newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

భారత్ బయోటెక్ ముందడుగు.. కోవిడ్ వ్యాక్సిన్ రెడీ

30-06-202030-06-2020 08:49:43 IST
Updated On 30-06-2020 09:08:03 ISTUpdated On 30-06-20202020-06-30T03:19:43.581Z30-06-2020 2020-06-30T03:19:34.496Z - 2020-06-30T03:38:03.867Z - 30-06-2020

భారత్ బయోటెక్ ముందడుగు.. కోవిడ్ వ్యాక్సిన్ రెడీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచానికే సవాలుగా మారిన కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణ వ్యాక్సిన్‌ తయారీలో  శాస్త్రవేత్తలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. భారత ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ ముందడుగు వేసింది. కరోనా కట్టడికి ఈ సంస్థ తయారు చేస్తున్న ‘కో వ్యాక్సిన్‌’ ప్రయోగాలకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతులివ్వడంతో కరోనా రోగులకు ఉపశమనం లభించే అవకాశం వచ్చింది. మానవులపై ఫేజ్‌-1, ఫేజ్‌-2 పరీక్షలకు అనుమతులు జారీ చేసింది. కోవిడ్‌ నియంత్రణకు తయారవుతున్న తొలి స్వదేశీ వ్యాక్సిన్‌ ఇదే కావడం విశేషం.

కరోనా ప్రారంభం నుంచి భారతీయ సంస్థలు కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేస్తూనే వున్నాయి.  ఈ సందర్భంగా భారత్‌ బయోటెక్‌ ఎండీ డాక్టర్‌ కృష్ణా ఎల్లా మాట్లాడుతూ.. ‘కో వ్యాక్సిన్‌’ తయారీ చరిత్రాత్మకం అవుతుందన్నారు. క‌రోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ఫార్మా కంపెనీలు ఇప్పటికే ట్రయ‌ల్స్ పూర్తి చేసుకున్న కొన్నింటికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. తెలంగాణ సీఎం చెప్పినట్టుగానే హైదరాబాదే దేశంలో తొలి కరోనా వ్యాక్సిన్ తయారు చేసింది. హైద‌రాబాద్‌లోని జివోమ్ వ్యాలీలో బ‌యోసేఫ్టీ లెవ‌ల్‌-3తో క‌లిసి కో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.

జూలైలో మాన‌వ ప్రయోగాలు మొద‌లైనందున ఈ ఏడాది చివ‌రిక‌ల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని అంటున్నారు. క‌రోనా చికిత్స కోసం గ్లెన్‌మార్క్ ‘ఫాబిఫ్లూ’తో పాటు మ‌రో దేశీయ ఔష‌ధ సంస్థ హెటిరో ‘కోవిఫర్‌’ ఔష‌ధాల‌కు డీసీజీఐ అనుమ‌తి తెలిపిన విష‌యం తెలిసిందే. కరోనా వ్యాప్తి ఎక్కువగా వున్న ఐదు రాష్ట్రాలకు సరఫరా జరుగుతోంది.  ఈ ఔషధాలతో పాటు డెక్సామెథాసోన్ వాడకానికి కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది. 

ఇదిలా ఉంటే భారత్‌లో కరోనా వైరస్ కేసుల తీవ్రత కొనసాగుతోంది. సోమవారం రాత్రి 10 గంటల వరకు దేశంలో 18,274 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో 414 మంది మరణించారు.ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 5,66,283 కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 16,888 కి పెరిగింది. 2,15,158 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,34,237 మంది కోలుకున్నారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle