newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ప్రియురాలి హత్య.. టిక్ టాక్ పోస్టులే కారణమా?

09-01-202009-01-2020 16:20:18 IST
2020-01-09T10:50:18.009Z09-01-2020 2020-01-09T10:50:15.596Z - - 05-08-2020

ప్రియురాలి హత్య.. టిక్ టాక్ పోస్టులే కారణమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సోషల్ మీడియా విస్తృతి పెరిగాక ప్రజల మధ్య సంబంధాలు సున్నితత్వం కోల్పోతున్నాయి. నిత్యం సోషల్ మీడియాలో మమేకమై జనం తమ సంబంధాలను తుంగలో తొక్కేస్తున్నారు. నిన్నమొన్నటివరకూ ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఎక్కువకాలం గడిపే యువతకు మరో సోషల్ మీడియా యాప్ గాలం వేసింది. అదే టిక్ టాక్. వివిధ మూవీ సాంగ్స్, పేరడీలకు తమ వీడియోలు జతచేసి రచ్చ రచ్చ చేస్తోంది యువత. 

టిక్ టాక్ కారణంగా దంపతుల మధ్య అభిప్రాయబేధాలు వస్తున్నాయి. టిక్ టాక్ కారణంగా ప్రియురాల్ని హత్య చేసిన ఓ యువకుడు తాను కూడా ఆత్మహత్యకు పాల్పడడం కేరళలో కలకలం రేపుతోంది. కన్యాకుమారి జిల్లా కేరళ సరిహద్దులో కారకోణం ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయిని 19 ఏళ్ల కుమార్తె ఆసికా. ఈమె తరచూ టిక్‌టాక్‌లో పోస్టులు చేస్తుంటుంది. వీడియోలు పోస్ట్ చేయడం ఈమెకు అలవాటయింది. 

టిక్ టాక్ కారణంగా ఆ అమ్మాయికి అను అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తర్వాత కొంతకాలానికి అతనితో సంబంధాన్ని తెంచుకుంది. సెల్‌ఫోన్‌ నెంబర్‌ బ్లాక్‌ చేసింది. ఇది నచ్చని కుర్రాడు ఆసికాను బెదిరిస్తూ వచ్చాడు.

ఆమె ఎక్కడుందో తెలుసుకుని ఆమెపై కత్తితో దాడికి దిగాడు. ఈ దాడిలో ఆసికా మరణించింది. అంతటితో ఆగకుండా ఆ కత్తితోనే అతను కూడా గొంతుకోసుకుని చనిపోయాడు.  దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. టిక్ టాక్ విషయంలో యువత జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle