newssting
BITING NEWS :
*హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం. అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రమాదం, కారు వదలి పరారైన యువకులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా అనుమానం * అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా మొతేరా స్టేడియానికి ట్రంప్. మధ్యాహ్నం 12:30 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం*విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌పై స్పందించిన నేవీ..మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం*జనవరి 10న అమరావతి రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభం..హైకోర్టు ఆదేశాల మేరకు తుళ్లూరులో విచారణ ప్రారంభించిన పోలీసులు..గుంటూరు అడిషనల్‌ ఎస్పీ స్వామిశేఖర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న ఎంక్వైరీ *సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలోనీ ఓ కెమికల్ గో డౌన్ లో భారీ అగ్నిప్రమాదం*చైనాలో 2400 పైగా చేరిన కోవిద్ 19 వైరస్ మృతులు. 78 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి

ప‌ది మందితో తిరుగుతుంద‌ని ప్ర‌చారం చేయ‌డంతో..!

13-02-202013-02-2020 16:11:25 IST
2020-02-13T10:41:25.324Z13-02-2020 2020-02-13T10:41:11.079Z - - 24-02-2020

ప‌ది మందితో తిరుగుతుంద‌ని ప్ర‌చారం చేయ‌డంతో..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప‌ది మందితో తిరుగుతుందంటూ అత్తింటి వారు వేధింపుల‌కు గురి చేయ‌డంతో తాళ‌లేని ఓ వివాహిత ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించింది. హైద‌రాబాద్ హ‌య‌త్‌న‌గ‌ర్ య‌ల్లారెడ్డి కాల‌నీకి చెందిన క‌న‌క దుర్గ‌ను ఆమె భ‌ర్త‌, అత్త మామ‌లు వేధింపుల‌కు గురి చేయ‌డంతో విసిగిపోయింది.

ఆడ పిల్ల పుట్టింద‌న్న కార‌ణంతోపాటు ప‌ది మందితో తిరుగుతుందంటూ క‌ట్టుకున్న భ‌ర్తే ప్ర‌చారం చేయ‌డం మొద‌లు పెట్టాడు. దీంతో త‌ట్టుకోలేక విషం తాగిన క‌న‌క‌దుర్గ ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించింది. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న క‌న‌క‌దుర్గ ప‌రిస్థితి విష‌మంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

క‌న‌క‌దుర్గ త‌ల్లి మీడియాతో మాట్లాడుతూ ఆడ పిల్ల పుట్టింద‌ని, క‌ట్నం తేలేద‌ని తన కుమార్తెను అత్తింటి వారు రోజూ బాధ‌పెడుతూ ఉండేవారు. మ‌రిది వ‌ర‌స‌య్యే వ్య‌క్తి బ‌య‌ట రూము తీసుకుని ఉంటూ, ఇంటికి వ‌చ్చీ పోతూ నీకు ఇంట్లో స్థానం లేదు, వెళ్లిపో అంటూ అస‌భ్య ప‌ద‌జాలంతో ధూషించాడు. అత్త అయితే జుట్టు ప‌ట్టుకుని బూతులు తిడుతూ ఇంట్లోనుండి వెళ్లిపో అంటూ నానా హింస‌లు పెట్టింది. ఈ విష‌యాల‌న్నింటిని క‌న‌క దుర్గ త‌న సూసైడ్ నోట్‌లో రాసింది.

క‌న‌క‌దుర్గ అన్న మీడియాతో మాట్లాడుతూ మా చెల్లికి 2014లో మ్యారేజ్ అయింది. మొద‌ట ఒక కొడుకు పుట్టి చ‌నిపోయాడు. అప్ప‌టి నుండి వాళ్ల ఇంట్లో గొడ‌వ‌ల‌వుతున్నాయి. ఆ త‌రువాత ఆడ పిల్ల పుట్టింది. ఆడ పిల్ల పుట్టిన రోజున చూసి వెళ్లిపోయిన అత్తింటి వారు నాలుగైదు నెల‌ల వ‌ర‌కు చెల్లిని ఇంటికి తీసుకెళ్ల‌లేదు.

పాల‌కొల్లులోని మా బంధువుల వ‌ద్ద‌కు వెళ్లి క‌న‌క దుర్గ మంచిది కాదు. ప‌ది మందితో తిరుగుతుందంటూ ఆమె భ‌ర్త‌ పుకార్లు పుట్టించాడు. ఆ విష‌యాన్నే నిల‌దీయ‌డానికి మా చెల్లెలు వెళ్లింది  త‌న‌పై అలా ఎందుకు ప్ర‌చారం చేస్తున్నార‌ని నిల‌దీసినందుకుగాను అత్త, అత్త‌లు జుట్టుప‌ట్టుకుని కొట్టారు. భ‌ర్త, అత్త క‌లిసి చేసిన దాడిలో క‌న‌క దుర్గ వీపుపై మొత్తం గోరు గాట్ల గాయాల‌వ‌డంతోపాటు, చిటికెన వేలును విరిచేశారు. దాంతో గ‌మించి క‌న‌క దుర్గ‌ను ఆస్ప‌త్రికి తీసుకొచ్చి పోలీసుల‌కు ఫిర్యాదు చేశామ‌న్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle