newssting
BITING NEWS :
మహారాష్ట్ర సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కలయికతో కూడిన మహావికాస్ ఆఘాదీ ప్రభుత్వం స్వయంగా కుప్పకూలిపోతుందన్న ఫడణవీస్. కూటమిని అధికారం నుంచి తొలగించడానికి బీజేపీ ఏం చేయనవసరం లేదని చెప్పిన ఫడణవీస్ * బీహార్ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు 30వేల మంది కేంద్ర బలగాలను పంపించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయం. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ నిర్వహించేందుకు వీలుగా 30వేల మంది కేంద్ర బలగాల జవాన్లతో ఏర్పాటు చేయనున్న బందోబస్తు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలలో కేంద్ర అదనపు బలగాలతో రక్షణ * చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల అగ్రరాజ్యంలోని దిగ్గజ కంపెనీల ఆగ్రహం. 30 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌లో కేసులు వేసిన 3,500 కంపెనీలు * కర్ణాటక రాష్ట్రం కలబుర్గి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. సావళగి క్రాస్‌ అళంద రోడ్డుపై తెల్లవారుజామున రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి. నెలలు నిండిన మహిళకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా ప్రమాదం * 286వ రోజుకు చేరుకున్న అమరావతి రాజధాని రైతుల ఉద్యమం. గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం * ఏపీ‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ. ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి. బ్రహ్మోత్సవాల అనంతరం స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వెల్లంపల్లి * ప్రకాశం బ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న కృష్ణా నది. కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక. ప్రాజెక్టు వద్ద 6,65,925 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచన * తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన రథం నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ * యాదాద్రి-భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం ప్రొద్దుటూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాని కుప్పకూలిన పెంకుటిల్లు. అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఇల్లు. శబ్దాన్ని గమనించిన నలుగురు కుటుంబ సభ్యులు వెంటనే బయటకు రావడంతో తప్పిన ప్రాణాపాయం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం. 20 క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. 4,19,454 క్యూసెక్కులుగా ఉన్న ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 310.252 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులు * రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు తెలంగాణ ఎంసెట్ పరీక్ష. ఉదయం, మధ్యాహ్నం రెండు షెషన్‌లలో పరీక్ష నిర్వహణ. తెలంగాణ, ఆంధ్రాలో కలిపి మొత్తం 84 సెంటర్లలో పరీక్షను నిర్వహణ. తెలంగాణలో 67, ఆంధ్రాలో 17 పరీక్షా కేంద్రాలు

పాక్‌లో కొత్త శిక్ష.. రేప్ చేస్తే మగతనం కట్!

15-09-202015-09-2020 14:19:09 IST
2020-09-15T08:49:09.609Z15-09-2020 2020-09-15T08:49:06.683Z - - 28-09-2020

పాక్‌లో కొత్త శిక్ష.. రేప్ చేస్తే మగతనం కట్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చట్టాలు ఎన్ని తెచ్చినా.. శిక్షలు ఎంత పెద్దవి వేసినా దేశంలో అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. కామాంధులు ముక్కుపచ్చలారని పిల్లల నుండి వృద్దులపై కూడా అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. దేశాలకు దేశాలనే ఊపేసిన ఘటనలు వచ్చినా.. బాధితుల పేరు మీద కొత్త కొత్త చట్టాలు తెచ్చినా మానభంగాలకు మాత్రం ఫుల్ స్టాప్ పడడం లేదు. ఇది ఒక్క మనదేశంలోనే కాదు మన పొరుగు శత్రు దేశమైన పాకిస్తాన్ లో కూడా ఇదే పరిస్థితి. పాక్ లో మృగాలు రెచ్చిపోయి రోడ్డు మీద కనిపించిన మహిళను ఎత్తుకెళ్ళి రేప్ చేసిన ఘటన ఒకటి ఆ దేశాన్ని ఊపేస్తోంది.

పాక్ ప్రధాన నగరం లాహోర్ సమీపంలో ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి కారులో వెళ్తుండగా పెట్రోల్ అయిపోయింది. దాంతో ఆ మహిళ సాయం కోసం రోడ్డు మీద వేచి ఉండగా అటుగా వెళ్తున్న వ్యక్తులు ఆమెను చూసి ఆగారు. సాయం చేస్తామంటూ దగ్గరికొచ్చి ఆపై మహిళను బెదిరించి పిల్లల ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పాకిస్తాన్ అంతటా నిరసనలు రేకెత్తుతుండగా వందలాది మంది మహిళలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రోడ్ల మీదికి వచ్చారు.

ఈ ఘటనపై లాహోర్ సిటీ పోలీస్ కమిషనర్ ఉమర్ షేక్ చీకటి పడుతుండగా మహిళ ఒంటరిగా డ్రైవింగ్ చేయడం ఏంటి బుద్ధిలేని పని అంటూ వ్యాఖ్యానించడంతో ఈ ఘటన పాక్ లో తీవ్ర వివాదంగా మారింది. ఎక్కడిక్కడ మహిళలు నిరసనలకు దిగడంతో కమిషనరుపై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మండిపడింది. తిరిగి కమిషనర్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది. కాగా ఈ ఘటనపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కెమికల్ కాస్ట్రేషన్ ప్రయోగించాలని ఇమ్రాన్ ఆదేశించారు. ఇప్పటికే చాలా దేశాలలో ఇది అమలు చేయబడుతుందని చెప్పిన ఇమ్రాన్ హత్యలకు ఏవిధంగానైతే గ్రేడింగ్ ఉంటుందో అలాగే అత్యాచారాలకు కూడా గ్రేడింగ్ చేసి లైంగిక నేరాలకు పాల్పడిన వారికి ఫస్ట్ డిగ్రీ అమలుచేయాలని సూచించారు. ఆ ఫస్ట్ డిగ్రీలో కెమికల్ కాస్ట్రేషన్‌ను చేర్చి అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై కెమికల్ కాస్ట్రేషన్‌ ద్వారా మగతనాన్ని తగ్గించి మళ్లీ జీవితంలో లైంగిక కార్యాకలాపాలకు పనిరాకుండా చేయాలని ఆదేశించారు. 

 

పదేళ్ల బాలుడి సహస విన్యాసం.. చేతివేళ్లపై నుండి యాభై కార్లు!

పదేళ్ల బాలుడి సహస విన్యాసం.. చేతివేళ్లపై నుండి యాభై కార్లు!

   11 hours ago


కడుపు నిండా తినేసింది.. కదల లేక..!

కడుపు నిండా తినేసింది.. కదల లేక..!

   11 hours ago


ఐటీ ఉద్యోగాలకు ‘టీసీఎస్’‌ పరీక్ష.. 40 వేల ఉద్యోగాలు

ఐటీ ఉద్యోగాలకు ‘టీసీఎస్’‌ పరీక్ష.. 40 వేల ఉద్యోగాలు

   13 hours ago


నెగెటివ్‌ మార్కుల రద్దు.. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో 40% వస్తే పాస్‌

నెగెటివ్‌ మార్కుల రద్దు.. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో 40% వస్తే పాస్‌

   26-09-2020


భార్యపాదాలు భర్త తాకితేనే ఇప్పుడు వార్త.. బుల్లర్ చేసిన పని అదే మరి.

భార్యపాదాలు భర్త తాకితేనే ఇప్పుడు వార్త.. బుల్లర్ చేసిన పని అదే మరి.

   26-09-2020


లాక్ డౌన్ లో బాల్కనీలలో ఒకరినొకరు చూసుకున్నారు.. ఇప్పుడు ఎంగేజ్మెంట్

లాక్ డౌన్ లో బాల్కనీలలో ఒకరినొకరు చూసుకున్నారు.. ఇప్పుడు ఎంగేజ్మెంట్

   25-09-2020


నా శరీరాన్ని మద్యం, సోడా బాటిళ్లతో నింపకండి : ఉపాధ్యాయుడి ఆక్రందన

నా శరీరాన్ని మద్యం, సోడా బాటిళ్లతో నింపకండి : ఉపాధ్యాయుడి ఆక్రందన

   24-09-2020


వికటించిన ఆర్ఎంపీ వైద్యం.. విద్యార్థిని కాలికి ఇన్ఫెక్షన్

వికటించిన ఆర్ఎంపీ వైద్యం.. విద్యార్థిని కాలికి ఇన్ఫెక్షన్

   24-09-2020


మరకల జీన్స్ ప్యాంట్ ధర రూ.88,000..!

మరకల జీన్స్ ప్యాంట్ ధర రూ.88,000..!

   23-09-2020


కరోనా చికిత్స చేయించుకోవాలంటే అప్పులపాలవ్వాల్సిందేనా ?

కరోనా చికిత్స చేయించుకోవాలంటే అప్పులపాలవ్వాల్సిందేనా ?

   22-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle