newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. లడ్డూధర తగ్గింపు

20-05-202020-05-2020 18:21:26 IST
Updated On 20-05-2020 19:29:32 ISTUpdated On 20-05-20202020-05-20T12:51:26.054Z20-05-2020 2020-05-20T12:49:49.860Z - 2020-05-20T13:59:32.269Z - 20-05-2020

భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. లడ్డూధర తగ్గింపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కారణంగా దేవదేవుడు కొలువైన కలియుగ వైకుంఠం తిరుమల మూతబడింది. భక్తులకు దర్శనభాగ్యం కరువై రెండునెలలవుతోంది. దర్శనాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలీని పరిస్థితి.  ఈ కరోనా సంక్షోభం వేళ టిటిడి  ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి శ్రీవారి భక్తులకు శుభవార్త అందించారు. చిన్న లడ్డూలను 50 నుంచి  25రూపాయలకు తగ్గించింది టిటిడి. ఎల్లుండి నుంచి భక్తులకు కోరినన్ని లడ్డూలు అందుబాటులోకి వస్తాయి. 

ఏపీలోని టిటిడి కళ్యాణ మండపాల్లో భక్తులకు అందుబాటులో లడ్డూలు వుంటాయి. శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభమయ్యేంత వరకు భక్తులకు అందుబాటులో లడ్డూలు వుంచుతామన్నారు వైవీ సుబ్బారెడ్డి. కరోనా కారణంగా భక్తులు రాకపోయినా శ్రీవారి ఈ-హుండీ ద్వారా కానుకలు సమర్పించే భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ-హుండీ ఆదాయం 2019 సంవత్సరంలో రూ.1.79 కోట్లు రాగా..2020 సంవత్సరంలో 1.97కోట్లు ఆదాయం వచ్చింది.

భక్తులకు దర్శనం కల్పించలేకపోయినా  ఈ-హుండీ ద్వారా భక్తులు కానుకలు సమర్పించుకుంటున్నారని. ప్రతిరోజు 3నుంచి 4లక్షల లడ్డూలను  తయారుచేస్తున్నామన్నారు. అధిక లడ్డూలు కావాల్సిన వారు తిరుమల ఆలయ డిప్యూటీ ఇఓ 9849575952, పోటు పేష్కార్  9701092777 సంప్రదించవచ్చునని ఆయన తెలిపారు. తిరుపతి కోవిడ్-19 ఆసుపత్రికి అవసరమైన మౌళిక వసతులకు టిటిడి  పూర్తి సహకారం అందిస్తుందని, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల సూచనల అనంతరం శ్రీవారి దర్శనం ఎప్పుడు ప్రారంభమవుతుందో చెబుతామన్నారు. 

తిరుమలకు ఆదాయం తగ్గడంతో ఉద్యోగులకు జీతాలు. ఇతర సౌకర్యాలు కల్పించడానికి టీటీడీ ఇబ్బంది పడుతోంది. టీటీడీ ఉద్యోగులు జీతాల చెల్లింపు ఇప్పుడు వివాదంగా మారుతోంది. ఉన్నతాధికారులు వ్యవహారశైలిపై ఉద్యోగులు మండిపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం రాష్ట్ర ఖజానా పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని 50 శాతం చెల్లింపు చేసిందని అధికారులు చెబుతున్నారు. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం పూర్తిజీతం చెల్లించాలంటున్నాయి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle