newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

పొన్నాంబలమేడు కొండపై మకర జ్యోతి దర్శనం

16-01-202016-01-2020 09:19:48 IST
2020-01-16T03:49:48.877Z16-01-2020 2020-01-16T03:49:38.054Z - - 26-02-2020

 పొన్నాంబలమేడు కొండపై మకర జ్యోతి దర్శనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సంక్రాంతి వేళ అయ్యప్ప భక్తులంతా వేయికళ్ళతో ఎదురుచూసే అపూర్వ ఘట్టం పొన్నాంబలమేడుపై ఆవిష్కృతమయింది. మకరజ్యోతి దర్శనం అయ్యప్పలకు కనువిందు చేసింది. దీంతో వారంతా కనులారా జ్యోతిని తిలకించి పులకించి పోయారు. 

మకర సంక్రాంతి పర్వదినాన జనవరి 15న రాత్రి సుమారు 6 గంటల 51 నిమిషాల సమయంలో అయ్యప్ప భక్తులకు మకరజ్యోతి దర్శనం జరిగింది. ప్రతీ ఏటా సంక్రాంతి రోజు జరగనున్న ఈ దివ్య దర్శనం కోసం లక్షల సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమల వెళతారు. ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆరులక్షలమంది వరకూ భక్తులు మకరజ్యోతి నాడు శబరిమలలో అయ్యప్ప దర్శనం చేసుకున్నట్టు చెబుతున్నారు. 

1సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే శుభవేళ, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. అదే రోజు సాయంత్రం శబరిమల గిరులకు సమీపంలోని పొన్నాంబళ మేడుపై మకరజ్యోతి దర్శనం ఇవ్వడం పరిపాటిగా మారింది.

ఏటా ఈ మకరజ్యోతి దర్శనం జరుగుతుంది. దీంతో శబరిమల గిరులు భక్తులతో కిటకిటలాడతాయి. స్వామి కోసం పందళ రాజ వంశీకులు తీసుకుని వచ్చే ప్రత్యేక ఆభరణాలను సాయంత్రం ఆరున్నర గంటల తరువాత స్వామికి అలంకరించారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులుతీరడంతో శబరిమల భక్త.జనసంద్రంగా మారింది. కేరళ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. 

Image

video courtesy:mahaa News 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle