facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
* తొలివిడత ఎన్నికలకు నోటిఫికేషన్ .. నామినేషన్లకు శ్రీకారం ..నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఈ నెల 25వ తేదీ* రక్షణమంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత.. రాష్ట్రపతి సహా పలువురి నివాళి * ఒకేసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ *మల్కాజ్ గిరి లోక్ సభ జనసేన అభ్యర్థిగా బి.మహేందర్ రెడ్డి *సెన్సార్ బోర్డు పై వర్మ సీరియస్... కోర్టుకెళతానన్న ఆర్జీవీ*కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన వినోద్ కుమార్

ఫ్రూట్స్ తిన్నాక నీరు తాగకూడదా?

15-03-201915-03-2019 07:27:48 IST
2019-03-15T01:57:48.899Z15-03-2019 2019-03-15T01:54:25.372Z - - 18-03-2019

ఫ్రూట్స్ తిన్నాక నీరు తాగకూడదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అవును. ఏవైనా పండ్లు తిన్నాక చాలామంది మంచినీళ్ళు తాగుతుంటారు. కానీ అది ఎంతమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. భోజనానికి ముందు గానీ తినేప్పుడు లేదా తిన్న వెంటనే మంచి నీళ్లు తాగొద్దని పెద్దలు చెబుతుంటారు. నీరు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే నీరు తాగడం వల్ల ఆహారం త్వరగా పేగుల్లోకి చేరుకుంటుంది. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. కొన్ని రకాల ఆహారం తీసుకున్నాక.. నీటిని తాగడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 

* వేసవికాలం మనం ఎక్కువగా పుచ్చకాయలు తీసుకుంటాం. పుచ్చకాయ ముక్కలు తిన్న వెంటనే కొంతమంది నీళ్ళు తాగేస్తారు. ఇలా చేస్తే కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. ఆహారాన్ని , జీర్ణం కావడాన్ని నీరు ఆలస్యం చేస్తుంది. ఎందుకంటే ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడే జఠర రసాలు పెరిగిపోతాయి.

*అరటి పండు తిన్న తర్వాత మంచి నీళ్లు తాగొద్దని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చల్లటి నీరు అసలు తాగకూడదు.  ఇలా చేస్తే తీవ్రమైన అజీర్తి సమస్య తలెత్తుందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అరటి పండు తిన్నాక పావు గంట తర్వాతే నీళ్లు తాగాలి.

*పల్లీలు తిన్నాక మంచినీళ్లు తాగకపోవడమే మంచిది. పల్లీల్లో నూనె మోతాదులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తినగానే నీటిని తాగడం వల్ల ఆహారనాళంలో కొవ్వులు పేరుకుపోతాయి. వీటికారణంగా దగ్గు, గొంతు మంటకు ఇది దారి తీస్తుంది.

* నిమ్మజాతి పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. వీటిని తిన్నాక.. నీటిని తాగడం వల్ల పొట్టలో పీహెచ్ స్థాయిల్లో మార్పులు వస్తాయి. ఫలితంగా ఎసిడిటీ, అజీర్ణం, గ్యాస్ ఏర్పడటం లాంటి సమస్యలు తలెత్తుతాయి.

* పాలు తాగిన వెంటనే నీరు తాగడం అస్సలు చేయకూడదు. దీనివల్ల జీర్ణక్రియలో మార్పులు వస్తాయి. కడుపునొప్పిగా అనిపిస్తుంది.A


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle