newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

భరతజాతికి ఆయనే కీర్తి... ఆయనే స్ఫూర్తి

12-01-202012-01-2020 15:27:16 IST
2020-01-12T09:57:16.286Z12-01-2020 2020-01-12T09:57:13.755Z - - 18-01-2020

 భరతజాతికి ఆయనే కీర్తి... ఆయనే స్ఫూర్తి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక్క పేరు చెబితే చాలు.. యువతరంలో మేలుకొంటుంది. ఒక్కరి గురించి అంతా మాట్లాడుకుంటారు. ఆయనేం ఎక్కువకాలం జీవించలేదు. కానీ ఆయన ఒక్క ప్రసంగంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. భారతదేశం అంటే ఏమిటో, సనాతన సంప్రదాయ విలువల గురించి ఆయన చేసిన ప్రసంగాలు యువతను తట్టిలేపాయి. ఆయనే భరత జాతి వెలుగు కిరణం.. స్వామి వివేకానంద. ఇవాళ ఆ యువతేజం జయంతి. ఈరోజునే జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 

భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఘనత వివేకానందకు దక్కుతుందంటే అతిశయోక్తి లేదు. వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా, 1863 జనవరి 12న ఆయన జన్మించారు. చిన్నతనం నుంచి భారతీయ సంప్రదాయాలకు ఆయన ఎంతో విలువ ఇచ్చేవారు. 

వివేకానంద అంటే రామకృష్ణ పరమహంస శిష్యుడిగా అందరికీ చిరపరిచితం. ఆయన ఆధ్యాత్మికత గురించి ఎన్నో నేర్చుకున్నారు. నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు. 

భారతదేశం అతని నివాసమైంది. ఇక్కడి ప్రజలు అతని సోదర, సోదరీమణులయ్యారు. ఆయనకు వున్న ఆస్తి అంతా ఒక కాషాయ వస్త్రము, ఒక కమండలము, శిష్యగణం మాత్రమే. దేశమంతా కాలికి బలపం కట్టుకుని తిరిగారు. అమెరికా నుంచి తిరిగి వచ్చాక,. రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశారు వివేకానంద.

ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసు లోనే ఆయన మనకు దూరం అయ్యాడు. ఎంతకాలం జీవించామన్నది ముఖ్యం కాదు. ఎంతమందిని కదిలించాం అనేది ముఖ్యం అంటారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా1984 లో ప్రకటించింది. స్వామి వివేకానందుని స్ఫూర్తి వచనాలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. ఆయన ప్రతిమాట నిరాశను పారద్రోలుతుంది. మందలో ఉండకు ..వందలో ఉండడానికి నీవు ప్రయత్నించు అంటారు స్వామి వివేకానంద. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడవద్దు. ఘనమైన ఫలితాలు క్రమంగా సమకూరుతాయి. సాహసాన్ని ప్రదర్శించండి. ముందుకు సాగమంటూ యువతను ముందుకు నడిపిస్తారు. 

చికాగోలో ఆయన చేసిన ప్రసంగం 127 ఏళ్ళవుతున్నా ఇప్పటికే అది చర్చనీయాంశంగానే వుంటుంది. ‘‘అమెరికా దేశపు ప్రియ సహోదరులారా! అని స్వామీజీ తన మృధు మధుర కంఠస్వరంతో అనగానే సభ మూడు నిమిషాలపాటు చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఈ శబ్దం ఆగిన తరువాత తన ప్రసంగాన్ని ఆరంభించాడు. అక్కడున్న ప్రతీ ప్రతినిధి స్వామీజీ ప్రసంగాన్నిఎంతగానో ప్రశంసించారు. వార్తాపత్రికలు ఆయన వ్యాసాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. పతాక శీర్షికల్లో ఆయన ఫోటోను ప్రచురించాయి.అనతి కాలంలోనే స్వామీజీకి ప్రపంచ ప్రఖ్యాతి లభించిందంటే ఆయన వాగ్ధాటి, సమ్మోహనరూపం అలాంటిది. 

భరత జాతి వెలుగు కిరణం.. స్వామి వివేకానంద

యువతను బాగా ప్రభావితం చేసిన పదాలలో ముఖ్యమయినది.. ప్రయత్నం చేసి ఓడిపో... కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు అంటారు. కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు అంటారు. వీటిలో ఎంతటి నిగూఢమయిన అర్థం దాగి వుందో అర్థం చేసుకోవచ్చు. మతం అనేది సిద్దాంత రాద్దాంతాలలో లేదు .. అది ఆచరణలో ఆద్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉందంటారు. 

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా భారతీయ యువతకు శుభాభినందనలు. వివేకానందుని స్ఫూర్తిగా మీరు ఎంచుకున్న రంగాల్లో గమ్యం చేరేవరకు మీరు శ్రమిస్తూనే వుండండి. యావత్ భారతజాతి బలోపేతానికి అంకితం కావాల్సిన రోజు ఇదే. ఆయన ఫొటోకి, విగ్రహానికి బరువైన దండలేసి మన బాధ్యత తీరిపోయిందని భావించకూడదు.  ఆయన జీవితచరిత్ర చదివి ఆకళింపుచేసుకుని, ఆయన గడిపిన నిస్వార్ధ జీవితాన్ని, మన దేశం పట్ల, యువత పట్ల ఆయనకున్న విజన్ ని మనం గ్రహించి ముందుకు సాగాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle