newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

బంగాళాఖాతంలో త్వరలో అల్పపీడనం

05-06-202005-06-2020 11:43:34 IST
Updated On 05-06-2020 13:49:55 ISTUpdated On 05-06-20202020-06-05T06:13:34.825Z05-06-2020 2020-06-05T06:11:51.490Z - 2020-06-05T08:19:55.429Z - 05-06-2020

బంగాళాఖాతంలో త్వరలో అల్పపీడనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రుతుపవనాలు ప్రవేశించడంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మహారాష్ట్రలో తీరందాటిన నిసర్గ తుఫాన్‌ బలహీనపడి ఈశాన్యంగా పయనించి వాయుగుండంగా మారింది. ఈ తుపాను విదర్భ, ముధ్యప్రదేశ్‌ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో వీచిన గాలులతో ఉత్తర కోస్తాలో అనేకచోట్ల గాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం మొగలిపురంలో గురువారం పిడుగుపడి ఉపాధి కూలీ 59 ఏళ్ళ బైలపూడి చెల్లమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. 

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సింగంపల్లి చెల్లమ్మ, శిరపురపు రమణమ్మ పరిస్థితి విషమంగా ఉంది. కొత్తవలస, అనకాపల్లి, గోకవరం, ఎలమంచిలిలో 4సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని పేర్కొంది.  రుతుపవనాలు కేరళతోపాటు పలు ప్రాంతాల్లో విస్తరించాయి. ఆదివారం వరకు మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, ఆగ్నేయ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని పలు ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

గురువారం సాయంత్రం గ్రేటర్‌లోని పలుచోట్ల వర్షం కురిసింది. సికింద్రాబాద్‌ పాటిగడ్డలో అత్యధికంగా 1.1 సెంటీమీటర్లు, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌లోని శ్రీనగర్‌కాలనీ, కీసరలోని దమ్మాయిగూడలో ఒక సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. శుక్రవారంకూడా  గ్రేటర్‌ హైదరాబాద్‌లో మూడ్రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని  వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

నైరుతి రుతుపవనాల వ్యాప్తి కొనసాగుతోంది. కర్వార్, హస్సన్, కన్యాకుమారి, కోయంబత్తూర్ వరకూ ఇవి వ్యాపించాయి.రానున్న రెండు రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చెరి, కరైక్కల్, నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతాల్లోకి రుతుపవనాలు వ్యాపిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. 

ఈ నెల 8నాటికి పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ప్రకటించింది. దీని ప్రభావంతో 9, 10 తేదీల్లో రాయలసీమ, కోస్తాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వాతావరణ నిపుణుడొకరు అంచనా వేశారు. శుక్ర, శనివారాల్లో ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలుప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 

కాగా, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. జార్ఖండ్, కర్నాటకల్లో భూప్రకంపనలు సంభవించగా, ఏపీలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. ఒంగోలు తో పాటు పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు కనిపించాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండు సెకన్ల పాటు కంపించింది భూమి. అయితే ఎలాంటి నష్టం సంభవించలేదు. రెండురోజుల క్రితమే అరేబియా సముద్రంలో నిసర్గ తుపాను ఏర్పడింది. దీని ప్రభావంతో మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో వానలు పడ్డాయి. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ నిసర్గ తుపాను తీవ్ర తుపానుగా మారి తీరాన్ని తాకింది.దీంతో మహారాష్ట్రలో భారీ వర్షాలు పడ్డాయి. జనజీవనం స్తంభించిపోయింది. 

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

   an hour ago


చేపలు పట్టేటప్పుడు ఓ మహిళపై మొసలి దాడి.. సగం తిన్న మొసలి

చేపలు పట్టేటప్పుడు ఓ మహిళపై మొసలి దాడి.. సగం తిన్న మొసలి

   20 hours ago


థర్డ్ వేవ్ తో పిల్లలకి ప్రమాదం లేదు..

థర్డ్ వేవ్ తో పిల్లలకి ప్రమాదం లేదు..

   13-06-2021


కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చింది: డాక్టర్ రాకేశ్ మిశ్రా

కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చింది: డాక్టర్ రాకేశ్ మిశ్రా

   12-06-2021


పాన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ లేకపోతే జరిమానా

పాన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ లేకపోతే జరిమానా

   12-06-2021


ఈ రెండురోజులు అలర్ట్ గా ఉండాలి..

ఈ రెండురోజులు అలర్ట్ గా ఉండాలి..

   11-06-2021


అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయి

అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయి

   10-06-2021


ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2021 ర్యాలీ: టెన్త్ అర్హతతో

ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2021 ర్యాలీ: టెన్త్ అర్హతతో

   10-06-2021


గోక్షుర ఆయుర్వేద ప్రయోజనాలు.. వాటిలో శృంగార వాంఛ కూడా ఒకటి

గోక్షుర ఆయుర్వేద ప్రయోజనాలు.. వాటిలో శృంగార వాంఛ కూడా ఒకటి

   10-06-2021


రు. 150 కోట్ల మొబైల్ యాప్ మోసం.. 11 మంది అరెస్ట్

రు. 150 కోట్ల మొబైల్ యాప్ మోసం.. 11 మంది అరెస్ట్

   10-06-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle