newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ప్రపంచంలో అతి కొత్త వృత్తి.. మాస్క్‌ల తయారీ.. రోజుకు 800 కోట్ల మాస్క్‌లు అవసరం

19-04-202019-04-2020 14:56:46 IST
Updated On 19-04-2020 16:23:56 ISTUpdated On 19-04-20202020-04-19T09:26:46.674Z19-04-2020 2020-04-19T09:26:44.406Z - 2020-04-19T10:53:56.169Z - 19-04-2020

ప్రపంచంలో అతి కొత్త వృత్తి.. మాస్క్‌ల తయారీ.. రోజుకు 800 కోట్ల మాస్క్‌లు అవసరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారీ స్థాయి ఉత్పత్తి అంటే పెద్దపెద్ద కంపెనీలు అసెంబ్లింగ్ లైన్లను నెలకొల్పి లక్షలాది వస్తువులను నిమిషాలు, గంటల వ్యవధిలో తయారు చేసి ప్రపంచంమీదికి వదలడం అనుకునేవాళ్లం ఇన్నాళ్లూ. కానీ కరోనా మహమ్మారి పుణ్యమా అని మాస్ ప్రొడక్షన్ అంటే సరికొత్త నిర్వచనం వచ్చేసింది. ప్రపంచమంతటా మామూలు ఉత్పత్తి కార్యకలాపాలు అగిపోయిన తరుణంలో కరోనా కట్టడికి ఉపయోగించే వైద్య పరీక్షా పరికరాల తయారీ ఇప్పుడు భారీ స్థాయి పరిశ్రమగా మారిపోయింది. దాంతోపాటు అనుబంధంగా పుట్టుకొచ్చిన మరో మాస్ ఉత్పత్తి మాస్క్‌‌ల తయారీ

ప్రపంచంలో దాదాపు 350 కోట్లమంది ఇప్పటికే కరోనా ప్రభావిత దేశాల్లో నివసిస్తుండటంతో వీరందరికీ మాస్కులను తయారు చేయడం ప్రపంచం ఇంతవరకు కనీవినీ ఎరుగని అతిపెద్ద వృత్తిగా మారిపోయింది. ఇష్టం ఉన్నా లేకున్నా ప్రపంచానికి ఇప్పుడు మాస్క్‌లు ధరించడం అనివార్యమైపోయింది. ఈ నేపథ్యంలో మరో ఆరునెలలపాటు కొన్ని వందలకోట్ల మాస్కులు అవసరం అవుతాయి. అవి సర్జికల్ కావచ్చు, సామాన్యుల రక్షణకు ఉపయోగపడే మామూలు మాస్క్‌లు కావచ్చు. యావత్ ప్రపంచానికీ మాస్కులే ఇప్పుడు నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. దీనికి తోడు ప్రభుత్వాలకు ప్రభుత్వాలే జనం బయటకు వస్తే మాస్కులు ధరించాల్సిందేనని ఆంక్షలు విధిస్తుండటంతో ఈ కొత్త వృత్తికి, ఈ వినూత్న పరిశ్రమకి తిరుగే ఉండదని నిపుణలు చెబుతున్నారు.

ఇంట్లోంచి బయటకొస్తే మాస్కులు ధరించడం ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాల్లో తప్పనిసరి అయింది. జపాన్‌ లాంటి దేశాల్లో కాలుష్యం కారణంగా ఈ పద్ధతి చాలాకాలంగా అమల్లో ఉంది కూడా. ఇలా కాకుండా ఇకపై భూమ్మీది జనాభా మొత్తం రోజూ మాస్కులు ధరించాల్సి వచ్చిందనుకోండి. ఏమవుతుంది కళ్లు చెదిరే లెక్కలు మన కళ్లముందు కనిపిస్తాయి. 

సర్జికల్‌ మాస్కులు వేసుకోవడం వల్ల మన శరీర ద్రవాలు ఎదుటివారికి వెంటనే సోకవని.. తద్వారా అనేక వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చని మనకు తెలుసు. కాలుష్యం బారి నుంచి రక్షణ పొందేందుకు కొంత మేరకు ఇవి ఉపయోగపడతాయి. భూమ్మీద మొత్తం 780 కోట్ల జనాభా ఉంది. వారందరికీ మెడికల్‌ మాస్కులు ఇవ్వాల్సి వస్తే.. వారానికి దాదాపు 5,500 కోట్ల మాస్కులు అవసరమవుతాయి.

వీటితయారీకి 300 కోట్ల డాలర్లు లేదా రూ. 22 వేల కోట్లు అవసరం. వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి ఈ మాస్కులతో పెద్దగా ప్రయోజనం ఉండదు. ప్రపంచం మొత్తమ్మీద సుమారు 6 కోట్ల మంది వైద్య సిబ్బంది ఉంటారని అంచనా. వారందరికీ ఎన్‌–95 మాస్కులు ఇవ్వాలంటే ఒక్కో రోజుకు రూ. 229 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. డబ్బులెలాగో తెచ్చి పెట్టినా వాటిని తయారు చేసే వాళ్లు కావాల్సి ఉంటుంది కాబట్టి మాస్కుల తయారీ అనేది ఓ కొత్త వృత్తిగా మారిపోతుంది. ప్రభుత్వాలు వాటిని ఉచితంగా ఇవ్వకపోతే ఒక్కొక్కరూ ఏటా మాస్కుల కోసం కనీసం రూ. వెయ్యి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కొంత సమయం తరువాత మాస్కుల్లో డిజైన్లు, ప్రత్యేక ఫీచర్లు రావడం మొదలవుతుంది.  

అందరూ రోజంతా మాస్కులేసుకుంటే ముఖ కవళికలేవీ తెలియవు కాబట్టి ఎదుటివారు మన బాడీ లాంగ్వేజీని అర్థం చేసుకునే తీరు మారుతుంది. షేక్‌హ్యాండ్లు గట్రా లేకపోతే వైరస్‌ల వ్యాప్తి కొంత వరకూ తగ్గవచ్చుగానీ చేతులు కడుక్కోవడం, చేతులతో ముఖాన్ని తాకకపోవడం వంటి ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని మాస్కుల ప్రయోజనాన్ని లెక్కించాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏమిటంటే ప్రపంచం మొత్తమ్మీద ఒక్క రోజులో 800 కోట్ల మేరకు వాడి వదిలేసిన మాస్కులు చెత్తకుప్పల్లోకి చేరతాయి. వాటిని రీసైకిల్‌ చేయడం కోసం మరిన్ని ఫ్యాక్టరీలు పెట్టాల్సి వస్తుందన్నమాట! 

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే విధుల్లో ఉన్న ఉద్యోగులందరూ మాస్క్‌లు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులు కూడా మాస్క్‌లు పెట్టుకోవాల్సిందేనని సూచించింది. కాగా బయట దొరికే మాస్కులతో పాటు ఇళ్లలో తయారు చేసిన మాస్క్‌లను కూడా ధరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఇతరులతో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా మాస్కువేసుకోవాలని తెలిపింది.  

కాగా ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్‌, ఒడిశా రాష్ట్రాలు మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో మాస్క్‌లు పెట్టుకోకుంటే అరెస్టుతో పాటు జరిమానా కూడా విధిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు వాటి జాబితాలో తెలంగాణ కూడా చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు 471 కరోనా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 12కు చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇప్పటికే స్వయం సహాయక సంఘాలు, కుట్టు మిషన్ల వృత్తిలో ఉన్న మహిళల ద్వారా దాదాపు 16 కోట్ల మాస్క్‌లను  సిద్ధం చేసి పంపిణీ చేయబోతోంది. ఏపీలోని 5 కోట్ల 30 లక్షలమంది జనాభాలో ప్రతి ఒక్కరికీ తలొక 3 మాస్కులను యుద్ద ప్రాతిపదికన పంపిణీ చేయాలనే లక్ష్య సాధనలో రాష్ట్ర ప్రభుత్వం అద్భుత ఫలితాలను సాధించింది.  అయితే తక్కువ వ్యయంతో తయారు చేసే ఈ మాస్కుల వల్ల  వైరస్‌ని పెద్దగా కట్టడి చేయలేమని నిపుణులు పెదవి విరుస్తున్నారు. పైగా ఈ మామూలు మాస్క్‌లు ధరించినవారి కంటే అవతలవారికి వైరస్ క్రిమి సోకకుండా అడ్డుకుంటాయి తప్పితే ధరించిన వారిని వైరస్ నుంచి పెద్దగా కాపాడలేవని చెబుతుండటంతో వీటికన్నా ఇంట్లోనే బనియన్ క్లాత్ వంటి మెత్తటి బట్టతో సొంతంగా మనకు మనమే కుట్టుకునివాడితే చాలా వరకు ఉపయోగమని తేలింది. దీంతో బ్రిటన్‌లో అనేకమంది ఇప్పుడు బట్టతో తయారు చేసిన మాస్కులే వాడుతున్నారు. 

మొత్తంమీద ప్రపంచం మునుపెన్నడూ ఎరుగని మాస్ ప్రొడక్షన్ ఇప్పుడు మన కళ్లముందు మాస్కుల తయారీ రూపంలో కనబడుతోంది. మాస్కు ధరించడం మనిషికి సౌందర్యసాధనం కాదు. అది ప్రాణాలను కాపాడే అత్యంత సరళరూపంలోని వినియోగ వస్తువుగా తయారైంది.

ఒక్కటి మాత్రం నిజం.. భూమ్మీద మనుషులు ఉన్నంతవరకు వైరస్‌లు ఉంటాయి. వైరస్‌లు ఉన్నంతవరకు మనిషికి మాస్కులు అవసరం అవుతూనే ఉంటాయి. 

 

Crime: కన్నతండ్రి పాడు బుద్ది.. స్నేహితుడితో కలిసి కూతురితో అసభ్యంగా..

Crime: కన్నతండ్రి పాడు బుద్ది.. స్నేహితుడితో కలిసి కూతురితో అసభ్యంగా..

   10 hours ago


Disha App: రాత్రి 10.30 సమయంలో హైవేలో ఆటో ఎక్కిన యువతి.. మారిన డ్రైవర్ ప్రవర్తన

Disha App: రాత్రి 10.30 సమయంలో హైవేలో ఆటో ఎక్కిన యువతి.. మారిన డ్రైవర్ ప్రవర్తన

   17 hours ago


మృతురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం

మృతురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం

   19 hours ago


ఆంధ్రప్రదేశ్‌, హైదరాబాద్ సమీపంలో మాగ్నిట్యూడ్ 4 భూకంపం సంభవించింది

ఆంధ్రప్రదేశ్‌, హైదరాబాద్ సమీపంలో మాగ్నిట్యూడ్ 4 భూకంపం సంభవించింది

   19 hours ago


ఉజ్జయినీ అమ్మవారికి బంగారు బోనం సమర్పణ

ఉజ్జయినీ అమ్మవారికి బంగారు బోనం సమర్పణ

   25-07-2021


Mosquito Tornado: దోమల సుడిగాలి.. వీడీయో వైరల్, మీరు కూడా చూడండి

Mosquito Tornado: దోమల సుడిగాలి.. వీడీయో వైరల్, మీరు కూడా చూడండి

   20-07-2021


Hyderabad: 16 ఏళ్ల  కూతురికి అన్నంలో నిద్ర మాత్రలు కలిపి కన్న తండ్రే కసాయివాడు అయ్యాడు

Hyderabad: 16 ఏళ్ల కూతురికి అన్నంలో నిద్ర మాత్రలు కలిపి కన్న తండ్రే కసాయివాడు అయ్యాడు

   20-07-2021


16 ఏళ్ల బాలిక పై భవన నిర్మాణ కార్మికుడి పైశాచికం.. అనారోగ్యానికి గురైన బాలిక

16 ఏళ్ల బాలిక పై భవన నిర్మాణ కార్మికుడి పైశాచికం.. అనారోగ్యానికి గురైన బాలిక

   19-07-2021


ఈ రోజు సుప్రీం కోర్టు బిజీలోని ముఖ్యాంశాలు పావురాలు, పాలిసీ, యాత్రికులు మరియు జైళ్ళు

ఈ రోజు సుప్రీం కోర్టు బిజీలోని ముఖ్యాంశాలు పావురాలు, పాలిసీ, యాత్రికులు మరియు జైళ్ళు

   18-07-2021


ఈ సంవత్సరం ఖైరతాబాద్‌ గణేష్‌ రూపం ఇదే.. గణేష్ చిత్రపటం ఆవిష్కరణలో ఉద్రిక్తత

ఈ సంవత్సరం ఖైరతాబాద్‌ గణేష్‌ రూపం ఇదే.. గణేష్ చిత్రపటం ఆవిష్కరణలో ఉద్రిక్తత

   17-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle