newssting
BITING NEWS :
*విజయవాడలో ప్రజావేదిక కూల్చివేత *అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం జగన్ *పార్టీ మారడం ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి *పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి: పవన్ కళ్యాణ్ *హోదా బాధ్యత జగన్‌దే: ఎంపీ గల్లా జయదేవ్‌*‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు *ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

బీహార్‌లో మెదడువాపు....36మంది చిన్నారులు మృతి

12-06-201912-06-2019 12:25:11 IST
2019-06-12T06:55:11.760Z12-06-2019 2019-06-12T06:55:08.997Z - - 26-06-2019

బీహార్‌లో మెదడువాపు....36మంది చిన్నారులు మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మెదడు వాపు వ్యాది బీహార్లో చిన్నారులను బలితీసుకుంటోంది. ముజఫర్‌పూర్‌లో మెదడువాపు వ్యాధి లక్షణాలతో 48 గంటల వ్యవధిలో 36 మంది పిల్లలు మృత్యువాత పడడంతో కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. మరో 133 మంది చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ చిన్నారుల్లో 90 శాతం మంది  హైపోగ్లైసీమియావల్లే చనిపోతున్నారని వైద్యులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యాధికారులు చెబుతుండడంతో ఆందోళన నెలకొంది.

జనవరి నుంచి ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని, సరైన చికిత్స అందుతోందని వైద్యులు పేర్కొన్నారు. జనవరి నుంచి జూన్‌ 2 వరకు 13 మంది వ్యాధి మెదడువాపు లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా.. ముగ్గురు మరణించారు.

కానీ జూన్‌ 2 నుంచి ఇప్పటి వరకూ 86 మంది బాధితులు ఆస్పత్రిలో చేరగా వారిలో 31 మంది మరణించారని తెలిపారు. జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వాసుపత్రులన్నీ మెదడువాపు లక్షణాలున్న చిన్నారులతో నిండిపోతున్నాయి.

అధిక ఉష్ణోగ్రతతో జ్వరం రావడం, మానసిక ఆందోళన, తరచుగా ఉద్వేగానికి లోనవడం, కోమా వంటివి ఈ వ్యాధి లక్షణాలంటున్నారు వైద్యులు. వేసవిలో ఈ జిల్లాలో మెదడువాపు వ్యాధి పిల్లలకు సోకుతుంది.

అయితే అధికారులు మాత్రం ముందు జాగ్రత్తచర్యలు తీసుకోలేదు. దీంతో పదిహేనేళ్లలోపు పిల్లలకు వేసవిలో ఈ వ్యాధి రావడంతో అక్కడ శిశు మరణాల రేటు ఎక్కువగా నమోదవుతోంది. పేదరికం వల్ల పిల్లలు రాత్రిపూట ఆహారం తీసుకోలేరు. దీంతో వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయి పడిపోతుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle