newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

బీజేపీ ఎమ్మెల్యే తుపాకీతో డ్యాన్స్..ఎక్కడో తెలుసా?

10-07-201910-07-2019 16:36:56 IST
2019-07-10T11:06:56.260Z10-07-2019 2019-07-10T11:06:54.702Z - - 17-07-2019

బీజేపీ ఎమ్మెల్యే తుపాకీతో డ్యాన్స్..ఎక్కడో తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈమధ్య ఎమ్మెల్యేలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర అని తేడా లేదు. తాజాగా ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

ఒక ఎమ్మెల్యేగా ఉండి మారణాయుధాలు ప్రదర్శిస్తూ జల్సా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హరిద్వార్-ఖాన్‌పూర్ నుండి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన కున్వర్ ప్రణవ్ సింగ్ మద్యం సేవిస్తూ చేసిన ఓవర్ యాక్షన్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. 

ప్రణవ్ సింగ్ తాను ఓ ప్రజా ప్రతినిధిని అనే విషయం మర్చిపోయి.. ఐటమ్ సాంగ్‌కు తుపాకులు చేత్తో పట్టుకొని డ్యాన్స్ చేశాడు. చుట్టూ మందుబాబులను పోగేసుకుని మరీ అల్లలచిల్లరగా తిరిగాడు.

అంతేనా, ఇంకా ఈ ఎమ్మెల్యే గారి బాగోతం చాలా వుంది.  గ్లాసులో మందు పోసుకొని.. దాన్ని తాగుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మందుబాబులతో కలిసి చిందులేశాడు. ఓ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రణవ్ కి ఇలాంటివి మామూలేనని అక్కడి స్థానికులు కామెంట్లు చేస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle