newssting
BITING NEWS :
* శనివారం మధ్యాహ్నమే కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్ని రేపటికి ప్రీ పోన్ చేసిన ఏపీ సర్కార్ *కాకినాడలో దారుణం..రేచర్లపేటలో నాలుగేళ్ల చిన్నారి మీద అత్యాచారం..చిన్నారి మీద అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు మైనర్లు *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం*ఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్*ఆస్తుల కేసులో హాజరుకాలేనని సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్ పిటిషన్... విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. ఈ రోజు హాజరుపై సీఎం జగన్‌కు మినహాయింపు ఇచ్చిన సీబీఐ కోర్టు*అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *అమరావతిలో 31వ రోజుకు చేరిన ఆందోళన.. లోకేష్ బైక్ ర్యాలీ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు * టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే

భరత జాతి వెలుగు కిరణం.. స్వామి వివేకానంద

04-07-201904-07-2019 12:40:25 IST
2019-07-04T07:10:25.793Z04-07-2019 2019-07-04T07:10:24.061Z - - 17-01-2020

భరత జాతి వెలుగు కిరణం.. స్వామి వివేకానంద
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్వామి వివేకానంద.. పేరు చెబితే యువతరం హృ‌దయం ఉప్పొంగకమానదు. సరిగ్గా 126 ఏళ్ల క్రితం చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళన సభలో స్వామి వివేకానంద చేసిన అనితరసాధ్యమైన ప్రసంగం ఇప్పటికీ చాలామందికి గుర్తుండే వుంటుంది. ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా అప్పటికప్పుడే ఆయన చేసిన ప్రసంగం... ఆయన వాడిన పదాలు భారతీయత విశిష్టతను చాటిచెప్పింది. ‘అమెరికా దేశపు ప్రియ సహోదరులారా’ అంటూ ఆయన ప్రసంగం మొదలుపెట్టినప్పుడు మూడు నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లతో మహాసభ దద్దరిల్లిపోయింది. 

ఆధ్యాత్మిక వేత్త, మానవతావాది స్వామి వివేకానంద వర్థంతి సందర్భంగా ‘న్యూస్ స్టింగ్’ నివాళి

ఆంగ్లంలో ఆయన చేసిన ప్రసంగానికి అమెరికా ప్రజానీకం నీరాజనాలు పట్టింది. గొప్ప ఉపన్యాసకుడైన స్వామి వివేకానందను ఆకాలంలో ‘లైట్నింగ్ ఆరేటర్’ అని పిలిచేవారు. చికాగోలో ఆయన తొలి ప్రసంగం ఈ రోజుకూ ప్రపంచమంతా ప్రతి ధ్వనిస్తోంది. చివరిలో ప్రసంగం చేసినా, సభికులు ఎవరూ ఆయన ప్రసంగం పూర్తయ్యేవరకూ కుర్చీలనుంచి కదిలి వెళ్లిపోలేదు. ఈ సంఘటన నిర్వాహకులకు ఆశ్చర్యం అనిపించింది. ఆయన శాశ్వత నిద్రలోకి జారుకున్న రోజు జూలై 4, 1902వ సంవత్సరం. ఆయన మనకు భౌతికంగా దూరం అయినా, ఆయన చూపించిన మార్గం అనుసరణీయం. 

భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి వివేకానందకు దక్కుతుంది. వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా, 1863 జనవరి 12న ఆయన జన్మించారు. చిన్నతనం నుంచి భారతీయ సంప్రదాయాలకు ఆయన ఎంతో విలువ ఇచ్చేవారు. రామకృష్ణ పరమహంస శిష్యుడిగా ఆయన ఆధ్యాత్మికత గురించి ఎన్నో నేర్చుకున్నారు. నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు. 

భారతదేశం అతని గృహమైంది. ఇక్కడి ప్రజలు అతని సోదర, సోదరీమణులయ్యారు. దురదృష్టవంతులైన తన సోదరుల కన్నీళ్ళు తుడవడం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించే పని. దేశమంతా పర్యటించాడు. తనకున్న ఆస్తి అంతా ఒక కాషాయ వస్త్రము, ఒక కమండలము, శిష్యగణం మాత్రమే. ఈ పర్యటనలో అతను ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. దారి మధ్యలో గుడిసెల్లోనూ, సత్రాలలోనూ నివసించేవాడు, కటిక నేలమీదనే నిద్రించేవాడు. అనేక మంది సాధువుల సాంగత్యంలో గడిపాడు. ఆధ్యాత్మిక చర్చలతో, పవిత్ర కార్యాల గురించిన చర్చలతో సమయం గడిపేవాడు. చాలా దూరం కాలినడకనే నడిచేవాడు. ఎవరైనా దయ తలిస్తే ఏదైనా వాహనంలో ఎక్కేవాడు. ఆళ్వార్ దగ్గర కొద్ది మంది ముస్లింలు కూడా ఆయనకు శిష్యులయ్యారు. 

అమెరికా నుంచి తిరిగి వచ్చాక,. రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసు లోనే మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా1984 లో ప్రకటించింది. స్వామి వివేకానందుని స్ఫూర్తి వచనాలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. 

  • మందలో ఉండకు ..వందలో ఉండడానికి ప్రయత్నించు..
  • ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడవద్దు. ఘనమైన ఫలితాలు క్రమంగా సమకూరుతాయి. సాహసాన్ని ప్రదర్శించండి.
  • ప్రయత్నం చేసి ఓడిపో... కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు
  •  
  • కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు
  •  
  • మతం అనేది సిద్దాంత రాద్దాంతాలలో లేదు .. అది ఆచరణలో ఆద్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది.
  •  
  • ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయపడుతుంది..బలహీనులకు కాదు
స్వామి వివేకానంద ప్రసంగానికి 125 ఏళ్ళు


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle