newssting
BITING NEWS :
*దేశంలో కరోనా విజృంభణ... 7,42,661, మరణాలు 20,53, కోలుకున్నవారు 4,57, 016 *నేడు వైఎస్సార్‌ 71వ జయంతి *ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్ *శ్రీకాకుళం జిల్లాలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటన..ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విజయసాయిరెడ్డి *కడప : ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల తో కలసి నివాళులర్పించనున్న సీఎం జగన్*తెలంగాణలో 1879 కరోనా పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 313 మంది మృతి..హైదరాబాద్ లో 1422 కేసులు..యాక్టివ్ కేసులు 11,012, డిశ్చార్జ్ అయిన కేసులు 16,287* రాజ‌ధానిలో త‌ల‌పెట్టిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటును విజ‌య‌వాడ‌కు మార్చిన ఏపీ స‌ర్కార్ *ముంబై ఎయిర్‌పోర్టు అథారిటీ నిధుల గోల్‌మాల్‌పై ఇప్ప‌టికే జీవీకేపై కేసు న‌మోదు చేసిన సీబీఐ.. సీబీఐ కేసు ఆధారంగా కేసు న‌మోదు చేసిన ఈడీ*ఏపీలో గ‌త‌ 24 గంటల్లో 1178 క‌రోనా పాజిటివ్ కేసులు, 13 మంది మృతి.. 21,197కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 252 మంది మృతి*ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టులో పిల్. కరోనా టెస్టులు, చార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్. యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు. ఈనెల 14 లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

బెంగాల్లో బీజేపీ ఆఫీసు బుగ్గి... టీఎంసీ పనే అంటున్న బీజేపీ

13-01-202013-01-2020 15:27:18 IST
2020-01-13T09:57:18.309Z13-01-2020 2020-01-13T09:57:06.264Z - - 09-07-2020

బెంగాల్లో బీజేపీ ఆఫీసు బుగ్గి... టీఎంసీ పనే అంటున్న బీజేపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పశ్చిమబెంగాల్లో బీజేపీ-టీఎంసీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి. తాజాగా బెంగాలో బీజేపీ కార్యాలయం మంటలకు ఆహుతి అయింది. బెంగాల్‌‌లో ఆదివారం దుండగులు తమ ప్రతాపం చూపించారు. అసోన్‌సోల్ జిల్లా సలాన్పూర్ గ్రామంలో ఉన్న బీజేపీ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. దుండగులు మంటలు రాజేశారు.

దీంతో ఒక్కసారిగా కార్యాలయంలో మంటలు వ్యాపించాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన కారణంగా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

కార్యకర్తలు, నేతలు ఎవరూ ఆఫీసులో లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. బీజేపీ నేతలు మాత్రం ఇదంతా తృణముల్ కాంగ్రెస్ పార్టీ నేతలే పనే అని ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle