newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

భర్త పైశాచికం... భార్యను పొడిచి పొడిచి..

02-08-202002-08-2020 12:37:28 IST
Updated On 02-08-2020 13:17:56 ISTUpdated On 02-08-20202020-08-02T07:07:28.109Z02-08-2020 2020-08-02T07:06:04.300Z - 2020-08-02T07:47:56.668Z - 02-08-2020

భర్త పైశాచికం... భార్యను పొడిచి పొడిచి..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడాలి. కానీ విచక్షణ కోల్పోయిన మానవ మృగాలు భార్యలను దారుణంగా చంపేస్తున్నారు. విదేశీ సంబంధాల గురించి ఎక్కువ ఆసక్తి చూపించే తల్లిదండ్రులకు తీరని శోకమే మిగులుతోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి. కేరళకు చెందిన ఓ నర్సు అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణ హత్యకు గురైంది. 

కేరళలోని కొట్టాయంకు చెందిన ఓ నర్సు అమెరికాలోని ఫ్లోరిడాలో వుంటోంది. ఇటీవల ఆమె దారుణహత్యకు గురైంది. భర్తతో కలిసి నివసిస్తున్న మెరీన్ జాయ్ (26) కోరల్ స్ప్రింగ్స్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన ఆమెపై అప్పటికే పార్కింగ్ స్థలంలో ఉన్న భర్త ఫిలిప్ మాథ్యూ కత్తితో దాడిచేసి విచక్షణ రహితంగా పొడిచాడు. 

భర్తే దాడిచేస్తాడని ఊహించని జోయ్ తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఫిలిప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

మెరిన్ జోయ్, మాథ్యూలకు ఒక బాబు కూడా వున్నాడు. పిల్లాడిని కేరళలోనే వుంచాలని ఇద్దరు గొడవ పడ్డారు. దీంతో భార్య జోయ్ పిల్లాడిని వదిలేసి భర్తతో కలిసి ఫ్లోరిడా వెళ్ళిపోయింది. వీరిద్దరి మధ్య గొడవలు పెరిగాయి. అతను హత్యచేసిన విధానం పోలీసులను హతాశుల్నిచేసిందంటున్నారు. జోయ్ స్నేహితులు మాత్రం భార్యను దారుణంగా చంపిన మ్యాథ్యూని కఠినంగా శిక్షించాలంటున్నారు.

‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle