newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

బెజవాడ కోర్టు సంచలన తీర్పు.. మృగాడైన తండ్రికి 20ఏళ్ళ జైలు

03-12-201903-12-2019 19:04:13 IST
2019-12-03T13:34:13.896Z03-12-2019 2019-12-03T13:34:10.396Z - - 06-12-2019

బెజవాడ కోర్టు సంచలన తీర్పు.. మృగాడైన తండ్రికి 20ఏళ్ళ జైలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిర్భయ చట్టం అమలులోకి వచ్చాక కూడా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో దిశా ఘటన నేపథ్యంలో కఠిన చట్టాలు తేవాలని, సత్వర తీర్పులు ఇవ్వాలని డిమాండ్లు పెరిగిపోతున్నాయి. బెజవాడలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. వరుసకు కూతురైన మైనర్ బాలికను చెరపట్టి అత్యాచారం చేసిన  మారుతండ్రికి ఇరవై ఏళ్ళ జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ తీర్పు కూడా అతి తక్కువ కాలంలో వెలువడడం గమనార్హం. 

ఈ తీర్పు మృగాళ్లకు కనువిప్పు కలగాలని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు చరమగీతం పాడాలని జనం అభిప్రాయపడుతున్నారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంకి చెందిన సైకో కృష్ణారావు (అసలు పేరు సైకం కృష్ణారావు) అంటే సరిపోతుందేమో. ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే పనిచేసే వివాహితపై మనసు పడ్డాడు. ఇద్దరు బిడ్డల తల్లి అయిన ఆమెను పెళ్ళి చేసుకుంటానని, పిల్లల్ని బాగా చూసుకుంటానని ఒప్పించాడు. 

భర్తతో తెగతెంపులు చేసుకొని పిల్లల భవిష్యత్తు కోసం ఆమె కృష్ణారావు ప్రతిపాదనకు సరేనంది. వీరిద్దరూ 11 ఏళ్లనుంచి వీరిద్దరూ కలిసి బతుకుతున్నారు. కొడుకు, కూతురు బాగా చదువుకుంటుండటంతో ఆమె సంతోషించింది. ఈ క్రమంలో కృష్ఱారావు మనసు వక్రమార్గంలోకి వెళ్లింది. 10వ తరగతి చదువుతున్న కూతురిపై కన్నేశాడు. తల్లి ఇంట్లో లేని సమయం చూసుకుని, కూతురి వరసైన ఆ చిన్నారిపై అఘాయిత్యం చేశాడు.

విషయం తెలుసుకున్న తల్లి అతనికి దేహశుద్ది చేసింది. పోలీసులకు అప్పగించింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేశారు. ఏడాది తిరక్కముందే కేసు విచారణకు కొచ్చింది. విజయవాడలోని స్పెషల్ కోర్టు న్యాయమూర్తి కేసును విచారించి కృష్ణారావును దోషిగా తేల్చారు. అతనికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, ఐదువందల జరిమానా విధించారు. 

అన్ని సాక్ష్యాధారాలు సక్రమంగా ఉండడంతో న్యాయమూర్తి సత్వరం తీర్పు వెల్లడించారు. ఈ తీర్పు పట్ల బాధితురాలు, ఆమె తల్లీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దిశా హత్యాచార కేసుపై పోరాటం జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసులో న్యాయమూర్తి వేగంగా తీర్పు ఇవ్వడంతో మహిళా సంఘాలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. దిశా కేసులోనూ త్వరలో తీర్పు రావాలని, నిందితులకు కఠిన శిక్షలు పడాలని కోరుకుంటున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle