలుగా వర్గీకరించారు. విజయవాడ మాత్రం సీస్మిక్ జోన్ 3 కేటగిరీలో చేరింది. నగరాల్లోని జనసాంద్రత, హౌసింగ్ థ్రెట్ అంశాల ప్రాతిపదికన ఈ నగరాలను భూకంప అధ్యయన పరిశోధనకు ఎంచుకున్నారు.

జనసంఖ్య, రీజియన్ వ్యాప్తంగా ఉన్న భవంతులు, అవి భూకంపాలకు గురయ్యే ప్రమాదం ప్రాతిపదికన భూకంప ప్రమాద సూచికలను రూపొందించారు. మనుషుల ప్రాణాలు, ఆర్థిక నష్టాలు ప్రాతిపదికన జరిగిన ఈ అధ్యయనం ప్రకారం విజయవాడ నగరం మీడియం స్థాయిలో భూకంప ప్రమాదాలకు వీలున్న ర్యాంకులో చేరింది కానీ భూకంప పేలుడు తీవ్రాతితీవ్రంగా ఉంటుందని, ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితులకు కారణమవుతుందని అధ్యయనం తేల్చింది.

విజయవాడకు సమీపంలోని అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో ఈ ప్రాంతంలో పట్టణీకరణ వేగం పుంజుకుంది. దీంతో జనాభా, నిర్మాణ కార్యకలాపాలు బాగా పెరిగాయి. 2014లో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైతం విజయవాడ నగరం పరిసరాలు భూకంపాల బారిన పడే ప్రమాదముందని సూచించింది.

భవిష్యత్తులో ఎప్పుడైనా వచ్చే అవకాశం పొంచి ఉన్న విజయవాడలో ఇప్పటినుంచే నిర్మాణ పరిశ్రమ, ప్రభుత్వం భూకంప నష్టభయాన్ని తగ్గించేలా జాగ్రత్తలు తీసుకోవలిసి ఉంది. రక్షణపరంగా లోపమున్న భవనాల నిర్మాణాన్ని మెరుగుపర్చే కొత్త టెక్నాలజీలను అమలుపర్చడంతో పాటు భూకంపాలకు తట్టుకుని నిలిచే తరహా నిర్మాణాలను మాత్రమే చెపట్టేలా ప్రభుత్వం అప్రమత్తతతో వ్యహరించాలని అధ్యయన నివేదిక సూచించింది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle