newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

ప్రాణాలు మింగేస్తున్న వాయుకాలుష్యం

12-06-201912-06-2019 13:21:21 IST
2019-06-12T07:51:21.730Z12-06-2019 2019-06-12T07:51:20.221Z - - 20-09-2019

ప్రాణాలు మింగేస్తున్న వాయుకాలుష్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతదేశవ్యాప్తంగా రోజురోజుకీ పెరిగిపోతున్న వాయుకాలుష్యం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. కాలుష్య ప్రభావం వల్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీంతో జీవనప్రమాణం తగ్గిపోతోంది. మనం పీల్చే గాలి కాలుష్యం బారిన పడడంతో సగటున 2.6 సంవత్సరాలు జీవన ప్రమాణం తగ్గుతోందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితులకు లోబడి వాతావరణంలో వాయు కాలుష్యం సూచీలు ఉండాలి. వాయు కాలుష్యం పెరగడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతింటోంది. ఊపిరితిత్తుల పనితీరు స్తంభింపచేస్తుంది.

జాతీయ స్థాయిలో వాయు కాలుష్యం పెరగడం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటోందని, దీనిపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వెంటనే మేల్కొనాల్సిన అవసరం ఉందని పర్యావరణ వేత్తలు, డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ ఈ నివేదికను వెల్లడించింది. దేశంలో వాయుకాలుష్యం వల్ల 12లక్షలమంది చనిపోతున్నారు. 

Image result for air pollution in india

ప్రాణాలు హరిస్తున్న మూడు ముఖ్య ప్రమాదాల్లో వాయుకాలుష్యం మూడో స్థాయిలో ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వాయు కాలుష్యం భారత దేశంలో పశ్చిమ ప్రాంతం నుంచి తూర్పు ప్రాంతంవైపు వ్యాపిస్తోందన్నారు.

వారణాసిలో కూడా వాయుకాలుష్యం తీవ్రంగా ఉంది. మీరట్, ఆగ్రా, లక్నో, గోరఖ్‌పూర్, పాట్నాలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది. అదే గయ, ముజఫర్‌పూర్, అలహాబాద్‌లో ఒక మోస్తరులో వాయుకాలుష్యం నెలకొని ఉంది. వాయు కాలుష్యం ప్రభావం అక్టోబర్-నవంబర్, డిసెంబర్ -ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంలో వాయుకాలుష్యం స్థాయి భారీగా పెరిగిపోతోంది. 2010 నుంచి ఈ పెరుగుదల ప్రమాకరస్థాయిలో ఉంది. 

జనాభా పెరుగుదల, పారిశ్రామికీకరణ, నగరాలు పెరగడం, అడవులు తరిగిపోవడం, సహజ వనరుల వినియోగంపై నియంత్రణ తగ్గడంతో వివిధ పర్యావరణ వ్యవస్థలు పాడైపోతున్నాయి. దీంతో ప్రకృతిలో సమతుల్యత దెబ్బతిని స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణం కాలుష్యకారకమై మానవాళికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. ముఖ్యంగా పీల్చే వాయువు కలుషితమవడంపై ప్రపంచదేశాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న వాయుకాలుష్యాన్ని నిలువరించకపోతే భవిష్యత్తులో పరిస్థితులు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. 

Image result for air pollution in india

ప్రపంచవ్యాప్తంగా కేవలం పది శాతం జనాభా మాత్రమే స్వచ్ఛమైన ప్రాణవాయువును పీల్చగలుగుతున్నారు. మిగిలిన మిగతా 90 శాతం మంది నాణ్యతలేని ప్రాణవాయువును పీల్చి అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. గాలిలో ధూళి కణాలు, పొగ, పొగమంచు వంటి వాయువులు గాలిలో అధికంగా చేరడంతో వాయుకాలుష్యం ఏర్పడుతోంది.

ప్రపంచ వాయు నాణ్యత నివేదిక- 2019 ప్రకారం వాయు కాలుష్యం మూలంగా జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు, గుండెపోటు మూలంగా తలెత్తే మరణాల్లో మూడింట ఒక వంతు వాయుకాలుష్యం వల్లే తలెత్తుతున్నాయి. తొంభై శాతం వాయుకాలుష్య ప్రభావ మరణాలు తక్కువ ఆదాయం కలిగిన ఆసియా, ఆఫ్రికా దేశాల్లోనే నమోదవుతున్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా అత్యంత వాయు కాలుష్యమయమైన 20 నగరాల్లో 14 మన దేశంలోనే ఉన్నాయంటే మనమెంత రిస్క్ చేస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. నగరాల్లో జీవించేవారి జీవన ప్రమాణం తగ్గడానికి కూడా కారణం వాయుకాలుష్యమే. వాయుకాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు, గుండెపోటు, హృద్రోగ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

ఒక అంచనా ప్రకారం దిల్లీ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో సగం మంది ఊపిరితిత్తుల సమస్యను ఎదుర్కొంటున్నారు. వాయుకాలుష్యం తగ్గించేందుకు విరివిగా మొక్కలు నాటడం, వాహనాల వినియోగం తగ్గించడం, సోలార్ ఎనర్జీని ఉపయోగించడం చేయాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle