newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ప్రార్ధనలు, విశ్వాసాలతో కరోనాని అదుపుచేయడం అసాధ్యం

29-07-202029-07-2020 12:31:37 IST
Updated On 29-07-2020 12:45:19 ISTUpdated On 29-07-20202020-07-29T07:01:37.014Z29-07-2020 2020-07-29T07:00:56.756Z - 2020-07-29T07:15:19.644Z - 29-07-2020

ప్రార్ధనలు, విశ్వాసాలతో కరోనాని అదుపుచేయడం అసాధ్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రార్థనలతో కరోనా తగ్గుతుందా? మూఢనమ్మకాలతో ఈ తీవ్రమయిన వైరస్ తగ్గించడం సాధ్యమేనా? అంటే అవకాశమే లేదని చెప్పవచ్చు. ఏదో ప్రార్థన చేయడం ద్వారా క్షణాల్లో కరోనా తగ్డడం అనేది అసాధ్యం. వివిధ ప్రార్ధనల ద్వారా, విశ్వాసం వల్ల కరోనా తగ్గినట్టు అనిపించినా తర్వాత పరీక్షలు చేస్తే కరోనా వున్నట్టు నిర్దారణ అవుతుంది. ప్రార్ధన వల్ల మనశ్శాంతి కలిగి స్వాంతన కలిగిస్తుంది అంతే. కానీ హిస్టీరియా వల్ల కరోనా వైరస్ తగ్గినట్టు అలా అనిపించవచ్చు. ఏమతాన్ని కించపరచడం ఉద్దేశ్యంకాదు. 

ప్రార్ధనతో వ్యాధిని తగ్గించడం అనేది మూర్ఖత్వం, అమాయకత్వం అవుతుంది. మతం పేరుతో ఫేక్ హీలర్స్ ప్రార్ధనను ఒక సంపాదనకు అవకాశంగా భావించడం సమంజసం కాదు. ఈమధ్యకాలంలో ఒక మతానికి చెందిన వ్యక్తులు ప్రజల బలహీనతలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రార్ధనతో తగ్గించవచ్చనే తప్పుడు ప్రచారం సమాజానికి మంచిది కాదు. ప్రజల్లో కరోనాపై అవగాహన కలిగించి చికిత్స అందించాలి.

వ్యాక్సిన్ వస్తేనే కరోనాను అదుపుచేయవచ్చు. ప్రార్ధన చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం ఈ వ్యాధిని మరింతగా వ్యాపింపచేయడమే అవుతుంది. నిజంగా ప్రార్థనలు చేయడం ద్వారా కరోనా తగ్గితే ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కరోనా కేసులు రావు. లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోరు. 

ప్రార్థన చేయడం, అందుకు వందలాదిమంది గుమిగూడడం మంచిది కాదు. ప్రార్థన చేసే వ్యక్తి సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల సమజానికి మరింత నష్టం చేకూరుతుంది. భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం, ఇంటిపట్టునే వుండడం చేయాలి. మంచి బలవర్థకమయిన ఆహారం, వ్యాయామం ద్వారా కరోనాను కట్టడిచేయడానికి అవసరమయిన రోగనిరోధక శక్తి మన శరీరానికి అందుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తోంది. ఈ వైరస్ అన్ని వయస్సుల వారిపై ప్రభావం చూపిస్తోంది. ఈ మహమ్మారిపై చేసే యుద్ధంలో ప్రజలు గెలవాలి అంటే ముఖ్యంగా వారికి వ్యాధి పట్ల పూర్తి అవగాహన ఉండాలి. వ్యాధిపై అవగాహన పెంచి, పొంచి ఉన్న ప్రమాద తీవ్రతను తెలియజేయడం ఎంతో ముఖ్యం. 

వదంతులు, మూఢ విశ్వాసాలకు లోనైతే ప్రమాద తీవ్రత పెరుగుతుంది. కరోనా సోకిన వ్యక్తి సకాలంలో వైద్యం పొందాలి. స్వీయనిర్బంధం, హోం ఐసోలేషన్ ద్వారా ఇతరులకు వ్యాధిని వ్యాపించకుండా తమవంతు బాధ్యత నెరవేర్చాలి. ఇప్పటి వరకు, కరోనా వైరస్ ను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి నిర్దిష్టమైన మెడిసిన్ ఏదీ సిఫార్సు చేయలేదు. కరోనా వ్యాక్సిన్ కు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వ్యాక్సిన్ ద్వారా మాత్రమే కరోనాను నియంత్రించవచ్చు. వ్యాక్సిన్ వచ్చేవరకూ మనం జాగ్రత్తగా వుండాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle