newssting
BITING NEWS :
* టీడీపీలో సంక్షోభం.. నలుగురు రాజ్యసభ ఎంపీల తిరుగుబాటు.. తమను బీజేపీలో విలీనం చేయాలని లేఖ *టీడీపీ రాజ్యసభ ఎంపీలకు స్వాగతం పలికిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా * పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ *కాకినాడలో కాపు నేతల రహస్య సమావేశం *టీటీడీ చైర్మన్‌ పదవికి పుట్టా సుధాకర్‌ రాజీనామా*లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా *కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

పిడుగులు ఎందుకంత ప్రమాదం?

13-04-201913-04-2019 14:34:22 IST
2019-04-13T09:04:22.447Z13-04-2019 2019-04-13T09:04:20.421Z - - 21-06-2019

పిడుగులు ఎందుకంత ప్రమాదం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వర్షాకాలంలోనే కాదు వేసవిలోనూ పిడుగులు పడుతుంటాయి. అయితే గతంలో కంటే ఇటీవలికాలంలో పిడుగులు అనేకమంది ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. జనావాసాలు. బిల్డింగులు. వ్యవసాయ క్షేత్రాల్లో పిడుగులు పడడం వల్ల పశుసంపద, జనం ప్రాణాలు, ఆస్తినష్టం కలుగుతోంది. సాధారణంగా మేఘాల నుంచి పడే 'పిడుగు'లో దాదాపు 30 కోట్ల వోల్టుల విద్యుత్ ఉంటుంది, అది మనిషిని అక్కడిక్కడే కాల్చి బూడిద చేయగల ప్రమాదకరమయినది. ప్రధానంగా ఎండా కాలంలో సముద్ర తీర ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. దాంతో ఆ ప్రాంతాల్లో పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు ఇంట్లో ఉంటే బయటకు రాకపోవడమే మంచిదంటున్నారు వాతావరణ నిపుణులు.

ప్రయాణం చేస్తూ కారులో ఉంటే అందులోనే ఉండటం ఉత్తమం. పొలాల్లో పనిచేసే రైతులు ఇళ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. సెల్‌ఫోన్‌, ఎఫ్‌ఎం రేడియో వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. ఒకవేళ తలదాచుకునేందుకు ఆశ్రయం లేనప్పుడు తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నించాలి. మోకాళ్లపై చేతులు, తల పెట్టి దగ్గరగా ముడుచుకుని కూర్చోవాలి. దాంతో ఆ పిడుగు పడినప్పుడు వెలువడే విద్యుత్ ప్రభావం మన మీద తక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. 

ఒకవేళ నీటిలో ఉన్నట్టయితే సాధ్యమైనంత త్వరగా బయటకు వెళ్లాలి. ఇళ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్లను ఆపేయాలి. లేదంటే పిడుగు పడినప్పుడు విద్యుత్ తీగల ద్వారా హై వోల్టేజీ ప్రవహించడంతో అవి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటి ఫ్లగ్లు కూడా తీసేయడం మంచిది. అలాగే ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలకు దూరంగా ఉండాలి. భూమి పొడిగా ఉన్న చోటుకి వెళ్లాలి. చెట్ల కిందకు, టవర్ల కిందకు వెళ్లకూడదు.ఉరుములతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని తెలిస్తే బయటకు వెళ్లకుండా పనులను వాయిదా వేసుకోవాలి. ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు స్నానం చేయడం, పాత్రలు కడగటం ఆపేయాలి. ఎందుకంటే లోహపు పాత్రలు, పైపుల ద్వారా ఒక్కసారిగా పెద్దమొత్తంలో విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగకుండా వుంటాయి. ప్రాణనష్టం తగ్గుతుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle