newssting
BITING NEWS :
మహారాష్ట్ర సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కలయికతో కూడిన మహావికాస్ ఆఘాదీ ప్రభుత్వం స్వయంగా కుప్పకూలిపోతుందన్న ఫడణవీస్. కూటమిని అధికారం నుంచి తొలగించడానికి బీజేపీ ఏం చేయనవసరం లేదని చెప్పిన ఫడణవీస్ * బీహార్ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు 30వేల మంది కేంద్ర బలగాలను పంపించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయం. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ నిర్వహించేందుకు వీలుగా 30వేల మంది కేంద్ర బలగాల జవాన్లతో ఏర్పాటు చేయనున్న బందోబస్తు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలలో కేంద్ర అదనపు బలగాలతో రక్షణ * చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల అగ్రరాజ్యంలోని దిగ్గజ కంపెనీల ఆగ్రహం. 30 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌లో కేసులు వేసిన 3,500 కంపెనీలు * కర్ణాటక రాష్ట్రం కలబుర్గి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. సావళగి క్రాస్‌ అళంద రోడ్డుపై తెల్లవారుజామున రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి. నెలలు నిండిన మహిళకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా ప్రమాదం * 286వ రోజుకు చేరుకున్న అమరావతి రాజధాని రైతుల ఉద్యమం. గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం * ఏపీ‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ. ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి. బ్రహ్మోత్సవాల అనంతరం స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వెల్లంపల్లి * ప్రకాశం బ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న కృష్ణా నది. కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక. ప్రాజెక్టు వద్ద 6,65,925 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచన * తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన రథం నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ * యాదాద్రి-భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం ప్రొద్దుటూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాని కుప్పకూలిన పెంకుటిల్లు. అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఇల్లు. శబ్దాన్ని గమనించిన నలుగురు కుటుంబ సభ్యులు వెంటనే బయటకు రావడంతో తప్పిన ప్రాణాపాయం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం. 20 క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. 4,19,454 క్యూసెక్కులుగా ఉన్న ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 310.252 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులు * రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు తెలంగాణ ఎంసెట్ పరీక్ష. ఉదయం, మధ్యాహ్నం రెండు షెషన్‌లలో పరీక్ష నిర్వహణ. తెలంగాణ, ఆంధ్రాలో కలిపి మొత్తం 84 సెంటర్లలో పరీక్షను నిర్వహణ. తెలంగాణలో 67, ఆంధ్రాలో 17 పరీక్షా కేంద్రాలు

నిద్రపోతూ ఉండగా.. కాలును ఏదో తాకినట్లు అనిపించగా..!

15-09-202015-09-2020 15:41:52 IST
2020-09-15T10:11:52.818Z15-09-2020 2020-09-15T10:11:50.081Z - - 29-09-2020

నిద్రపోతూ ఉండగా.. కాలును ఏదో తాకినట్లు అనిపించగా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మసాచుసెట్స్ కు చెందిన ఓ వ్యక్తి స్విమ్మింగ్ పూల్ కు దగ్గరలో నిద్రపోతూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఏదో తన కాలును తాకుతూ ఉందని భావించి కళ్లు తెరచి చూశాడు. తీరా చూస్తే అదొక ఎలుగు బంటి..! దాన్ని చూసి అతడు ఎంత షాక్ అయ్యాడో.. మనిషి మేలుకున్నాడనే షాక్ తో ఆ భల్లూకం కూడా అంతే షాక్ అయ్యింది. ఈ ఘటన అంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.

గ్రీన్ ఫీల్డ్ కు చెందిన మాథ్యూ బీటే శనివారం నాడు తన స్విమ్మింగ్ పూల్ ముందు పడుకున్నాడు. గేటును మూసివేయకపోవడంతో అక్కడికి ఓ ఎలుగుబంటి వచ్చింది. స్విమ్మింగ్ పూల్ లోని నీటిని తాగింది. ఆ తర్వాత తన దారిలో తాను వెళ్లిపోవాలని అనుకుంది.

20 ఏళ్ళుగా మగ తోడు లేదు.. కానీ గుడ్లు పెట్టిన పైథాన్!

ఇంతలో అక్కడ చైర్ మీద మాథ్యూ పడుకుని ఉండడాన్ని గమనించింది.. అతడి దగ్గరకు వచ్చి మొదట వాసన చూడడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ముందు పాదాలతో అతడిని తాకడం మొదలు పెట్టింది. ఇంతలో మాథ్యూకు మెలుకువ వచ్చేసింది. మాథ్యూ లేవగానే అది కూడా కాస్త షాక్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోబోయింది. వెంటనే మాథ్యూ తన ఫోన్ ను తీసుకుని ఎలుగుబంటి ఫోటోలను తీశాడు. ఆ ఫోటోలను తన భార్య డాన్ బీటీకి పంపించాడు.

డాన్ బీటీ తన ఫేస్ బుక్ పేజీలో ఈ వీడియోను పోస్టు చేసింది. చాలా మంది ఈ వీడియోను చూసి షాక్ తిన్నారు. చాలా దగ్గరగా వచ్చింది ఆ ఎలుగుబంటి అని పలువురు కామెంట్లు చేయగా..! చాలా భయంగా ఉంటుంది కదా అని మరికొందరు తమ అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. మసాచుసెట్స్ రాష్ట్రంలో నలుపు రంగు ఎలుగుబంట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం 4500కు పైగా నలుపు రంగు ఎలుగుబంట్లు ఉంటాయని అంచనా..!  

కుక్క, తాబేలు ఫుట్ బాల్.. మీరెప్పుడైనా చూశారా?!

 

https://www.facebook.com/dawn.bete/videos/10158517081187597/?t=5

పదేళ్ల బాలుడి సహస విన్యాసం.. చేతివేళ్లపై నుండి యాభై కార్లు!

పదేళ్ల బాలుడి సహస విన్యాసం.. చేతివేళ్లపై నుండి యాభై కార్లు!

   11 hours ago


కడుపు నిండా తినేసింది.. కదల లేక..!

కడుపు నిండా తినేసింది.. కదల లేక..!

   12 hours ago


ఐటీ ఉద్యోగాలకు ‘టీసీఎస్’‌ పరీక్ష.. 40 వేల ఉద్యోగాలు

ఐటీ ఉద్యోగాలకు ‘టీసీఎస్’‌ పరీక్ష.. 40 వేల ఉద్యోగాలు

   14 hours ago


నెగెటివ్‌ మార్కుల రద్దు.. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో 40% వస్తే పాస్‌

నెగెటివ్‌ మార్కుల రద్దు.. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో 40% వస్తే పాస్‌

   26-09-2020


భార్యపాదాలు భర్త తాకితేనే ఇప్పుడు వార్త.. బుల్లర్ చేసిన పని అదే మరి.

భార్యపాదాలు భర్త తాకితేనే ఇప్పుడు వార్త.. బుల్లర్ చేసిన పని అదే మరి.

   26-09-2020


లాక్ డౌన్ లో బాల్కనీలలో ఒకరినొకరు చూసుకున్నారు.. ఇప్పుడు ఎంగేజ్మెంట్

లాక్ డౌన్ లో బాల్కనీలలో ఒకరినొకరు చూసుకున్నారు.. ఇప్పుడు ఎంగేజ్మెంట్

   25-09-2020


నా శరీరాన్ని మద్యం, సోడా బాటిళ్లతో నింపకండి : ఉపాధ్యాయుడి ఆక్రందన

నా శరీరాన్ని మద్యం, సోడా బాటిళ్లతో నింపకండి : ఉపాధ్యాయుడి ఆక్రందన

   24-09-2020


వికటించిన ఆర్ఎంపీ వైద్యం.. విద్యార్థిని కాలికి ఇన్ఫెక్షన్

వికటించిన ఆర్ఎంపీ వైద్యం.. విద్యార్థిని కాలికి ఇన్ఫెక్షన్

   24-09-2020


మరకల జీన్స్ ప్యాంట్ ధర రూ.88,000..!

మరకల జీన్స్ ప్యాంట్ ధర రూ.88,000..!

   23-09-2020


కరోనా చికిత్స చేయించుకోవాలంటే అప్పులపాలవ్వాల్సిందేనా ?

కరోనా చికిత్స చేయించుకోవాలంటే అప్పులపాలవ్వాల్సిందేనా ?

   22-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle