newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

బీజేపీ దిద్దుబాటు.. నందీశ్వర్ గౌడ్ తనయుడిపై వేటు

03-12-201903-12-2019 13:28:32 IST
Updated On 03-12-2019 13:31:19 ISTUpdated On 03-12-20192019-12-03T07:58:32.831Z03-12-2019 2019-12-03T07:58:27.027Z - 2019-12-03T08:01:19.578Z - 03-12-2019

బీజేపీ దిద్దుబాటు.. నందీశ్వర్ గౌడ్ తనయుడిపై వేటు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నటి, బిగ్ బాస్ ఫేం సంజనతో అసభ్య ప్రవర్తన, పోలీసుల కేసు నమోదు నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తనయుడు ఆశిష్ గౌడ్ పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

బిగ్ బాస్ ఫేం సంజన కంప్లైంట్.. మాజీ ఎమ్మెల్యే కొడుక్కి చిక్కులు

ఆశిష్ గౌడ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తెలిపారు. సంజనపై ఆయన దాడి చేశారన్న వార్తలపై పార్టీ సీరియస్ అయింది.  నేతలు ఎవరైనా వారు క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు వార్తలు వస్తే పార్టీ చర్యలు తీసుకుంటుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

మహిళల సంక్షేమం, వారి రక్షణకు బీజేపీ కట్టుబడి ఉందని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తెలిపారు. మహిళలపై ఎలాంటి దాడులనూ బీజేపీ సహించబోదని నరేందర్ రెడ్డి అన్నారు.

రెండు రోజుల క్రితం నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్‌పై బిగ్ బాస్ రెండో సీజన్ కంటెస్టెంట్ సంజన పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆశిష్ తనపై మద్యం బాటిళ్లతో దాడికి దిగాడని, నోవా టెల్ సమీపంలో ఈ ఘటన జరిగిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

ఆశిష్ వేధింపులతో తాను, తన స్నేహితురాలు భయభ్రాంతులకు గురై, తప్పించుకున్నామని ఆమె వెల్లడించింది. సంజన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆశిష్ గౌడ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే తన ఎదుగుదలకు సహించలేక ఇలాంటి ఫిర్యాదు చేశారని ఆశిష్ గౌడ్ ఖండించారు. దర్యాప్తులో నిజానిజాలు తెలుస్తాయన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle