newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

బెంగళూరులో వ్యభిచార ముఠా గుట్టురట్టు

09-07-202009-07-2020 09:14:23 IST
Updated On 09-07-2020 10:44:36 ISTUpdated On 09-07-20202020-07-09T03:44:23.453Z09-07-2020 2020-07-09T03:44:05.721Z - 2020-07-09T05:14:36.559Z - 09-07-2020

బెంగళూరులో వ్యభిచార ముఠా గుట్టురట్టు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో అనేక మంది కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతుంటే… కొందరు మాత్రం అక్రమ మార్గాలు తొక్కుతున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో మరో వ్యభిచార ముఠా బయటపడింది. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని యశ్వంతపూర్ ఏరియాలో ఓ గెస్ట్ హౌస్ లో వ్యభిచారం జరుగుతుందని సమాచారంతో పోలీసులు ఆ గెస్ట్ హౌస్ పై రైడ్ నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ వ్యభిచారం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారితో పాటు అక్కడే ఉన్న ఐదు మంది యువతులను రక్షించిన పోలీసులు వారిని రెస్క్యూ హోంకు తరలించారు.

ఈ రైడ్ కు సంబంధించిన వివరాలను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సందీప్ పాటిల్ తెలిపారు. ఇదే నేపథ్యంలో పోయిన వారంలో కూడా సీసీబీ పోలీసులు ఓ వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారని తెలిపారు. అయితే ఆ సమయంలో ఏకంగా 27 మంది మహిళలను కాపాడి బెంగళూరు నగరంలోని రెస్క్యూహోంకు తరలించారు. ఒకవైపు బెంగళూరు నగరంలో కరోనా తీవ్రరూపం దాలుస్తుంది. మరోవైపు ఇలాంటి అసాంఘిక చర్యలు జరగడం ఎంతవరకు సమంజసమో అర్థం కావట్లేదని పోలీసులు అంటున్నారు. కరోనా వల్ల వ్యభిచారం తగ్గుతోందని చెబుతున్నా.. ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే వుంది. 

ఇటు ఏపీలోనూ అమాయక యువతులను మోసం చేస్తూ వ్యభిచారంలోకి దింపుతున్న ముఠాల ఆటలను కట్టేస్తున్నారు పోలీసులు. విశాఖప‌ట్నంలో గ్రామీణ యువతులే లక్ష్యంగా చేసుకొని వ్యభిచార కూపంలోకి దించుతున్నాయి. అమాయ‌క మహిళలను బుట్ట‌లో వేసుకుని వారి  జీవితాలతో ఆడుకుంటున్నాయి. తిరుపతికి చెందిన యువ‌తి ఫిర్యాదు మేర‌కు పోలీసులు ముగ్గురు మహిళా నిర్వాహకులు, ముఠాతో సంబంధాలున్న మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ ప్రాంతానికి చెందిన ఓ యువతి కొద్ది రోజుల క్రితం  ఇంటి నుంచి వెళ్లిపోయి ఒంటరిగా తిరుపతికి చేరింది.

అక్కడ ఆమెను ట్రాప్ చేసిన వ్య‌భిచార ముఠా స‌భ్యులు ఫోన్ నంబర్ ఇచ్చి ఏదైనా సాయం కావాలంటే త‌మ‌ను అడగవచ్చని సూచించారు. దీంతో ఆయువ‌తిని ట్రాప్ చేసి విశాఖపట్నం తీసుకెళ్లి వ్య‌భిచారంలోకి దింపేశారు. నర్సీపట్నానికి చెందిన ఓ వ్యక్తి త‌న‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పి సహజీవనంచేసి మోసం చేశాడని,  వ్య‌భిచార‌ ముఠా తనను మాన‌సికంగా, శారీర‌కంగా చిత్ర‌వ‌ధ‌కు గురిచేసింద‌ని బాధిత యువతి తన గోడు వెళ్లబోసుకుంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి. బాధితురాలిని రెస్య్యూ హోంకి తరలించారు. 

 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle