newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

ప్రేమికుల పెళ్లిళ్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ ఈ ఆల‌యం..!

14-02-202014-02-2020 09:07:10 IST
2020-02-14T03:37:10.411Z14-02-2020 2020-02-14T03:37:04.992Z - - 14-08-2020

ప్రేమికుల పెళ్లిళ్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ ఈ ఆల‌యం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కుల‌, మ‌త, ప్రాంతాల‌తో సంబంధం లేకుండా ప్ర‌పంచం మొత్తం జ‌రుపుకునే పండుగ వాలైంటైన్స్ డే. అయితే, ప్రేమికుల కోసం తెలంగాణ‌లో ఓ ప్రేమాల‌యం ఉంది. ఆ ప్రేమాల‌యం ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో జంట‌ల‌ను క‌లిపింది. 1970లో ప్రారంభ‌మైన ఈ ఆల‌యం వేల జంట‌ల ప్రేమ పెళ్లిళ్ల‌కు వేదికైంది. అంతేకాకుండా ఆ ఆల‌యంలో పెళ్లి చేసుకుంటే జీవితాంతం క‌లిసి ఉంటారు అన్న సెంటిమెంట్ జ‌నాల్లో పాతుకుపోయింది.

మంచిర్యాల జిల్లా దండేప‌ల్లి మండ‌లం క‌న్నేప‌ల్లి స‌మీపంలోని శ్రీ స‌దానంద ఆల‌యం వంద‌లాది ప్రేమ వివాహాల‌కు వేదిక‌గా నిలిచి ప్రేమాల‌యంగా ప్ర‌సిద్ధి గాంచింది. 1970లో అప్ప‌టి ఎమ్మెల్యే చుంచు ల‌క్ష్మ‌య్య ప్ర‌జ‌ల్లో ఆధ్యాత్మిక భావాల‌ను పెంపొందించాలి అన్న ల‌క్ష్యంతో ఈ ప్రేమాల‌యాన్ని నిర్మించారు. ఆ రోజుల్లో స్వ‌యంగా ఆయ‌నే ప్ర‌వ‌చ‌నాలు అందించేవారు. దాంతో అప్ప‌ట్లో భ‌క్తుల కోలాహ‌లం అధికంగా ఉండ‌గా, రాను రాను ఈ ఆల‌యం ప్రేమికుల‌ను ఏకం చేసే ప్రేమాల‌యంగా ప్ర‌సిద్ధి గాంచింది.

స‌దానంద ఆల‌యంలో ఏడ‌డుగుల మూడు ముళ్ల బంధంతో దంప‌తులుగా మారిన జంట‌లు క‌ల‌కాలం సుఖ సంతోషాల‌తో వ‌ర్ధిల్లుతారు అన్న సెంటిమెంట్ బ‌లంగా ఉండటంతో తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల నుండి ప్రేమికులు త‌ర‌లి వ‌చ్చి ఇక్క‌డే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇలా ఒక్క తెలంగాణ నుండే కాకుండా ఇత‌ర రాష్ట్రాల నుండి కూడా ప్రేమ జంట‌లు ఇక్క‌డ‌కు వ‌చ్చి వివాహం చేసుకున్న దాఖ‌లాలు ఉన్నాయి.

ఆల‌యానికి సంబంధించి ప్రేమ పెళ్లి చేసుకున్న వ్య‌క్తి ఆల‌యం గురించి స‌మాచారం చెబుతూ స‌దానంద స్వామి ఆల‌యంలో 12 సంవ‌త్స‌రాల క్రితం నేను ప్రేమ వివాహం చేసుకున్నాను. పెద్ద‌ల‌ను ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు జీవితంలో కొన్ని క‌ష్టాలు వ‌చ్చినా ఇప్పుడు వారంద‌ర్నీ క‌లిసినందుకు పిల్ల‌ల‌తో క‌లిసి చాలా సంత‌షంగా ఉన్నాం. ఆ ఆల‌యంలో పెళ్లి చేసుకున్న వారు ఎవ‌రైనా స‌రే చాలా హ్యాప్పీగా ఉంటున్నారు. జీవితంలో ముంద‌డుగు వేసుకుంటూ భవిష్య‌త్తులో చాలా ఎదుగుతున్నారు.

గ‌తంలో ఇక్క‌డే పెళ్లి చేసుకుని దంప‌తులుగా మారిన ప్రేమికులు ప్ర‌తీ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 14న ఇక్క‌డ‌కు వ‌చ్చి ఉల్లాసంగా గ‌డుపుతారు. మొక్కులు చెల్లించుకుంటారు. ఇలాంటి ప్ర‌శాంత‌త ఉన్న ఈ స‌దానంద ఆల‌యాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రింత అభివృద్ధి చేయాల‌ని స్థానికులు కోరుతున్నారు. మొత్తంగా స‌దానంద ఆల‌యం రోజు రోజుకు ప్ర‌సిద్ది చెందుతోంది. ఒక్క ప్రేమాల‌యంగానే కాకుండా ఉత్స‌వాల టైమ్‌లో కూడా ఈ ఆల‌యానికి భ‌క్తులు భారీగా వ‌స్తూ ఉంటారు. పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటున్నారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle