newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

పొగతాగేవారికి కరోనా రిస్క్ ఎక్కువట

08-07-202008-07-2020 08:57:59 IST
Updated On 08-07-2020 11:09:33 ISTUpdated On 08-07-20202020-07-08T03:27:59.280Z08-07-2020 2020-07-08T03:27:55.487Z - 2020-07-08T05:39:33.041Z - 08-07-2020

పొగతాగేవారికి కరోనా రిస్క్ ఎక్కువట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. అన్ని వయసుల వారు ఈ వైరస్ బారినపడుతున్నారు. కరోనా వైరస్ కొన్ని అలవాట్లున్నవారికి త్వరగా సోకుతుందని, వారికి రిస్క్ ఎక్కువని అంటున్నారు. సిగరెట్‌ తాగే అలవాటు ఉన్నవారిలో తీవ్రమైన అనారోగ్యానికి ఎక్కువ ప్రమాదం ఉన్నదని, ఇది కరోనా వైరస్ రోగుల మరణానికి దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 

ధూమపానం వల్ల ఆ ప్రమాదాల స్థాయి ఎంతో ఎక్కువగా ఉంటుందని అంటున్నారరు. ధూమపానం-కొవిడ్-19 మధ్య సంబంధంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ 34 అధ్యయనాలను సమీక్షించింది. వీటిలో వ్యాప్తి, దవాఖానాలో చేరడం, అనారోగ్యం, మరణం వంటివి ఉన్నాయి. దవాఖానాలో చేరిన కరోనా వైరస్ రోగుల్లో.. ధూమపానం చేసేవారి శాతం 18 శాతంగా ఉందని డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. సిగరెట్‌ స్మోకింగ్‌ అలవాటు ఉన్నవారు కరోనా వైరస్‌కు గురైతే వారికి అవసరమైన చికిత్స అందించనిపక్షంలో చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. 

మరోవైపు ఫ్రెంచ్ పరిశోధకులు ఏప్రిల్‌ నెలలో ఒక చిన్న అధ్యయనాన్ని విడుదల చేశారు. ధూమపానం చేసేవారు కొవిడ్-19 బారిన పడే ప్రమాదం మిగతా వారికంటే తక్కువే వుందని ప్రకటించి ఆశ్చర్చపరిచారు. అయితే, సిగరెట్‌ తంబాకుతో కలిసిన ఉన్న నికోటిన్.. కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గిస్తుందని వారు విశ్వసించారు. ఈ పరిశోధనలను చాలా మంది శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ధూమపానం కారణంగా అనారోగ్యానికి గురై చనిపోయే పరిస్థితులు ఎక్కువగా పెరిగినట్లు అందుబాటులో ఉన్న సాక్ష్యాలు సూచిస్తున్నాయి. అందువలన ప్రజలు ధూమపానం మానేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా.. కరోనా వైరస్‌ వ్యాప్తికి గురికాకుండా ఉండగలరంటున్నారు.

ఇదిలా ఉంటే కరోనా ప్రారంభదశలోనే పొగతాగేవారికి ఏర్పడుతున్న ప్రమాదాన్ని డాక్టర్లు గుర్తించారు. కరోనా వైరస్‌ వ్యాపించేందుకు పొగతాగేవారికి 14 రెట్లు ఎక్కువ అవకాశముందని చైనా శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. చైనాలో కరోనా సోకిన వేలాది మందిపై పరిశోధనలు చేసి.. అక్కడ వెలువడే హెల్త్‌ జనరల్‌లో ఈ విషయాన్ని ప్రచురించారు. కరోనా సోకితే ఛాతీ, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా వుంటుంది.

పొగతాగేవారికి ఊపిరితిత్తులు తీవ్ర వత్తిడికి గురవుతాయి. వారికి శ్వాస తీసుకోవడంలో సమస్య ఏర్పడుతుంది. మధుమేహం, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఎక్కువ మంది దీనికి బలి అవుతున్నారు. పొగ తాగేవారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడంతో కరోనా సులభంగా వ్యాపిస్తుందని, ఇప్పటికైనా పొగతాగే అలవాటును మానుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle