newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

నేనే పరమశివుడ్ని.. నన్నెవరేం చేయలేరు!

08-12-201908-12-2019 13:45:46 IST
2019-12-08T08:15:46.808Z08-12-2019 2019-12-08T08:15:23.406Z - - 11-08-2020

 నేనే పరమశివుడ్ని.. నన్నెవరేం చేయలేరు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిత్యానంద స్వామి ...ఇప్పుడీ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నిత్యానందస్వామి ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.  అత్యాచారం, మహిళల అక్రమ నిర్బంధం కేసులతో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటూ నిత్యానందస్వామి దేశం వదిలి పారిపోయిన సంగతి తెలిసిందే.

ఆయన పాస్ పోర్టు కూడా రద్దయింది. ఈక్వెడార్ లోని ఒక దీవిని కొనుగోలు చేశాడన్న వార్తలు సంచలనం రేపాయి.ఆ దేశానికి ప్రత్యేకంగా పాస్ పోర్ట్, వీసా కూడా రెడీ చేస్తున్నాడని వార్తలు హల్ చల్ చేశాయి. తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలతో స్వామీ నిత్యానంద మరోసారి వార్తల్లోకి వచ్చారు.

నిత్యానంద ఎక్కడ, ఎప్పుడు మాట్లాడాడనేది తెలియదు కానీ తనను ఎవ్వరూ టచ్ చేయలేరని, ఏ న్యాయవ్యవస్థ తనకు శిక్ష విధించలేదని కామెంట్ చేశాడు. నిత్యానందపై ఇప్పటికే లెక్కలేనన్ని కేసులున్నాయి. అనేక వివాదాలున్నాయి. 

'నన్ను ఎవ్వరూ టచ్ చేయలేరు.. ఏ స్టుపిడ్‌ కోర్టు నన్ను ప్రాసిక్యూట్ చేయలేదు.. నేను పరమశివుడిని.. నేను నిజం చెప్పగలను.. మీ ముందు నా నిజాయితీని నిరూపించుకుంటాను' అంటూ తన వీడియోలో మాట్లాడారు. వీడియోకి సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. కానీ నిత్యానంద మాటలు మాత్రం వైరల్ అవుతున్నాయి. 

అలాగే కైలాస దేశం అంటూ ఈక్వెడార్ లో ఓ దీవిని కొనుగోలు చేశాడనే వార్తలు ఈక్వెడార్ ఖండించింది. స్వామిజీ నిత్యానందకు తమ దేశం ఆశ్రయం కల్పించలేదని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయం స్పందించింది.

ఆ వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఆశ్రయం కోసం నిత్యానంద దరఖాస్తు చేసుకున్నాడని, అయితే ఈ శరణార్థి దరఖాస్తును తమ ప్రభుత్వం తిరస్కరించిందని వివరించింది. 

ఈక్వెడార్‌ లో చుక్కెదురు కావడంతో నిత్యానంద మకాం మార్చాడు. నిత్యానంద హైతీ వెళ్లాడని పేర్కొంది.. నిత్యానందకు చెందిన కైలాస వెబ్‌సైట్‌లోని సమాచారం ఆధారంగా పలు కథనాలు వెలువడ్డాయని.. అందులో వాస్తవాలు లేవని తెలిపింది. నిత్యానందకు సంబంధించిన విషయాల్లో ఈక్వెడార్‌ పేరును వాడటం మానుకోవాలని మీడియాను కోరింది. మొత్తం మీద ఈ బురిడీ స్వామీజీ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle