newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

బంగాళాఖాతంలో అల్పపీడనం... భారీవర్షాలు

02-08-202002-08-2020 11:10:25 IST
2020-08-02T05:40:25.778Z02-08-2020 2020-08-02T05:35:48.571Z - - 03-08-2020

బంగాళాఖాతంలో అల్పపీడనం... భారీవర్షాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీవర్షాలు పడుతున్నాయి. తాజాగా ఈనెల 4న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తూర్పు, పశ్చిమాల మధ్య ద్రోణి విస్తరించి ఉంది.  దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఈ నెల 5 వరకు ఉత్తరాంధ్ర, యానాం, ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో మరఠ్వాడా నుంచి తమిళనాడు వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలుల వలయం ఏర్పడింది. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రెండు రోజులుగా రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. 

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గుమ్మడిదల (సంగారెడ్డి జిల్లా)లో 16.5, కోటిపల్లి (వికారాబాద్‌)లో 12.1, లింగంపల్లి (హైదరాబాద్‌)లో 8.4, నర్సాపూర్‌ (మెదక్‌)లో 6.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది.శనివారం భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపుల‌తో పాటు బ‌ల‌మైన ఈదురు‌ గాలులు కూడా వీస్తున్నాయి.

ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, మాదాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మైత్రీవనం తదితర ప్రాంతాల్లో  భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లిలో గరిష్టంగా 4.8 సెం.మీ వర్షపాతం నమోదైంది.  భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి.  అలానే కొన్ని చోట్ల విద్యుత్‌కి అంత‌రాయం ఏర్ప‌డింది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle