newssting
BITING NEWS :
మహారాష్ట్ర సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కలయికతో కూడిన మహావికాస్ ఆఘాదీ ప్రభుత్వం స్వయంగా కుప్పకూలిపోతుందన్న ఫడణవీస్. కూటమిని అధికారం నుంచి తొలగించడానికి బీజేపీ ఏం చేయనవసరం లేదని చెప్పిన ఫడణవీస్ * బీహార్ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు 30వేల మంది కేంద్ర బలగాలను పంపించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయం. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ నిర్వహించేందుకు వీలుగా 30వేల మంది కేంద్ర బలగాల జవాన్లతో ఏర్పాటు చేయనున్న బందోబస్తు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలలో కేంద్ర అదనపు బలగాలతో రక్షణ * చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల అగ్రరాజ్యంలోని దిగ్గజ కంపెనీల ఆగ్రహం. 30 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌లో కేసులు వేసిన 3,500 కంపెనీలు * కర్ణాటక రాష్ట్రం కలబుర్గి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. సావళగి క్రాస్‌ అళంద రోడ్డుపై తెల్లవారుజామున రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి. నెలలు నిండిన మహిళకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా ప్రమాదం * 286వ రోజుకు చేరుకున్న అమరావతి రాజధాని రైతుల ఉద్యమం. గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం * ఏపీ‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ. ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి. బ్రహ్మోత్సవాల అనంతరం స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వెల్లంపల్లి * ప్రకాశం బ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న కృష్ణా నది. కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక. ప్రాజెక్టు వద్ద 6,65,925 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచన * తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన రథం నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ * యాదాద్రి-భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం ప్రొద్దుటూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాని కుప్పకూలిన పెంకుటిల్లు. అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఇల్లు. శబ్దాన్ని గమనించిన నలుగురు కుటుంబ సభ్యులు వెంటనే బయటకు రావడంతో తప్పిన ప్రాణాపాయం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం. 20 క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. 4,19,454 క్యూసెక్కులుగా ఉన్న ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 310.252 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులు * రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు తెలంగాణ ఎంసెట్ పరీక్ష. ఉదయం, మధ్యాహ్నం రెండు షెషన్‌లలో పరీక్ష నిర్వహణ. తెలంగాణ, ఆంధ్రాలో కలిపి మొత్తం 84 సెంటర్లలో పరీక్షను నిర్వహణ. తెలంగాణలో 67, ఆంధ్రాలో 17 పరీక్షా కేంద్రాలు

పోగొట్టుకున్న సెల్ ఫోన్ దొరికింది.. ఆ ఫోన్ లో ఎవరి సెల్ఫీలు ఉన్నాయంటే..!

16-09-202016-09-2020 12:58:21 IST
2020-09-16T07:28:21.930Z16-09-2020 2020-09-16T07:28:19.280Z - - 28-09-2020

పోగొట్టుకున్న సెల్ ఫోన్ దొరికింది.. ఆ ఫోన్ లో ఎవరి సెల్ఫీలు ఉన్నాయంటే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పోగొట్టుకున్న సెల్ ఫోన్ దొరకడం చాలా కష్టమే అనుకోండి..! కానీ అదృష్టం ఉంటే మన మొబైల్ తిరిగి మన చెంతకు చేరుతూ ఉంటుంది. తాజాగా మలేషియాకు చెందిన ఓ విద్యార్థి మొబైల్ ఫోన్ మిస్ అయ్యింది. తిరిగి అది అతడి చెంతకు చేరింది. ఆ ఫోన్ లో ఉన్న ఫోటోలను చూడగా అతడే ఆశ్చర్యపోయాడు. ఇంతకూ ఆ ఫోన్ లో ఏమున్నాయో తెలుసా..? కోతి తీసుకున్న సెల్ఫీలు..!

జాక్రిడ్జ్ రోడ్జి మీడియాతో మాట్లాడుతూ నిద్రపోతున్నప్పుడు తన మొబైల్ ఫోన్ ను పోగొట్టుకున్నానని భావించాడు. బాటు పహాట్ కు చెందిన రోడ్జి శుక్రవారం తన మొబైల్ ఫోన్ ను పక్కనే పెట్టుకుని నిద్రపోయాడు. శనివారం ఉదయం లేచి చూడగా తాను పెట్టిన చోట మొబైల్ ఫోన్ కనిపించలేదు. దొంగతనం ఎవరైనా చేశారన్న ఆనవాళ్లు కూడా కనిపించలేదు.  

కానీ తన ఫోన్ ను వెతకడానికి రోడ్జి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తన ఇంటికి దగ్గరలో అడవులు కూడా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం సమయానికి తన మొబైల్ ఫోన్ ను గుర్తించగలిగాడు రోడ్జి. తన తండ్రిని ఆ మొబైల్ కు కాల్ చేస్తూ ఉండమని చెప్పాడు. అలా రింగ్ టోన్ వచ్చిన దిశకు రోడ్జి వెళ్ళాడు. ఓ తాటి చెట్టు కింద ఆ ఫోన్ పడి ఉండడాన్ని గమనించాడు. ఫోన్ దొరికింది కదా అని ఆనందించాడు.

ఆ ఫోన్ లో దొంగ ఫోటోలు ఏమైనా ఉన్నాయేమోనని రోడ్జి అంకుల్ జోక్ చేశాడట. కానీ గ్యాలరీ ఓపెన్ చేస్తే మొబైల్ ఎత్తుకున్న దొంగకు సంబంధించిన ఫోటోలు అయితే కనిపించాయి కానీ..! ఆ దొంగ మనిషి కాదు.. ఆ దొంగ ఓ కోతి..!

Man says he found 'selfies' of monkey on lost phone he retrieved. They are  hilarious - it s viral - Hindustan Times

గ్యాలరీలో కొన్ని ఫోటోలు వీడియోలు కనిపించాయి. దాన్ని ఏమి చేయాలో ఏది నొక్కాలో తెలియని కోతి సెల్ఫీలను తీసుకుంది. అందులో ఉన్న ఓ వీడియోలో కోతి ఆ ఫోన్ ను కొరికి తినేయాలని కూడా ప్రయత్నించింది. ఆ ఫోటోలను వీడియోలను తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చూపించగా వారు అసలు నమ్మలేకపోయారట. ఆ తర్వాత ఆ ఫోటోలను ట్విట్టర్ లో పోస్టు చేశాడు రోడ్జి. మొత్తం బ్లర్ గా ఉన్నాయి ఆ ఫోటోలు. కొన్ని కొన్ని ఫోటోలలో ఆ దొంగ కోతి ముఖాన్ని కూడా గమనించవచ్చు.  

ఈ ట్వీట్ ను 2.5 లక్షల మంది కంటే ఎక్కువ మంది చూశారు. తాము కూడా దీన్ని నమ్మలేకపోతున్నామని చాలా మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. కిటికీని తెరిచేయడం వలన ఆ కోతి ఇంట్లోకి ప్రవేశించి ఉంటుందని రోడ్జి భావిస్తూ ఉన్నాడు.   

 

పదేళ్ల బాలుడి సహస విన్యాసం.. చేతివేళ్లపై నుండి యాభై కార్లు!

పదేళ్ల బాలుడి సహస విన్యాసం.. చేతివేళ్లపై నుండి యాభై కార్లు!

   11 hours ago


కడుపు నిండా తినేసింది.. కదల లేక..!

కడుపు నిండా తినేసింది.. కదల లేక..!

   11 hours ago


ఐటీ ఉద్యోగాలకు ‘టీసీఎస్’‌ పరీక్ష.. 40 వేల ఉద్యోగాలు

ఐటీ ఉద్యోగాలకు ‘టీసీఎస్’‌ పరీక్ష.. 40 వేల ఉద్యోగాలు

   13 hours ago


నెగెటివ్‌ మార్కుల రద్దు.. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో 40% వస్తే పాస్‌

నెగెటివ్‌ మార్కుల రద్దు.. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో 40% వస్తే పాస్‌

   26-09-2020


భార్యపాదాలు భర్త తాకితేనే ఇప్పుడు వార్త.. బుల్లర్ చేసిన పని అదే మరి.

భార్యపాదాలు భర్త తాకితేనే ఇప్పుడు వార్త.. బుల్లర్ చేసిన పని అదే మరి.

   26-09-2020


లాక్ డౌన్ లో బాల్కనీలలో ఒకరినొకరు చూసుకున్నారు.. ఇప్పుడు ఎంగేజ్మెంట్

లాక్ డౌన్ లో బాల్కనీలలో ఒకరినొకరు చూసుకున్నారు.. ఇప్పుడు ఎంగేజ్మెంట్

   25-09-2020


నా శరీరాన్ని మద్యం, సోడా బాటిళ్లతో నింపకండి : ఉపాధ్యాయుడి ఆక్రందన

నా శరీరాన్ని మద్యం, సోడా బాటిళ్లతో నింపకండి : ఉపాధ్యాయుడి ఆక్రందన

   24-09-2020


వికటించిన ఆర్ఎంపీ వైద్యం.. విద్యార్థిని కాలికి ఇన్ఫెక్షన్

వికటించిన ఆర్ఎంపీ వైద్యం.. విద్యార్థిని కాలికి ఇన్ఫెక్షన్

   24-09-2020


మరకల జీన్స్ ప్యాంట్ ధర రూ.88,000..!

మరకల జీన్స్ ప్యాంట్ ధర రూ.88,000..!

   23-09-2020


కరోనా చికిత్స చేయించుకోవాలంటే అప్పులపాలవ్వాల్సిందేనా ?

కరోనా చికిత్స చేయించుకోవాలంటే అప్పులపాలవ్వాల్సిందేనా ?

   22-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle