newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

భార్య టీ చేసి ఇస్తే ఇక చస్తే తాగం.. పురుష ప్రతిజ్ఞ

09-10-201909-10-2019 17:30:35 IST
2019-10-09T12:00:35.569Z09-10-2019 2019-10-09T12:00:32.479Z - - 19-02-2020

భార్య టీ చేసి ఇస్తే ఇక చస్తే తాగం.. పురుష ప్రతిజ్ఞ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
'మహిళలు దేవతలు కాదు' అంటూ స్త్రీవాదులు ఎప్పటినుంచో చెబుతుంటే ఏమో అనుకున్నాం కానీ ఇకనుంచి కచ్చితంగా నమ్ముతాం అంటూ కేరళ పురుషాహంకారులు శపథాల మీద శపథాలు చేస్తున్నారు. ఒకటిన్నర దశాబ్దం వ్యవధిలో తన కుటుంబంలో ఆరుగురికి సైనేడ్ ఇచ్చి చంపి చట్టం దృష్టికి రాకుండా తప్పించుకున్న జోలీ థామస్ అనే కేరళ సీరియల్ కిల్లర్ ఉదంతం బయటపడ్డాక కేరళ మగాళ్లు 'ఇకపై భార్య టీ చేసి ఇచ్చినా తాగం కాక తాగం' అంటూ ప్రతిజ్ఞలు చేసుకుంటున్నారని వార్తలు. 

చాలా కాలం తర్వాత ఈ వరుస హత్యలకు పాల్పడిన మహిల జోలీ థామస్ గురించి వార్తలు రావడంతో కేరళలోని చాలామంది మగాళ్లు నిద్ర మేల్కొన్నంత పనిచేశారు. మహిళలందరూ దేవతలు కాదు, కులస్త్రీలు కాదు అని ఇప్పుడు నమ్మక తప్పడం లేదని వీరు వాపోతున్నారు.

ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం కేరళ పురుషు పుంగవులు వాట్సాప్‌లో పుంఖానుపుంఖాలుగా జోకులేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ సమాజం మహిళలను అబలలు అని ముద్రించిందని, కానీ వారు అవలీలగా హత్యలు చేసే శక్తిసామర్థ్యాలు కలవారని, వామ్మో ఇక వారిని నమ్మలేమని జోకుల రూపంలో పంచుకుంటున్నారు

మచ్చుకు వాటిలో ఒక జోక్ ఇక్కడ చూద్దామా..

''నేను నా భార్యను ఎంతో ప్రేమిస్తాను. కానీ ఇకనుంచి ఆమె నాకు టీ గానీ చేసి ఇస్తే చస్తే తాగను. ఆమె ముందుగా సిప్ చేసి తర్వాత ఇస్తేనే తాగుతాను. ఆమె వంట వండి పెడితే ముందుగా ఆమె తిన్నతర్వాతే నేను తింటాను. వామ్మో.. ఆడోల్లు''... అంటూ ఒకరి జోకులు..

ఈ జోకులు, వాటి ఫార్వర్డ్‌లూ చాలాకాలంగా..మహిళలు దేవతలు కారనీ, వారు కూడా పురుషుల్లాంటి వారేనని, మహిళల్లో చాలా రకాలు ఉంటారని చాలాకాలంగా మొత్తుకుంటున్న ఫెమినిస్టులకు కొత్తగా జ్ఞానబోధ చేస్తున్నట్లుంది. 

మహిళలు కూడా విలువలు, ప్రవర్తనలు, నడత విషయంలో పురుషుల్లాంటి వారేనని, కానీ పితృస్వామిక సమాజాలు ఈ విషయాన్ని గుర్తించవని, మహిళలు పురుషులకంటే అత్యున్నత నైతిక ప్రమాణాలు పాటించాలంటూ వారిపై అన్యాయపు తీర్పులు, ముద్రలు విధిస్తూ వస్తున్నాయని స్త్రీవాదులు చాలా కాలంగా చెబుతూనే వస్తున్నారు. సాధారణ స్త్రీని దేవతా విగ్రహాన్ని చేసి ఎత్తైన వేదికపై కూర్చోబెట్టి చూస్తున్న సమాజం వారు అంత అత్యున్నత ప్రమాణాలను పాటించలేకపోవడం చూసి గుండె బాదుకుంటోందని స్త్రీవాదులు చాలా కాలంగా వాదిస్తున్నారు.

జోలీ థామస్ లాగా ఏ మహిళైనా నేరానికి పాల్పడిన వార్త వెలుగులోకి వస్తే చాలు.. పురుషాహంకారులు ఆ మహిళ చేసిన తప్పుకు ప్రపంచంలోని మహిళలంతా సమాధానం చెప్పాల్సిందే అని విరుచుకుపడుతుంటారు. కానీ మహిళలు తామెదుర్కొంటున్న లింగ వివక్ష, హింసకు సంబందించి వార్తలు షేర్ చేస్తే ఈ పురుషులే వాటికి వ్యతిరేకంగా హ్యాష్ టాగ్‍‌లు పెట్టి మరీ ప్రచారం చేస్తుంటారు. మహిళ బాధితులు ఆమె కుటుంబానికి చెందిన వారే అయితే ఇక మగాళ్ల రచ్చ అంతా ఇంతా కాదు. ఇంకా విచిత్రం ఏమిటంటే స్త్రీలు తమ కుటుంబ శ్రేయస్సు కోసం ప్రతిదాన్ని త్యాగం చేయడానికే పుట్టారని ఈ మగాళ్లే నమ్ముతుంటారు 

ఆడవారు నేరాలకు పాల్పడిన వార్తలు ఒకటో రెండో వస్తే ఇంతెత్తున ఎగిరిపడుతున్న పురుషు పుంగవులు.. అనేక కుటుంబాల్లో తండ్రులు, తాతలు, సోదరులు, మామయ్యలు, ఇతర పురుష బంధువులు తమ సొంత కుటుంబాల్లోని అమ్మాయిలను, మహిళలను అత్యాచారం చేస్తే, చంపివేస్తే అలాంటి ఘటనల పట్ల దాదాపు స్పందించరు. ఎన్‌సీఆర్‌బీ సర్వే డేటా ప్రకారం మన దేశంలో అమ్మాయిలు, మహిళలపై జరుగుతున్న హింసాత్మక చర్యల్లో 90శాతం వరకు సొంత కుటుంబాల్లోనే జరుగుతూ వస్తున్నాయని అన్ని సందర్భాల్లో వెల్లడవుతోంది. తానీ ఏ మహిళ అయినా నేరానికి పాల్పడిన ఘటనలు ఒకటో రెండో బయటపడినా సరే ఇదే మగాళ్లు.. స్త్రీల బాధల గురించిన గణాంకాలు, డేటా, అధ్యయనాలు, వార్తానివేదకలు అన్నింటినీ తోసిపుచ్చి స్త్రీవాదులపై దాడికి దిగుతుంటారు.

గత సంవత్సరం సెప్టెంబర్‌లో పత్రికల్లో వచ్చిన వార్త ఇది. చెన్నయ్‌లో 33 ఏళ్ల మహిళ తన బాయ్ ప్రెండ్‌తో లేచిపోవడానికి కన్నబిడ్డలిద్దరినీ చంపేసిందన్న ఆరోపణలో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అప్పుడు కూడా ఇదే విధంగా.. సోషల్ మీడియాలో మగపుంగవులు మొత్తుకోళ్లు మొదలైపోయాయి. చూశారా ఆడవాళ్లు ఎంతగా దిగజారిపోయారో.. తమ సుఖ కోసం సొంత బిడ్డల్ని కూడా చంపేస్తున్నారు అంటూ వీరంతా శోకన్నాలు తీశారు. ఇలాంటి సందర్బాల్లోనే మగాళ్లు సోషల్ మీడియాలో ఫెమినిస్టులపై ప్రశ్నలమీద ప్రశ్నలు సంధిస్తుంటారు.  దీనికి మీరే సమాధానం చెబుతారు.. మహిళలు చేసే నేరాలకు కూడా వారు అనుభవిస్తున్న, ప్రస్తుత సమాజంలో పొందుతున్న సమానత్వం, న్యాయపాలనే కారణం అంటూ వాదిస్తుంటారు వీరు.

మహిళలు శాశ్వతంగా అబలలేననీ, నిస్సహాయులని, బాధితులని కాబట్టే వారు అనుక్షణం మగాడి రక్షణలో ఉంటూనే జీవితం కడతేర్చుకోవాలని సమాజం వారి గురించి చేస్తున్న వర్ణనలు ఫెమినిస్టు ఫిలాసఫీకే విరుద్ధం. మహిళలందరూ దేవతలూ, లోపరహితులూ కారని స్త్రీవాదం ఎన్నడూ భావించదు. మహిళలందరూ మనుషులేనని, ప్రతి నిత్యం మెజారిటీ స్త్రీలు హింసకు గురవుతున్నారని, వారి హక్కులను తృణీకరిస్తున్నారనే ప్రాథమిక సత్యాన్ని అర్థం చేసుకోవడంలో పితృస్వామిక సమాజాలు విఫలమవుతున్నాయని ఫెమినిస్టులు తొలినుంచి చెబుతూ వస్తున్నారు. 

కాబట్టి ప్రియమైన పురుషుల్లారా.. మగాళ్ల హక్కుల కార్యకర్తలారా.. ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. జోలీ థామస్ వంటి వారూ మహిళల్లో ఉంటున్నారు. వారి నేరాలను, దుష్ట చర్యలను మేం సమర్థించం. ఆఫ్టరాల్ నువ్వు ఒక ఆడదానివి అనేటటువంటి పదబంధాలను వాడేవాళ్లం కాదు మేం.  స్త్రీలందరూ దేవతలు కాదు అనే సత్యాన్ని ఇప్పటికైనా మగాళ్లు బోధపర్చుకున్నందుకు సంతోషిస్తున్నాం. జోలీ థామస్ చేసిన హత్యలు మిమ్మల్ని మీ మటన్ సూప్ మీరే తయారు చేసుకునేలా ప్రేరేపిస్తే, (ఎందుకంటే జోలీ చేసినట్లుగా ప్రతి మహిళా చేతిలో సైనేడ్ సిద్ధం చేసుకుని తిరుగుతూ ఉంటోందని ఇప్పుడు మీరు నమ్మేస్తున్నారు కదా) అప్పుడు ఫెమినిస్టులుగా మేం కూడా మిమ్మల్ని ప్రశంసిస్తాం మరి. ఆ రకంగానైనా మీరు వంటలోకి దిగుతారు కదా.. అందుకే మగాళ్లందరికీ ఆల్ ది బెస్ట్


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle