newssting
BITING NEWS :
*నేడు మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

బంగారం మరింత ప్రియమా?

20-10-201920-10-2019 13:02:48 IST
2019-10-20T07:32:48.307Z20-10-2019 2019-10-20T07:32:29.358Z - - 15-11-2019

బంగారం మరింత ప్రియమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బంగారం అంటే మహిళలకు ఎంతో ఇష్టం. ఏ చిన్న సందర్భం వచ్చినా.. బంగారం కొనేస్తారు. మహిళలను దృష్టిలో ఉంచుకునే జ్యూయలరీ షాపులు వివిధ రకాల డిజైన్లను, ఆకర్షించే పథకాలను ప్రవేశపెడుతుంటాయి.

పెట్టుబడులకు సునరక్షితం అనే భావన వల్లే బంగారం అమ్మకాలు జరుగుతుంటాయి. బంగారానికి గత రెండు నెలల నుంచి డిమాండ్‌ కాస్త తగ్గిందనే చెప్పాలి. అందుకు కారణం.. ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకపోవడమేనని ఈ రంగానికి చెందిన నిపుణులు అభి ప్రాయపడుతున్నారు. 

ఈ దీపావళి దంతేరస్‌కు బంగారం అమ్మకాలు పుంజుకుంటాయని వ్యాపారులు భావిస్తున్నారు. పండుగ సీజన్‌తో పాటు దేశ వ్యాప్తంగా రాబోయే పెళ్లిళ్ల సీజన్‌ మొదలుకాబోతోంది. దీంతో పసిడి అమ్మకాలు పెరుగుతాయని బంగారం వ్యాపారులు అంటున్నారు. 2018 పండుగ సందర్భంలో పది గ్రాములు రూ.32వేల నుంచి రూ.33వేలమధ్య పలికింది.

గత ఏడాది అక్టోబర్‌ 22న పది గ్రాముల బంగారం రూ.32,220 కోట్‌గా కాగా.. గత ఏడాది ఇదే దంతేరస్‌ రోజున ఇదే స్థాయిలో కొనసాగింది.ఈ ఏడాదిలో బంగారం ధరలు గతంలో ఎన్నడూలేని విధంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. తాజాగా బులియన్‌ మార్కెట్‌ గణాంకాల ప్రకారం పది గ్రాములు సుమారు 40వేల వరకు కోట్‌ అయింది. అక్టోబర్‌ 11న ఢిల్లి మార్కెట్లో పది గ్రాములు రూ. 39,160 వద్ద కోట్‌ కావడం విశేషం. 

ఈ ఏడాది బంగారంపై పెట్టుబడులు పెట్టిన వారికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇతర పెట్టుబడులతో పోల్చితే చూస్తే బంగారంపైనే ఆదాయం ఎక్కువ వచ్చింది. ఉదాహరణకు మ్యుచువల్‌ ఫండ్స్‌, ఈక్విటీ మార్కెట్లు, రియల్‌ ఎస్టేట్‌, ఫిక్సిడ్‌ డిపా జిట్ల తో పోల్చుకుంటే పసిడిపై పెట్టుబడులు పెట్టిన వారే ఎక్కువ సంపాదించారని బిజినెస్ అనలిస్టులు చెప్పారు. భారత్‌లో బంగారం నిల్వలు 618.16 టన్నులకు చేరాయి. ఇతర దేశాలతో పోలిస్తే ఈ నిల్వలు బాగా ఎక్కువనే చెప్పాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle